nagachaitanaya
-
150 కోట్ల వైపు తండేల్ పరుగులు..
-
ఇంటికొచ్చేసిన అల్లు అర్జున్.. టాలీవుడ్ ప్రముఖుల సంఘీభావం (ఫొటోలు)
-
అతను మీకు నిజాలు చెప్పలేదు అనుకుంటా
-
ప్రమాణం చేసి మరీ నిజాలు చెప్పిన ప్రియమణి
-
కస్టడీ ట్రైలర్ చూసి షాక్ అవుతున్న ఫ్యాన్స్..ట్రైలర్ మొత్తం అదే
-
పెద్ద హీరోలను మినహాయించి నన్నే ఎందుకు..? చైతూ
-
గాయపడిన మనసు గురించి చైతూ మాటల్లోనే..
-
'విడాకుల తర్వాత చనిపోతా అనుకున్నా'.. సమంత షాకింగ్ కామెంట్స్
Samantha Shocking Comments On Her Divorce With Naga Chaitanya: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలతో బిజీగా ఉంటూ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. సామ్ తన మనసులోని భావాలను, అనుభూతులను తన ఇన్‌స్టా గ్రామ్ ద్వారా పంచుకుంటుంది. అప్పుడప్పుడు మోటివేషనల్ కోట్స్, జీవితపు సత్యాలు పెడుతూ అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంటోంది. అలాగే సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. అయితే ఇప్పటివరకు తాను ప్రస్తావించని అంశం నాగ చైతన్యతో విడాకులు. అయితే తాజాగా ఈ అంశంపై సమంత స్పందించింది. అక్కినేని నాగచైతన్యతో విడిపోయిన తర్వాత వారి విడాకులపై సమంత స్పందించడం ఇదే తొలిసారి. 'నేను విడాకులు తీసుకున్నప్పుడు కుంగిపోయి చనిపోతానని అనుకున్నాను. నేను చాలా బలహీనమైన వ్యక్తినని నా ఫీలింగ్. కానీ నేను ఎంత బలంగా ఉన్నానో తెలిసి ఇప్పుడు ఆశ్చర్యం వేస్తోంది. నేను ఇంత దృఢంగా ఉండగలనని అనుకోలేదు.' అని ఓ ఇంగ్లీష్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సామ్ చెప్పుకొచ్చింది. ఇదీ చదవండి: సమంత గొప్ప పాఠం ఇదేనట.. ఇన్‌స్టాలో సామ్ స్టోరీ -
చైసామ్ విడాకులు.. ఏంటీ? ఏం జరిగింది?
టాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ నాగచైతన్య సమంత విడాకులు తీసుకుంటున్నారే వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. సమంతా తాను విడాకులు తీసుకోబోతున్నట్టు శనివారం మధ్యాహ్నం 3:31 నిమిషాలకు నాగ చైతన్య ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ వెంటనే అభిమానులు భారీ స్థాయిలో స్పందించారు. ఎందుకు విడాకులు తీసుకుంటారు ? ఏం జరిగిందంటూ అభిమానులు వేల సంఖ్యలో రీ ట్వీట్లు చేశారు. వీరిద్దరు భవిష్యత్తులో మరింత పై స్థానాలకు చేరుకోవాలని మరికొందరు విష్ చేశారు. భార్యభర్తలు అన్నాక అపార్థాలు సహజమని, సర్థుపోయి కలిసి ఉండాలంటూ మరికొందరు సోషల్ మీడియాలో ఈ జంటను రిక్వెస్ట్ చేశారు. ఆ వెంటనే సమంత.. నాగ చైతన్య ట్విట్టర్ ద్వారా ప్రకటించిన కొద్ది సేపటికే సమంత సైతం అదే పోస్టును పోస్ట్ చేసింది. దీంతో ఇద్దరు విడాకులపై అధికారికంగా స్పందించినట్టయ్యింది. 2017 అక్టోబరు 7న వీరిద్దరు గోవాలో పెళ్లి చేసుకున్నారు. మరికొద్ది రోజుల్లో వీరి విహహబంధానికి నాలుగేళ్లు పూర్తవుతాయనగా విడాకుల విషయం వెలుగు చూసింది. దాంతో సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. చై-సామ్ పెళ్లినాటి ఫోటోలు నా అభిమాన జంట!! ఈ విషయం నాకు తెలిసిన రోజుAug 28 నైట్ భోజనం కూడా చేయలేదు ఛై!! ప్చ్!! మీ ఇష్టాలు ఎప్పుడు మాకు సమ్మతమే!! — Lakshmi Bhavani (@iambhavani1) October 2, 2021 చూడ ముచ్చటగా వుండేది జంట , భాధగా ఉంది 🥺 Anyway all the best both 🙏 — త్రివిక్రమ్ గారి శిష్యుడు 🇮🇳 (@yoursbheema) October 2, 2021 Dot.pic.twitter.com/MdclKRWWJS — ᴵᵗˢ᭄ɴᴀᴠᴇᴇɴ°(×͜×) (@Naveen_Tweetz_) October 2, 2021 Endi anna ila jargindi,me iddaru na fav couple unde ponley evari happiness valladi,good luck.. — Master (@arunkalyan5) October 2, 2021 pic.twitter.com/1kdfXHf9CG — #Yellove (@NightCrawl3rr) October 2, 2021 All the best for Your Next life చైతు❤️ కాకపోతే బాధగా వుంది పెద్దోడా💔 — R Jyothi Sri (@RJyothiSri2) October 2, 2021 ఎంతో మందికి ఆదర్శంగా అనిపించే మీ జంట ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకుంటారు అని అస్సల్ అనుకోలే.... వినడానికి చాలా కష్టంగా అనిపించినప్పటికి.. మీ లాంటి (చైతన్య) వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కి కూడా తప్పలేదు అంటే మీ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. — N KIRAN KUMAR (@NKR5696) October 2, 2021 -
శేఖర్ కమ్ములతో గరం సత్తి ముచ్చట్లు
-
ఫరాఖాన్ డైరెక్షన్లో నాగచెతన్య
ముంబాయి: బాలీవుడ్ డైరెక్టర్ ఫరాఖాన్, టాలీవుడ్ లవర్‌బాయ్ నాగచైతన్యలు కలిపి పనిచేస్తున్నారు. అయితే ఇది సినిమాలో కాదండీ..ఒక యాడ్‌లో. వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్లో ఫరాఖాన్ తెలియనివారుండరు. ఆమె కొరియోగ్రాఫర్‌గా..దర్శకురాలిగా.. తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆమె సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ వైరల్‌గా మారింది. దీనిలో ఫరాఖాన్ , టాలీవుడ్ లవర్‌బాయ్ నాగచైతన్యతో కలిసి ఒక కమర్షియల్ యాడ్ ఫిల్మ్‌లో నటిస్తున్నట్లు తెలిపారు. సరిగ్గా 25 ఏళ్ల క్రితం అక్కినేని నాగార్జున సినిమాకు కొరియోగ్రఫి అందించిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. అప్పటి నుంచి నాగార్జున తనకు మంచి ఫ్రెండ్ అయ్యాడని తెలిపింది. ఇప్పుడు ఆయన కుమారుడు నాగచైతన్యతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని తెలిపింది. చైతూ మంచి ‘వండర్ ఫుల్ బాయ్’ అని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసి చైతు ‘మీ అభిమానానికి ధన్యవాదాలు’ అని కామెంట్ చేశాడు. దీనిపై డైరెక్టర్ ముకేష్ ఛబ్రా, హిందీ నటి టబూలు నవ్వుతున్న ఎమోజీలతో తమ ఆనందాన్ని తెలిపారు. ఫరాఖాన్ తొలిసారిగా గుజర్గయా సినిమాకు కొరియోగ్రఫిగా చేశారు. ఆమె తన 56వ ఏటకూడా ఎంతో హుషారుగా ఉంటారు. పహలానషా, ఛయ్యా ఛయ్యా, ఎక్పల్కాజినా, షిలాకి జవాని, మున్నిబద్నాం హువీ అనే హిట్ పాటలకు కొరియోగ్రఫి అందించారు.. కాగా, ఆమె శిరిష్ కుందర్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. View this post on Instagram A post shared by Farah Khan Kunder (@farahkhankunder) చదవండి: నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ.. స్టార్ హీరో సినిమాలో! -
వెల్కమ్ 2021
కొత్త ఏడాదిని ప్రేమతో స్వాగతించారు స్టార్స్. 2020కి గుడ్‌బై చెబుతూ, 2021కి స్వాగతం పలికారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు కొందరు. లేడీ సూపర్ స్టార్ నయనతార, తన బాయ్‌ఫ్రెండ్ విఘ్నేష్ శివన్‌తో దిగిన ఫోటో షేర్ చేశారు. కాజల్ అగర్వాల్, గౌతమ్ దంపతులు, నిఖిల్, పల్లవి వర్మ దంపతులు మంచు కొండల్లో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నారు. సమంత–నాగచైతన్య గోవాలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. -
బబుల్ బాత్.. స్నేహితురాలికి షాకిచ్చిన సామ్
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత అక్కినేని-నాగచైతన్యలు ప్రస్తుతం మాల్దీవులో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. నవంబర్ 23 నాగచైతన్య పుట్టిన రోజు సందర్భంగా ఈ జంట ఆదివారం అక్కడ వాలిపోయారు. అప్పటి నుంచి ఐలాండ్ అందాలను ఆస్వాధిస్తున్న వారి ఫొటోలను సమంత ఎప్పటికప్పుడు సోషల్‌లో మీడియాలో పోస్టు చేస్తూనే ఉన్నారు. తాజాగా సమంత బబుల్ బాత్‌ను ఎంజాయ్ చేస్తున్న ఫొటోను షేర్ చేసి తన డిజైనర్ ఫ్రెండ్ క్రెషాకు షాక్ ఇచ్చారు. అయితే ఈ బబుల్ బాత్‌టబ్‌ను క్రెషా తన భర్త వన్రాజ్ జావేరిలు చై-సామ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారంట. (చదవండి: బర్త్‌డే స్పెషల్ : నాగ చైతన్య న్యూ లుక్) కానీ సామ్, చైకి హ్యాండ్ ఇచ్చి తను మాత్రమే బబుల్ బాత్‌ను ఎంజాయ్ చేశారు. బాత్‌టబ్‌లో కుర్చుని ఉన్న సెల్ఫీ ఫొటోను సామ్ ఇన్‌స్టాలో షేర్ చేసి తన స్నేహితురాలు క్రెషాను ట్యాగ్ చేశారు. చై-సామ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాత్‌టబ్‌లో సమంతను మాత్రమే చూసి ఆమె షాకయ్యారంట. కాగా ఈ బాత్‌టబ్‌ను గులాబీ రేకులతో గుండె ఆకారంలో ప్రత్యేకంగా అలంకరించారంట. కానీ సామ్ మాత్రమే బబుల్ బాత్‌ను ఎంజాయ్ చేసి వారికి షాక్ ఇచ్చారు. అయితే సమంత, చై బర్త్‌డే రోజున స్విమ్మింగ్ పూల్ వద్ద ఉన్న చైతన్య ఫొటోను షేర్ చేస్తూ.. ‘హ్యాపీ బర్త్‌డే చై.. ఎప్పుడూ మీ స్వంత నిబంధనలతో జీవించండి.. ఎప్పటికీ నేను మీ ఆనందాన్ని మాత్రమే కోరుకుంటున్నాను’ అంటూ సామ్ తన భర్త నాగచైతన్యకు ప్రత్యేకంగా పుట్తిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. (చదవండి: వైరల్: ‘సామ్ జామ్’లో మెరిసిన మెగాస్టార్..) -
అక్టోబర్‌లో స్టార్ట్
‘మనం’ తర్వాత విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో మరోసారి నటిస్తున్నారు నాగచైతన్య. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఇటీవల ఈ చిత్రాన్ని ప్రకటించారు. ‘థ్యాంక్యూ’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మిస్తారు. ఇందులో ఇద్దరు హీరోయిన్స్ కనిపించే అవకాశం ఉందని తెలిసింది. రకుల్ ప్రీత్‌సింగ్, తమిళ నటి ప్రియా భవానీ శంకర్లను ఈ సినిమాలో హీరోయిన్లుగా తీసుకోవాలని చిత్రబృందం అనుకుంటున్నారట. గతంలో ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాలో జంటగా నటించారు చైతన్య, రకుల్. మరి ‘థ్యాంక్యూ’లో జంటగా కనిపిస్తారా? అనేది త్వరలో తెలిసిపోతుంది. హీరోయిన్ల గురించి త్వరలో అధికారిక ప్రకటన రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ–ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయని సమాచారం. అక్టోబర్ మొదటి వారంలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. -
కరోనా: సామ్ పోస్టు.. చై ‘క్వారంటీమ్’
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు 21 రోజుల పాటు లాక్‌డౌన్‌కు పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. ఇక ప్రధాని పిలుపుకు సామాన్య జనం నుంచి సెలబ్రిటీలు సైతం మద్దతు పలుకుతున్నారు. ఈ క్రమంలో సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్న సెలబ్రిటీలంతా తమ రోజువారి కార్యకలపాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా హీరోయిన్ సమంత కూడా భర్త, హీరో నాగచైతన్య, తమ పెంపుడు కుక్కతో సరదాగా ఆడుకుంటున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో గురువారం షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. నేలపై పడుకుని ఉన్న చైతూపై హాష్ విశ్రాంతి తీసుకుంటున్న ఈ ఫొటోకు సమంత ‘క్వారంటీమ్’ అనే క్యాప్షన్‌ను జత చేసి షేర్ చేశారు. (అప్పుడు చాలా బాధ కలిగింది : సమంత) కాగా చై-సామ్‌లు తమపెంపుడు కుక్క హాష్‌కు సంబంధించిన ప్రతి విషయాన్ని తరచూ సోషల్ మీడియాలో పంచుకుంటుంటారు. ఇటీవల హాష్ మొదటి బర్త్‌డేను సెలబ్రెట్ చేసిన ఈ జంట.. హాష్‌తో తమకు ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ సమంత భావోద్యేగ పోస్టును షేర్ చేశారు. కాగా ఇటీవల విడుదలై సమంత ‘జాను’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. కాగా ప్రస్తుతం విజయ్ సేతుపతి, నయనతార నటిస్తున్న ‘కాతు వాకులా రేండు కాదల్’ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. ఇక నాగచైతన్య, సాయి పల్లవితో కలిసి శేఖర్ కమ్ముల దర్వకత్వంలో వస్తున్న లవ్ స్టోరి ‘ఏమ్ పిల్ల..’లో నటిస్తున్నారు. (ఊపిరి తిత్తులు ఇలాగే ఉక్కిరిబిక్కిరి అవుతాయి) View this post on Instagram #quaranteam A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on Mar 24, 2020 at 1:55am PDT -
పండగ పోస్టర్లు
పండగ అనగానే సినిమా వాళ్లు చాలా ఉత్సాహంగా ఉంటారు. అందులోను సంక్రాంతి అనగానే ఇండస్ట్రీకి కొత్త ఉత్సాహం వస్తుంది. కారణం వాళ్ల సినిమాలను విడుదల చేయటమే కాకుండా అనేక సినిమా ప్రమోషన్లను ఈ పండగకి ప్రారంభించటం ఆనవాయితీ. కొందరు తమ సినిమాల లుక్స్‌ను ఈ సంక్రాంతి సందర్భంగా విడుదల చేశారు. రవితేజ, శ్రుతీహాసన్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘క్రాక్’. ‘ఠాగూర్’ మధు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మలినేని గోపిచంద్ దర్శకుడు. సాయి మాధవ్ బుర్రా మాటల రచయిత. ఎస్. ఎస్ తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ‘క్రాక్’ చిత్రం వేసవిలో విడుదల కానుంది. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ స్టోరీ’. మంగళవారం ఈ సినిమాలోని కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఏమిగోస్ క్రియేషన్స్, సోనాల్ నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్‌పై నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ సంక్రాంతి తర్వాత ప్రారంభం కానుంది. ఏప్రిల్ 2న ‘లవ్‌స్టోరీ’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. విభిన్నమైన పాత్రలను పోషించి మంచి మార్కులు కొట్టేసే నటుడు సత్యదేవ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’. ఈ సినిమా కొత్త పోస్టర్‌ను పండగ సందర్భంగా విడుదల చేశారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, విజయ ప్రవీణ పరుచూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ వెంకటేశ్ మహా ఈ చిత్రానికి దర్శకుడు. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమా కూడా వేసవి సందర్భంగానే విడుదల చేయాలనుకుంటున్నారు. -
నా జీవితంలో ఆ రెండూ ప్లాన్ చేయకుండా జరిగినవే!
‘‘జీవితంలో మనకు ఎదురయ్యే వైఫల్యాలే మనకు ఎక్కువ పాఠాలు నేర్పుతాయి. నేనూ చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కొన్నిసార్లు తప్పులు జరుగుతుంటాయి. అప్పుడు నా నిర్ణయ లోపం ఎక్కడ ఉందో పరిశీలించుకుంటాను. నటుడిగా నన్ను మరింత మెరుగుపరచుకునేందుకు ప్రయత్నిస్తాను. సినిమా విడుదల సమయంలో సోషల్ మీడియా కామెంట్స్‌ని పట్టించుకుంటాను. కొన్ని ప్రతికూల వ్యాఖ్యలు చూస్తుంటాను. కానీ ఆ విమర్శలను కూడా సానుకూలంగా తీసుకుని ముందుకు వెళ్లినప్పుడే లైఫ్ బాగుంటుంది’’ అన్నారు నాగచతైన్య. కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా నటించిన చిత్రం ‘వెంకీమామ’. ఇందులో పాయల్ రాజ్‌పుత్, రాశీఖన్నా కథానాయికలుగా నటించారు. డి. సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో నాగచైతన్య చెప్పిన విశేషాలు. ► భీమవరంలో మొదలైన ఈ కథ కశ్మీర్లో ముగుస్తుంది. కాలేజ్ సెలవుల్లో నేను భీమవరం వెళ్లినప్పుడు వెంకీమామతో నా సందడి మొదలవుతుంది. ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ పాత్ర చేశాను. ► ఈ సినిమాలో కెమెరా వెనకాల సురేష్ మావయ్య, కెమెరా ముందు వెంకటేష్ మావయ్య నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాను. వెంకటేష్ మావయ్యకు ‘నో హేటర్స్, నో నెగటివ్స్’ అని అందరూ అంటుంటారు. అలా ఎందుకు అంటారో నాకు సెట్లో అర్థమైంది. వెంకటేష్ మావయ్య ఆయన కామెడీ టైమింగ్‌ను మ్యాచ్ చేయడం కష్టం. సురేష్మావయ్య, వెంకటేష్ మావయ్య ప్రణాళిక ప్రకారం అన్నీ జరగాలనుకుంటారు. లేకపోతే కోపం వస్తుంది. ఆ కోపం అప్పటి పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ► సురేష్మావయ్య కథలు వినమని అప్పుడప్పుడు స్క్రిప్ట్స్ పంపిస్తుంటారు. నేను వింటుంటాను. కానీ సురేష్ ప్రొడక్షన్స్‌లో సినిమా చేసే అవకాశం ఎందుకో ఇప్పటివరకు కుదర్లేదు. ఇప్పుడు ‘వెంకీమామ’తో కుదరింది. ఇందులో వెంకటేష్ మావయ్యతో కూడా కలిసి చేశాను. ఇలా ఒకేసారి, ఒకే ఏడాది ఈ రెండూ జరిగాయి. కానీ ఇది ప్లాన్ చేసింది కాదు. అలా జరిగిపోయిందంతే. నా జీవితంలో పెళ్లి, ‘వెంకీమామ’ ప్లాన్ చేసినవి కాదు. ► ‘వెంకీమామ’ మల్టీస్టారర్ కాదనే నా అభిప్రాయం. వెంకటేష్‌గారితో కలిసి నేను ఓ క్యారెక్టర్ చేశానంతే. ఈ కథకు నేను ప్లస్ కాదు. ఈ కథే నాకు ప్ల్లస్ అనుకంటున్నాను. ఈ సినిమాలో విలన్స్ లేరు. పరిస్థితులు, జాతకాల ప్రభావం సినిమాలో పాత్రలపై ప్రతికూలతలను చూపిస్తున్నట్లు కనిపిస్తుంది. ► సినిమా నేను రఫ్‌గా మొత్తం చూశాను. బాగుంది. సమంత (నాగచైతన్య భార్య) కూడా చూసింది. బాగుందని చెప్పింది. ఈ సినిమానే కాదు నా ప్రతి సినిమా గురించి తన అభిప్రాయం నిర్మొహమాటంగా చెబుతుంది. నేనూ తన సినిమాలకు అంతే చెబుతాను. ► ఈ సినిమా కథను నాన్నగారు (నాగార్జున) వినలేదు. సురేష్మామ పంపిన కథ విని నేనే ఓకే చేశాను. నాన్నగారితో (సొగ్గాడే చిన్ని నాయనా సీక్వెల్ గురించి ప్రస్తావిస్తూ) చేయాల్సిన ప్రాజెక్ట్‌కు ఇంకా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. నాన్నగారు, వెంకటేష్ మామలో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే ఇద్దరూ కామ్ పర్సనాలిటీస్. కానీ నిర్ణయాలు మాత్రం చాలా వేగంగా తీసుకుంటారు. ► నేను డైరెక్టర్స్ యాక్టర్‌ని. ఒకసారి స్క్రిప్ట్ లాక్ అయిన తర్వాత డైరెక్టర్ చెప్పింది చేసుకుని వెళ్తుంటాను. అనుభవం ఉన్న దర్శకులు అయితే నా నుంచి మరింత నటనను రాబట్టుకోగలరని నా అభిప్రాయం. కొత్త దర్శకులు అయితే నన్ను మరో టేక్ చేయమని చెప్పడానికి మోహమాట పడొచ్చు. అలా యాక్టింగ్ పరంగా నాకు తెలియకుండానే నేను రాజీపడాల్సి వస్తుందేమో. అందుకే కెరీర్లో రెండుమూడు మంచి హిట్స్ సాధించిన తర్వాత కొత్త దర్శకులతో సినిమాలు చేస్తాను. కొత్త దర్శకులు డిఫరెంట్ కంటెంట్‌తో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కొంతకాలం అనుభవం ఉన్న దర్శకులతోనే సినిమాలు చేయాలనుకునే నా ఆలోచన నాకొక బలహీనత కూడా కావొచ్చు. ► శేఖర్‌కమ్ములగారి దర్శకత్వంలో చేస్తున్న ‘లవ్‌స్టోరీ’ (వర్కింగ్ టైటిల్) చిత్రీకరణ 40 శాతం పూర్తయింది. -
అమ్మాయిలూ.. బ్యాగులో పెప్పర్ స్ప్రే పెట్టుకోండి
‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం నేను చాలా బిజీగా ఉన్నా. అందుకే బాలీవుడ్ వెళ్లాలనే ఆలోచన లేదు. తెలుగు, తమిళ్, హిందీ.. ఏ భాష అయినా మనం చేసే పాత్రలు బాగుండాలి. ఎక్కడ మంచి పాత్రలొస్తే అక్కడే చేయాలి. అంతేకానీ, బాలీవుడ్లో చేయాలని ప్రాధాన్యత లేని పాత్రలొస్తే చేయను. కొన్ని అవకాశాలు వచ్చాయి. కానీ, నాకు నచ్చక చేయలేదు’’ అన్నారు రాశీఖన్నా. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా, రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వెంకీ మామ’. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహనిర్మాత. ఈ నెల 13న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా రాశీఖన్నా చెప్పిన విశేషాలు. ► పాండిచ్చేరిలో ఓ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు సురేష్‌బాబు సార్ నా మేనేజర్‌కి కాల్ చేసి, నాతో మాట్లాడాలన్నారు. హైదరాబాద్ వచ్చేశా. ‘వెంకీ మామ’ గురించి చెప్పగానే కథ కూడా వినకుండా సురేష్ సార్‌పై ఉన్న నమ్మకంతో చేస్తానని చెప్పా. ఆ తర్వాత కథ విన్నాననుకోండి. పాత్ర ఏదైనా నా బెస్ట్ ఇవ్వాలనుకుంటాను. ► చిరంజీవి, వెంకటేశ్సార్ల సినిమాలు హిందీలో డబ్ అయినప్పుడు చూస్తుండేదాన్ని. వెంకటేశ్ సార్ కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ఆయన హావభావాలు భిన్నంగా ఉంటాయి. చైతన్యతో నటించడం సంతోషంగా ఉంది. నేను చేసే సినిమాలో హీరోలు, హీరోయిన్లు ఎంతమంది ఉన్నారు? అని ఆలోచించను. కేవలం సోలో హీరోయిన్‌గానే చేయాలనుకోను. నా పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోతుందంటే చేస్తానంతే. ఏ రంగంలో అయినా పోటీ అనేది అవసరం.. అప్పుడే మరింత కష్టపడతాం. ► ‘వెంకీ మామ’ చిత్రంలో హారికా అనే ఫిల్మ్ మేకర్ పాత్ర చేశా.. చాలా సరదాగా ఉంటుంది. ప్రస్తుతం నేను నటించిన ‘వెంకీ మామ, ప్రతిరోజూ పండగే’ సినిమాలు వారం గ్యాప్‌లో విడుదలవుతున్నాయి.. దీన్ని నేను ఒత్తిడిగా అనుకోవడం లేదు. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంలోనూ మంచి పాత్ర చేస్తున్నా. నేను సినిమాలు ఆలస్యంగా సైన్ చేయడం లేదు. వాటి విడుదలలో ఆలస్యం అవుతోందంతే. విడుదల అనేది నా చేతుల్లో ఉండదు కదా? ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా చేసినందుకు నేనిప్పటికీ హ్యాపీ. ఆ సినిమా ఎందుకో ప్రేక్షకులకు నచ్చలేదు. హిట్టు, ఫ్లాపు మన చేతుల్లో ఉండవు. ► మంచి పాత్రలు కుదిరితే వెబ్ సిరీస్, లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తాను. గతంతో పోలిస్తే ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్లకు ప్రాధాన్యత పెరిగింది.. మంచి పాత్రలొస్తున్నాయి. గతంలో పెళ్లయితే కెరీర్ ముగిసినట్టే. ఇప్పుడు అలాంటిదేం లేదు. సమంతగారు పెళ్లయినా సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉండటం సంతోషం. ► ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన దిశా ఘటన విని చాలా కోపం వచ్చింది.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరడం తప్ప ఇంకేమీ చేయలేం. ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొచ్చి ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి. అమ్మాయిలు తమను తాము రక్షించుకునేందుకు పెప్పర్ స్ప్రే తప్పకుండా వెంట బెట్టుకోవాలి. మహిళలతోనే కాదు.. తోటి వారితో ఎలా ప్రవర్తించాలో చిన్నతనం నుంచే తల్లిదండ్రులు పిల్లలకు నేర్పాలి. -
ఆర్మీ ఆఫీసర్.. మిడిల్ క్లాస్ కుర్రాడు
‘‘నా మేనల్లుడి లవ్‌స్టోరీ టైటానిక్ రేంజ్లో ఉంటుంది అనుకుంటే మన ఊర్లో పడవ రేంజ్లో కూడా లేదు కదా?’’ అని బాధపడుతున్నారు వెంకీ మామ. మరి ఆయన అల్లుడు అంతలా మామని ఎందుకు నిరుత్సాహపరిచాడో తెలియాలంటే ‘వెంకీ మామ’ సినిమా చూడాలి. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కేయస్ రవీందర్(బాబీ) తెరకెక్కించిన చిత్రం ‘వెంకీ మామ’. సురేశ్‌బాబు, వివేక్ కూచిభొట్ల, టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. శనివారం నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా టీజర్‌ను రిలీజ్ చేశారు. ఆర్మీ ఆఫీసర్ శివరామకృష్ణ కార్తీక్ పాత్రలో నాగచైతన్య నటించారు. ఈ చిత్రం డిసెంబర్ 13న రిలీజ్ కానుందట. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య ఓ సినిమాలో నటిస్తున్నారు. చైతన్య బర్త్‌డే స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది ఈ చిత్రబృందం. ఇందులో మిడిల్ క్లాస్ అబ్బాయి పాత్రలో కనిపించనున్నారు చైతన్య. ఇదిగో ఇక్కడ ఊడుస్తూ కనిపిస్తున్న ఫొటో చూశారుగా. వచ్చే ఏడాది వేసవిలో సినిమా రిలీజ్ కానుంది. -
మరో అందమైన ప్రేమకథ
‘మజిలీ’వంటి బ్యూటీఫుల్ అండ్ ఎమోషనల్ లవ్‌స్టోరీతో సూపర్ సక్సెస్ కొట్టి మంచి జోరు మీద ఉన్నారు నాగచైతన్య. ‘ఫిదా’ సినిమాతో ప్రేక్షకులను ఫిదా చేసిన జోష్‌లో ఉన్నారు దర్శకులు శేఖర్ కమ్ముల. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా షురూ అయింది. డిస్ట్రిబ్యూటర్స్‌గా ఇప్పటివరకు వందలాది సినిమాలను విడుదల చేసిన ఏషియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో తొలిసారి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. నారాయణదాస్ నారంగ్, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామ్మోహనరావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సాయిపల్లవి కథానాయికగా నటించనున్నారు. ‘‘ఇండస్ట్రీలో నేను కెరీర్‌ను స్టార్ట్ చేసినప్పటి నుంచి శేఖర్ కమ్ములగారితో వర్క్ చేయాలనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. నిజమైన, అందమైన ప్రేమకథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ అవుతున్నాం’’ అని నాగచైతన్య పేర్కొన్నారు. ‘‘సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో ఈ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేస్తున్నాం. 60–70 రోజుల్లోనే ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ప్రస్తుతం మల్టీస్టారర్ మూవీ ‘వెంకీమామ’తో బిజీగా ఉన్నారు నాగచైతన్య. ఈ సినిమాలో వెంకటేశ్ మరో హీరో. -
పవర్‌ఫుల్‌పోలీస్
‘మజిలీ’ సినిమాలో క్రికెటర్ పూర్ణగా బంతులను బౌండరీలు దాటించారు నాగచైతన్య. లేటెస్ట్గా చేస్తున్న ‘వెంకీ మామ’ సినిమాలో మిలటరీ ఆఫీసర్‌గా బార్డర్ దగ్గర శత్రువులను రఫ్ ఆడించనున్నారట. నెక్ట్స్ అజయ్ భూపతి దర్శకత్వంలో చేయబోయే సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారట. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో నాగచైతన్య ఓ యాక్షన్ థ్రిల్లర్ చేయడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. ఇందులో స్టైలిష్ పోలీస్ ఆఫీసర్‌గా చైతన్య పాత్రను డిజైన్ చేశారట అజయ్ భూపతి. ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా క్లైమాక్స్‌లో కొద్దిసేపు పోలీస్‌గా కనిపించారు చైతన్య. ఇందులో పూర్తిస్థాయి పోలీస్‌గా తొలిసారి కనిపించనున్నారు. ఈ చిత్రానికి ‘మహా సముద్రం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. పి. కిరణ్ నిర్మించనున్న ఈ సినిమాలో హీరోయిన్గా సమంతను నటింపచేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉందని తెలిసింది. ఈ ఏడాది సెకండ్ హాఫ్‌లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
మజిలీ సక్సెస్ నాకెప్పుడూ ప్రత్యేకమే: నాగచైతన్య
‘‘నా లైఫ్‌లో, నా కెరీర్లో నిజంగా ఒక క్రూషియల్ పాయింటాఫ్ టైమ్‌లో అందమైన పాత్రను, ఎప్పటికీ మరచిపోలేని సక్సెస్‌ను ఇచ్చాడు శివ నిర్వాణ. ఫ్యూచర్లో సక్సెస్, ఫెయిల్యూర్స్ వస్తుంటాయి. కానీ, ఈ సక్సెస్ అన్నది నాకెప్పుడూ ప్రత్యేకమే. థ్యాంక్యూ సో మచ్ బ్రో’’ అని నాగచైతన్య అన్నారు. నాగచైతన్య హీరోగా, సమంత, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘మజిలీ’. ‘నిన్నుకోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలైంది. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘గ్రాండ్ థ్యాంక్స్ మీట్’లో నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘ఒక సినిమా సక్సెస్ అన్నది ఎవరో ఒకరి వల్ల అవదు. ఒక డైరెక్టర్ విజన్‌తో స్టార్ట్ అయి, ఆ విజన్‌ని నిర్మాతలు సపోర్ట్ చేసి, ఎంతోమంది నటీనటులు ఆ కథ విని ఓకే చేసి, ఆ తర్వాత సాంకేతిక నిపుణులు జాయిన్ అయ్యి, లాస్ట్‌కి డిస్ట్రిబ్యూటర్స్ సినిమా చూడకుండా జస్ట్ ట్రైలర్స్, టీజర్స్ చూసి, సినిమా కొని, ప్రేక్షకులకు అందించి.. ఫైనల్లీ ఒక మంచి హిట్‌ని అందుకుంటాం. ఈ ప్రాసెస్‌లో ఉన్న అందరూ ఈ రోజు సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నారంటే చాలా చాలా సంతోషంగా ఉంది. నా చివరి చిత్రాలు పెద్ద ఎంకరేజింగ్‌గా లేకపోయినా సాహు, హరీష్‌గారు నన్ను ప్రోత్సహించి, పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్స్. చివరి నిమిషంలో తమన్ ఈ సినిమాని ఒప్పుకుని జీవితం ఇచ్చినందుకు ధన్యవాదాలు’’ అన్నారు. డైరెక్టర్ కొరటాల శివ మాట్లాడుతూ... ‘‘శివ నిర్వాణ ‘మజిలీ’ ఐడియా చెప్పినప్పుడు చాలా మంచి సినిమా అని దానయ్యగారితో అన్నాను. మంచి రైటింగ్, సీన్స్ చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి, సినిమా కూడా ఇలాగే నేలమీదుండాలి.. అలాంటి కథలు తక్కువ అని శివకి చెప్పాను. వైజాగ్ నేపథ్యం, నటీనటులను ఎంచుకున్న విధానం బాగా నచ్చింది. ఒక్క సీన్లో నటించినవారు కూడా బాగా గుర్తుండిపోయారు. శివది ఎక్స్ట్రార్డినరీ వర్క్. నీలో ఓ చిన్న నొప్పి ఉంది. లైఫ్‌లో ఎవరైనా అమ్మాయి వదిలేసి వెళ్లిపోయిందేమో (నవ్వుతూ).. రావు రమేశ్, పోసానిగారులాంటి నటులు ఉండటం మా ఇండస్ట్రీ అదృష్టం. చైతన్యగారిని స్క్రీన్‌పై చూసినప్పుడు చాలా నిజాయతీగా కనిపిస్తారు. తన బలం, బలహీనతలు ఏంటో ఆయనకు తెలుసు. నిజాయతీగా ఉండటం వల్ల ప్రతి పాత్ర ఆయన చేస్తుంటే గుర్తుండిపోతోంది. ‘మజిలీ’ సినిమా చూసినప్పుడు మీ నటనని నమ్మలేకపోతున్నాను. పూర్ణ (చైతన్య పాత్ర)ని చూస్తుంటే వైజాగ్‌లోని రైల్వే కాలనీలో నిజంగానే అలాంటి పాత్ర ఉందేమో అనిపించింది. సమంతగారు గ్రేట్ ఆర్టిస్ట్. ‘జనతా గ్యారేజ్’కి పనిచేశా. సాహు, హరీష్ మరెన్నో హిట్ సినిమాలు తీయాలి’’ అన్నారు. నటుడు రావు రమేశ్ మాట్లాడుతూ... ‘‘హిట్ అవుతుంది అనుకున్న సినిమా హిట్ అయితే ఆ కిక్కే వేరు. ఈ చిత్రంలో అన్ని పాత్రలను శివ నిర్వాణ ఎంతో ధైర్యంగా డిజైన్ చేసిన విధానం నాకు నచ్చింది. ఫస్టాఫ్‌లో చైతన్య, దివ్యాంశ లవ్‌ట్రాక్ చూస్తే ‘టైటానిక్’ సినిమా చూసినట్టుంది. సెకండాఫ్‌లో చైతు, సమంత ట్రాక్ కూడా చాలా బాగా కుదిరింది’’ అన్నారు. నటుడు పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ... ‘‘పరుచూరి బ్రదర్స్ వద్ద నేను చెన్నైలో అసిస్టెంట్‌గా ఉన్నప్పుడు ఇలాంటి ఫంక్షన్స్‌కి వెళ్లేవాణ్ణి. సినిమా హిట్టయ్యాక నటీనటులు, సాంకేతిక నిపుణులకు షీల్డ్‌లు ఇచ్చేవారు. చాలా రోజుల తర్వాత ఇప్పుడు ‘మజిలీ’ సినిమా హిట్ షీల్డ్ అందుకుంటుండటం హ్యాపీ. నాగచైతన్య.. నీ తొలి సినిమా ‘జోష్’లో నువ్వు బొమ్మలా ఉన్నావ్.. ఈ సినిమాలో అంతకు మించి ఉన్నావ్. కామెడీ, సెంటిమెంట్ పాత్రలు చేయాలని నాకు బాగా కోరిక. నాకు స్కూల్‌డేస్‌లో, యూనివర్శిటీలో బెస్ట్ కమెడియన్ అవార్డు వచ్చింది. నాకు పోలీస్, తండ్రి పాత్రలు నచ్చవు. కానీ, ఆ తండ్రి పాత్రలు చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి. అలాగే ‘టెంపర్’లో పోలీసు పాత్రతో ఎంత పేరొచ్చిందే, నా జీవితాన్ని ఎంత మలుపు తిప్పిందో అందరికీ తెలుసు. ‘టెంపర్’ కి ఎంత పేరొచ్చిందో ‘మజిలీ, చిత్రలహరి’ సినిమాల్లో తండ్రి పాత్రలకు అంత పేరొచ్చింది’’ అన్నారు. ‘‘8రోజుల్లో ‘మజిలీ’ సినిమాకి నేపథ్య సంగీతం అందించాను. ఎంతో ప్రేమించి పనిచేశా’’ అన్నారు తమన్. శివ నిర్వాణ మాట్లాడుతూ... ‘‘ఇటీవల కొన్ని రోజుల వరకూ నాకు గ్రాస్‌కి, షేర్‌కి తేడా తెలియదు. కానీ 15రోజుల నుంచి కొత్త కొత్త విషయాలు చూస్తున్నా. ఇన్ని కోట్లు వసూలు చేసింది సినిమా అని డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఫోన్లు వస్తుండటం, వసూళ్ల నంబర్స్ చూస్తున్నప్పుడు ముఖ్యంగా చైతన్యగారికోసం చాలా సంతోషంగా ఫీలయ్యా. ఆయనకి ఈ రేంజ్లో సక్సెస్ రావడం చాలా హ్యాపీ. చైతన్యగారిలో ఇంత మంచి నటుడు ఉన్నాడని అనుకోలేదు, చాలా బాగా చూపించారని చాలా మంది అన్నారు. ‘ఏమాయ చేసావే’ నుంచి తన నటనని నేను నమ్మాను. తనకు కరెక్ట్ పాత్ర పడితే తనకంటే న్యాయం చేసేవారెవరూ ఉండరని అనుకున్నా. ‘మజిలీ’ లో చైతన్య కాకుండా వేరే ఎవరైనా అయితే బాగుండని ఒక్కరూ అనలేదు. సినిమా చూస్తున్నప్పుడు సమంతగారికి నేను ఫ్యాన్‌గా మారిపోతున్నానేమో అనుకున్నా. క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాల్లో ఆమె చాలా బాగా చేశారు. రేపంటూ ఒక కథ రాస్తే సమంతగారి లాంటి నటిని దృష్టిలో పెట్టుకుని సీన్స్ రాస్తా. ఈ సినిమాకి చైతన్య, సమంతగారు లైఫ్ ఇచ్చారు’’ అన్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి చిత్రబృందాన్ని అభినందించారు.ట -
సూపర్ ఎగ్జైటింగ్
‘వెంకీమామ’ హంగామాకు పాయల్ రాజ్‌పుత్ సరదాలు తోడయ్యాయి. ఈ సందడిలో పుట్టించిన హాస్యాన్ని వెండితెరపై చూసి నవ్వుకోవాల్సిందే. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కేఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ‘వెంకీమామ’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో వెంకీ సరసన పాయల్ రాజ్‌పుత్, నాగచైతన్యకు జోడీగా రాశీఖన్నా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవల గోదావరి జిల్లాల పరిసర ప్రాంతాల్లో మొదలైన విషయం తెలిసిందే. వెంకీ, నాగచైతన్యలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇటీవల రాశీఖన్నా ఈ సినిమా సెట్లో జాయిన్ అయ్యారు. తాజాగా పాయల్ రాజ్‌పుత్ జాయిన్ అయ్యారు. ‘కొత్త తెలుగు సినిమా షూటింగ్లో పాల్గొన్నాను సూపర్ ఎగ్జైటింగ్‌గా ఉంది’’ అని పేర్కొన్నారు పాయల్. -
తాతామనవడు
నాగార్జున, నాగచైతన్య నిజజీవితంలో తండ్రీ కొడుకులు. కానీ చూడ్డానికి మాత్రం అన్నదమ్ముల్లా ఉంటారని అక్కినేని అభిమానులు సరదాగా చెప్పుకుంటుంటారు. ఇప్పుడు నాగార్జున, నాగచైతన్య తాతామనవళ్లుగా నటించబోతున్నారు. రెండేళ్ల క్రితం కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున హీరోగా ‘సోగ్గాడే చిన్ని నాయనా’ అనే సినిమా రూపొందిన విషయం తెలిసిందే. ఇందులో నాగార్జున చేసిన బంగార్రాజు క్యారెక్టర్ ఆడియన్స్‌ను బాగా మెప్పించింది. ఇప్పుడు సేమ్ కాంబినేషన్లోనే ‘సోగ్గాడే చిన్ని నాయానా’ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కనుంది. అయితే ఇందులో నాగచైతన్య కూడా నటిస్తారు. బంగార్రాజు మనవడి పాత్రలో నాగచైతన్య కనిపిస్తారు. ఈ సినిమా షూటింగ్ వేసవిలో ఆరంభం కానుందని సమాచారం. ఇంతకుముందు ‘మనం’ సినిమాలో నాగార్జునకు నాన్న పాత్రలో నాగచైతన్య కనిపించారు. ఇప్పుడు ఈ చిత్రం కోసం మనవడిగా మారారు. ఈ సంగతి ఇలా ఉంచితే... 2002లో నాగార్జున హీరోగా వచ్చిన ‘మన్మథుడు’ చిత్రానికి కూడా స్వీకెల్ చేస్తున్నారట నాగార్జున. ఈ సినిమాకు నటుడు, ‘చిలసౌ’ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తారు. మార్చిలో ఈ సినిమా షూటింగ్ పోర్చ్గల్లో స్టార్ట్ అవుతుందని ప్రచారం జరుగుతోంది. -
ప్రేమ ఉంది.. బాధ ఉంది
టాలీవుడ్ యంగ్ బ్యూటీఫుల్ కపుల్ నాగచైతన్య, సమంత జంటగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘నిన్నుకోరి’ లాంటి ఎమోషనల్ సినిమాతో హిట్ అందుకున్న శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘మజిలీ’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ‘దేర్ ఈజ్ లవ్.. దేర్ ఈజ్ పెయిన్’ అన్నది ఉపశీర్షిక. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు. ‘మజిలీ’ ఫస్ట్ లుక్‌లో చైతన్య, సమంత ఒకరినొకరు ఆప్యాయంగా పట్టుకుని ఉండటం చాలా ఎమోషనల్‌గా ఉంది. పైగా వారి లుక్ ఇందులో చాలా కొత్తగా ఉంది. చై, సామ్ బ్యాక్‌గ్రౌండ్‌లో వాల్తేరు గ్రౌండ్స్, విశాఖపట్నం అని బోర్డుపై రాసుంది. వైజాగ్ నేపథ్యంలో రొమాంటిక్ ఎంటరై్టనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ‘ఏమాయ చేసావె, మనం, ఆటోనగర్ సూర్య’ చిత్రాల తర్వాత, వివాహానంతరం సమంత, నాగచైతన్య నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడంతో మంచి అంచనాలున్నాయి. -
మామా అల్లుళ్లు రెడీ!
