
భారతదేశానికి సంబంధించిన రహస్యాలను పాకిస్తాన్‌కు చేరవేశారన్న ఆరోపణతో జైలులో చిత్రహింసలు అనుభవించి బయటకు వచ్చిన తరువాత తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకున్న నంబి నారాయణన్ గొప్పతనాన్ని మాత్రమే కాకుండా ఆయనలోని నెగెటివ్ కోణాన్నీ
ప్రఖ్యాత ఇస్రో శాస్తవేత్త నంబి నారాయణన్‌లోని నెగెటివ్ కోణాన్ని తమ సినిమాలో చూపించినట్లు నటుడు మాధవన్ తెలిపారు. ఈయన తొలిసారిగా మెగాఫోన్ పట్టి స్వీయ నిర్మాణంలో కథానాయకుడిగా నటించిన రాకెట్రీ చిత్రాన్ని పాన్‌ఇండియా మూవీగా తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రూపొందించారు. ఈ సినిమా జులై ఒకటో తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా బుధవారం మాధవన్ చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత చరిత్ర తెరకెక్కించే ముందు తాను ఆయన్ని కలిశానని చెప్పారు.
ఆయన చెప్పిన వివరాలు తనను ఆశ్చర్యచకితుడిని చేశాయన్నారు. భారతదేశానికి సంబంధించిన రహస్యాలను పాకిస్తాన్‌కు చేరవేశారన్న ఆరోపణతో జైలులో చిత్రహింసలు అనుభవించి బయటకు వచ్చిన తరువాత తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకున్న నంబి నారాయణన్ గొప్పతనాన్ని మాత్రమే కాకుండా ఆయనలోని నెగెటివ్ కోణాన్ని ఆవిష్కరించినట్లు తెలిపారు. సహజత్వం కోసం తాను ఎలాంటి విగ్గు లేకుండా నంబి నారాయణన్‌లా తయారయ్యానని చెప్పారు. ఇందులో నటుడు షారుక్‌ఖాన్, సూర్య అతిథి పాత్రల్లో ఎలాంటి పారితోషికం తీసుకోకుండా మరీ నటించారని చెప్పారు.
చదవండి: ఓటీటీలోనూ 'ఆర్‌ఆర్‌ఆర్' రికార్డు..
‘సమ్మతమే’ మూవీ రివ్యూ