
హీరోలుగా మంచి ఫాంలో ఉన్న నటులు కూడా ఇటీవల ప్రతినాయక పాత్రల్లో నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. తాజాగా నాగచైతన్య హీరోగా తెరకెక్కిన సవ్యసాచి సినిమాతో టాలీవుడ్‌కు విలన్‌గా పరిచయం అయ్యాడు మాధవన్. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాదించకపోయినా మాధవన్ నటనకు మంచి పేరు వచ్చింది.
దీంతో మరిన్ని సినిమాల్లో మాధవన్ ప్రతినాయక పాత్రల్లో నటించేందుకు రెడీ అవుతున్నట్టుగా వార్తలు వినిపించాయి. ముఖ్యంగా రవితేజ హీరోగా వీఐ ఆనంద్ తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ సినిమాలో మాధవన్ విలన్‌గా నటిస్తున్నాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై స్పందించిన మాధవన్ తాను రవితేజ సినిమాలో నటించటం లేదని.. ఆ వార్తల్లో నిజం లేదంటూ క్లారిటీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment