‘రాకెట్రీ : ది నంబి ఎఫెక్ట్‌’ | Nambi Narayanan Biopic Rocketry Teaser | Sakshi
Sakshi News home page

Published Wed, Oct 31 2018 11:59 AM | Last Updated on Wed, Oct 31 2018 1:14 PM

Nambi Narayanan Biopic Rocketry Teaser - Sakshi

ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలో బయోపిక్‌ల సీజన్‌ నడుస్తోంది. సినీ రాజకీయా క్రీడా ప్రముఖుల జీవిత కథల నేపథ్యంలో పలు భాషల్లో సినిమాలు రూపొందుతున్నాయి. తాజాగా ఈ లిస్ట్‌లో ఓ సైంటిస్ట్‌ కూడా చేరబోతున్నాడు. ప్రస్తుతం ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ జీవిత కథ ఆధారంగా రాకెట్రీ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. 

ఈ సినిమాలో టైటిల్‌ రోల్‌లో బహు భాష నటుడు మాధవన్‌ కనిపించనున్నాడు. త‌మిళ ద‌ర్శకుడు అనంత మ‌హ‌దేవ‌న్‌తో కలిసి మాధవన్‌ స్వయంగా దర్శకత్వం వహిస్తున్నాడు. నంబి నారాయ‌ణ్ జీవితంలోని మూడు ప్రధాన కోణాల‌ని బ‌యోపిక్‌లో చూపించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ, ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2019 సమ్మర్‌కు రిలీజ్ చేయనున్నారు.

రాకెట్రీ తెలుగు టీజర్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement