
‘‘రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్’ సినిమాకి ఆరేళ్లు పట్టింది. సాధారణంగా స్పేస్ సినిమాల్లో రాకెట్స్‌ను, స్పేస్ షిప్స్‌ను చూస్తుంటాం. కానీ ఏ సినిమాలోనూ రాకెట్ ఇంజిన్‌ను చూపించి ఉండరు. తొలిసారి మా సినిమాలో చూపించబోతున్నాం’’
R Madhavan Says Nambi Narayanan Is James Bond: ‘‘రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్’ సినిమాకి ఆరేళ్లు పట్టింది. సాధారణంగా స్పేస్ సినిమాల్లో రాకెట్స్‌ను, స్పేస్ షిప్స్‌ను చూస్తుంటాం. కానీ ఏ సినిమాలోనూ రాకెట్ ఇంజిన్‌ను చూపించి ఉండరు. తొలిసారి మా సినిమాలో చూపించబోతున్నాం’’ అని హీరో ఆర్. మాధవన్ అన్నారు. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ బయోపిక్‌గా తెరకెక్కిన చిత్రం ‘రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్’. ఆర్. మాధవన్ లీడ్ రోల్‌లో నటించి, దర్శకత్వం వహించారు.
మాధవన్, సరితా మాధవన్, వర్గీస్ మూలన్, విజయ్ మూలన్ నిర్మించిన ఈ సినిమా జూలై 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఆర్. మాధవన్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘మన దేశానికి చెందిన రాకెట్రీ సీక్రెట్స్‌ను నంబి నారాయణన్ పాకిస్థాన్‌కి అమ్మేశారనే నేరం కింద ఆయన్ని అరెస్ట్ చేసి, చిత్రహింసలు పెట్టారు. కానీ సీబీఐ దర్యాప్తులో ఆయన నిరపరాధిగా నిరూపించబడ్డారు ? అదే ఈ చిత్రకథ. ఆయన లైఫ్ నాకు పేదవాడి జేమ్స్ బాండ్ స్టోరీలా అనిపించింది.
చదవండి: హీరోను దుమ్మెత్తిపోసిన నెటిజన్లు.. సైలెంట్‌గా ఉండమని కామెంట్లు..
ఏడాదిన్నర పాటు ఈ కథను తయారు చేశాను. సైన్స్, టెక్నాలజీ రంగంలో చాలామంది మేధావులున్నారు. వారి గురించి ఈ ప్రపంచానికి తెలియజేయాలనే ‘రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్’ సినిమా చేశాను. ఈ సినిమాకి నేను ప్రోస్థటిక్ మేకప్స్ ఉపయోగించలేదు. నంబి నారాయణన్‌లా కనిపించటానికి బాగా కష్టపడ్డాను. ‘బాహుబలి’ వంటి గొప్ప సినిమాను చేయడానికి ఆ టీమ్ ఎంత కష్టపడ్డారో ‘రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్’ కోసం మా టీమ్ కూడా అంతే కష్టపడింది’’ అని మాధవన్ తెలిపారు.
చదవండి: తెరపైకి అటల్ బిహారీ వాజ్‌పేయి జీవిత కథ..