రంగంలోకి దిగటానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు మామాఅల్లుళ్లు. ఇక మొదలుపెట్టడమే ఆలస్యం. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా బాబీ (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ‘వెంకీమామ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలనుకుంటున్నారు. ఇందులో రియల్‌లైఫ్‌లో మామాఅల్లుళ్లైన వెంకీ–చైతూ ఈ రీల్‌లైఫ్‌లోనూ అలానే కనిపించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ 12న స్టార్ట్ కానుంది. డిసెంబర్ 13న వెంకటేశ్ పుట్టినరోజని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘వెంకీమామ’ తొలి షెడ్యూల్‌ను చెన్నైలో ప్లాన్ చేశారని సమాచారం. ముందుగా షూటింగ్లో ఎవరు పాల్గొంటారు? వెంకీనా లేక చైతూనా? లేక కాంబినేషన్ సీన్స్‌ను ప్లాన్ చేశారా? అనే విషయాలు త్వరలో తెలుస్తాయి. ఇక ఈ సినిమాలో నాగచైతన్య సరసన రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయికగా నటించనున్నారు. వెంకీ సరసన నటించే హీరోయిన్ కోసం కొందరి అగ్రకథానాయికల పేర్లను పరిశీలిస్తున్నారు టీమ్. మరో మూడు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారు. -
కలహాల కాపురం
గొడవపడందే రోజు గడవడం లేదంట నాగచైతన్య, సమంత దంపతులకు. అసలు వీరిద్దరూ ఎందుకు గొడవ పడుతున్నారు? వీరి కలహాల కాపురానికి కారణాలు ఏంటి? అంటే ప్రస్తుతానికి సస్పెన్స్. ‘నిన్నుకోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత జంటగా ‘మజిలీ’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. నిజ జీవితంలో దంపతులైన నాగచైతన్య, సమంతలు ఈ చిత్రంలోనూ దంపతులుగానే కనిపించనున్నారు. వివాహం తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న తొలి చిత్రమిదే కావడం విశేషం. స్క్రిప్ట్ పరంగా ‘మజలీ’ సినిమాలో చైతూకు, సమంతకు గొడవలు ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోన్న షూటింగ్లో ఈ సన్నివేశాలనే చిత్రీకరిస్తున్నారట. వీరి గొడవలు రీల్ లైఫ్‌లోనే కానీ రియల్ లైఫ్‌లో కాదని ఇప్పటికైనా అర్థమైందా?. డిసెంబర్ తొలి వారానికి ఈ సినిమా చిత్రీకరణ దాదాపు 50 శాతం పూర్తవుతుందని వినికిడి. నటుడు సుబ్బరాజు ఓ కీలకపాత్ర చేస్తున్న ఈ సినిమాకు సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాతలు. -
‘వెంకీమామ’పై పుకార్లకు ఫుల్స్టాప్!
వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘వెంకీమామ’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. ఇందులో నాగచైతన్య సరసన రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయికగా నటించనున్నారు. వెంకటేశ్‌కు జోడీగా శ్రియ, హ్యూమా ఖురేషి పేర్లను పరిశీలిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్స్ కార్పొరేషన్ సంస్థలు నిర్మించనున్నాయి. ఇటీవల ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగిన విషయం కూడా గుర్తుండే ఉంటుంది. అయితే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లదనే పుకార్లు పుట్టుకొచ్చాయి. ఈ విషయంపై చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. ‘‘వెంకీమామ’ చిత్రం సెట్స్‌పైకి వెళ్లదనే వార్తల్లో నిజం లేదు. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి’’ అని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రస్తుతం నాగచైతన్య ‘సవ్యసాచి’ సినిమా ప్రమోషన్స్, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాతో బిజీగా ఉన్నారు. అలాగే వెంకటేశ్ ‘ఎఫ్ 2’ సినిమాతో బిజీగా ఉన్నారు. తాజా సమాచారం ఏంటంటే.. ‘వెంకీమామ’ సినిమా చిత్రీకరణ వచ్చే నెల సెకండ్ వీక్‌లో స్టార్ట్ కానుందట. ‘‘ఈ సినిమా పనులతో బాబీ బిజీగా ఉన్నాడు. వచ్చే నెల షూటింగ్ స్టార్ట్ చేస్తాం. వచ్చే ఏడాది ఓ మంచి ఎంటర్టైనర్ని ఇవ్వబోతున్నామనే నమ్మకంతో అందరం పని చేస్తున్నాం’’ అన్నారు కోన వెంకట్. -
చైసామ్ రొమాంటిక్ డ్రామా
నాగచైతన్య–సమంత.. టాలీవుడ్ మోస్ట్ క్రేజియస్ట్ కపుల్. పెళ్లి తర్వాత తొలిసారి ఈ ఇద్దరూ జంటగా నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ‘నిన్ను కోరి’ సినిమా ఫేమ్ శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దివ్యాన్ష కౌశిక్ మరో కథానాయికగా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. నాగచైతన్య 17వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం లెంగ్తీ షెడ్యూల్లో చైతూ, సమంత పాల్గొంటుండగా, వీరి కాంబినేషన్లో ఇది నాలుగో సినిమా (ఏమాయ చేసావె, మనం, ఆటోనగర్ సూర్య) కావడం విశేషం. ‘‘రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రమిది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాం. పెళ్లి తర్వాత నాగచైతన్య, సమంత కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా కావడంతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది’’ అని నిర్మాతలు అన్నారు. రావు రమేష్, సుబ్బరాజు, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: విష్ణు శర్మ. -
అక్కినేని హలిడే టూర్
ఫుల్‌గా పని చెయ్. ఆ తర్వాత తప్పకుండా హాలీడే చెయ్. ఇదే మా మంత్రం అంటున్నారు అక్కినేని కుటుంబ సభ్యులు. నాగచైతన్య, సమంతల ‘శైలజా రెడ్డి అల్లుడు, యు టర్న్’ రిలీజ్ కావడం, అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ షూటింగ్‌కి గ్యాప్ దొరకడంతో సేద తీరడానికి హాలీడే వెళ్లారు. వాళ్లు వెళ్లిన తర్వాత ‘దేవదాస్’ రిలీజ్ చూసుకొని అమలతో కలసి నాగార్జున కూడా వాళ్లతో జాయిన్ అయ్యారు. ఇలా కుటుంబమంతా సరదాగా హాలీడే మూడ్‌లోకి వెళ్లారు. ‘‘సక్సెస్ కూడా యాడ్ అయినప్పుడు హాలీడే ఇంకా అద్భుతంగా మారుతుంది’’ అని నాగార్జున ఈ ఫొటోను షేర్ చేశారు. -
శాంపిల్ రెడీ
భారతంలో అర్జునుడి రెండు చేతులకు సమానమైన బలం ఉండేది. అలాంటి శక్తి ఓ హీరోకి ఉంటే ఎలా ఉంటుంది? అనే అంశం ఆధారంగా రూపొందిన సినిమా ‘సవ్యసాచి’. నాగచైతన్య, నిధీ అగర్వాల్ జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నవీన్, రవిశంకర్, మోహన్ నిర్మించారు. ‘‘ఈ సినిమా ట్రైలర్‌ను అక్టోబర్ 1న ఉదయం 10 గంటలకు విడుదల చేయబోతున్నాం. షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందన్న నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. మాధవన్, భూమికా చావ్లా, ‘వెన్నెల’ కిశోర్, సత్య, రావు రమేశ్ కీలక పాత్రలు చేశారు. యం.యం. కీరవాణి సంగీతం అందించారు. యువరాజ్ సినిమాటోగ్రