సవ్యసాచి... ఎటు నీ చూపుల గురి? | Naga Chaitanya’s Birthday Gift – Chaitu’s First Look in Savyasachi | Sakshi
Sakshi News home page

సవ్యసాచి... ఎటు నీ చూపుల గురి?

Published Thu, Nov 23 2017 12:41 AM | Last Updated on Sun, Jul 14 2019 10:21 AM

Naga Chaitanya’s Birthday Gift – Chaitu’s First Look in Savyasachi - Sakshi - Sakshi

‘సవ్యసాచి’... పంచ పాండవుల్లోని అర్జునుడికున్న పేర్లలో ఒకటి! ఈ పేరు ఎందుకు వచ్చిందంటే... ‘రెండు చేతులతోనూ విల్లు ఎక్కుపెట్టగల సమర్ధుడు కాబట్టి’ అనే ఆన్సర్‌ వస్తుంది. అక్కినేని నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ‘సవ్యసాచి’ పేరుతో సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సిన్మా టైటిల్‌ లోగోతో పాటు రెండు చేతులను వెనక్కి పెట్టుకుని శూలాలు పట్టుకున్న హీరోని చూస్తే పైన చెప్పిన ఆన్సర్‌ నిజమే అన్పిస్తుంది. అయితే... అర్జునుణ్ణి ‘సవ్యసాచి’ అనడానికి ఇంకో కారణం ఉంది.

అదేంటంటే... పట్టుదల, అంకితభావం, కఠోర శ్రమతో అతి తక్కువ కాంతిలోనూ శబ్దాన్ని బట్టి విల్లు ఎక్కుపెట్టి వస్తువు ని కొట్టగల నైపుణ్యం అర్జునుడి సొంతమట! ఈ మాటలను దృష్టిలో పెట్టుకునే ఈ రోజు నాగచైతన్య బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన లుక్‌ను డిజైన్‌ చేసినట్టున్నారు. చైతూ చూపుల్లో ఓ పట్టుదల, కసి కనిపిస్తున్నాయ్‌ కదూ!! ఆ చూపుల గురి ఎటో మరి? ప్రస్తుతం హైదరాబాద్‌లో చైతూ, మాధవన్‌ తదితరులపై సీన్స్‌ తీస్తున్నారు. ఇందులో నిధీ అగర్వాల్‌ హీరోయిన్‌. ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి, కెమెరా: యువరాజ్, సీఈఓ: చిరంజీవి (చెర్రీ), లైన్‌ ప్రొడ్యూసర్‌: పీటీ గిరిధర్, నిర్మాతలు: వై. నవీన్, వై. రవిశంకర్, మోహన్‌ (సీవీయం).

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement