Rocketry: The Nambi Effect Movie OTT Release Date Confirmed, Deets Inside - Sakshi
Sakshi News home page

Rocketry: The Nambi Effect : ఓటీటీలో వచ్చేస్తున్న ‘రాకెట్రీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..

Published Wed, Jul 20 2022 12:39 PM | Last Updated on Wed, Jul 20 2022 12:47 PM

Rocketry: The Nambi Effect Movie OTT Release Date Out - Sakshi

విలక్షణ నటుడు ఆర్‌ మాధవన్‌ స్వయంగా దర్శకత్వం వహిస్తూ నటించిన సినిమా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. జులై 1న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ని దక్కించుకుంది. మాధవన్‌ టేకింగ్‌,యాక్టింగ్‌పై విమర్శకులు సైతం ప్రశంసల జల్లు కురిపించారు. దాదాపు రూ.25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం  రూ. 40 కోట్ల వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. 

(చదవండి: ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’  మూవీ రివ్యూ)

ఇప్పటి వరకు థియేటర్స్‌లో సందడి చేసిన ఈ చిత్రం.. ఇక ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమైంది. ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో జులై 26 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంటుంది.  ఈ విషయాన్ని అమెజాన్‌ ప్రైమ్‌ సంస్థ అధికారికంగా తెలియజేస్తూ ఓ స్పెషల్‌ పోస్టర్‌ని విడుదల చేసింది. రితా మాధవన్, వర్గీస్‌ మూలన్, విజయ్‌ మూలన్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో సిమ్రాన్‌, రవి రాఘవేంద్ర, మిషా ఘోషాల్‌ ఇతర కీలక పాత్రల్లో నటించారు. 


 

(చదవండి: చేయని నేరానికి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు.. నంబి నారాయణన్‌ రియల్‌ స్టోరీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement