యస్... నాగచైతన్య–చందూ మొండేటి–మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్ మూవీకి అంతా సవ్యంగా జరుగుతోంది. బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ. ఆర్టిస్టులు రెడీ. ఇప్పుడు షూటింగ్‌కి కూడా అంతా రెడీ అయిపోయింది. సినిమా టైటిల్ ‘సవ్యసాచి’. అంటే... రెండు చేతులకూ సమాన బలం ఉన్నవాడు అని అర్థం. సినిమాలో చైతూ లెఫ్ట్ హ్యాండ్ అతని మాట వినదు. అసలు కంట్రోల్‌లో ఉండదు. కానీ, సినిమాని ఫుల్ కంట్రోల్‌లో తీస్తామని, సవ్యంగా జరిగేలా ప్లాన్ చేశామని చిత్రబృందం అంటోంది.
మొత్తానికి చైతూని వెరైటీ రోల్‌లో చూడబోతున్నామని టైటిల్ చెబుతోంది. వై. నవీన్, వై. రవిశంకర్, మోహన్ (సీవీఎం) నిర్మిస్తోన్న ఈ చిత్రం బుధవారం మొదలైంది. హైదరాబాద్‌లో వేసిన సెట్‌లో షూటింగ్ మొదలుపెట్టారు. బాలీవుడ్ భామ నిధీ అగర్వాల్ నాయికగా నటిస్తోన్న ఈ చిత్రంలో మాధవన్ ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘నాగచైతన్య–చందూ మొండేటి కాంబినేషన్‌లో వచ్చిన ‘ప్రేమమ్’ ఎంత హిట్టయిందో తెలిసిందే.
అది ప్రేమకథా చిత్రమైతే.. ఇది హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్. హీరో క్యారెక్టరైజేషన్‌కు ‘సవ్యసాచి’ అనేది యాప్ట్ టైటిల్. ఫస్ట్ షెడ్యూల్ 15 రోజుల పాటు జరుగుతుంది. హీరో, హీరోయిన్, ‘వెన్నెల’ కిశోర్, సత్య కాంబినేషన్‌లో సీన్స్ తీస్తాం. డిసెంబర్‌లో జరిగే షెడ్యూల్‌లో మాధవన్ పాల్గొంటారు’’ అన్నారు. రావు రమేశ్, తాగుబోతు రమేశ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యం.యం. కీరవాణి, కెమెరా: యువరాజ్, సీఈవో: చిరంజీవి (చెర్రీ), లైన్ ప్రొడ్యూసర్: పీటీ గిరిధర్.
Comments
Please login to add a commentAdd a comment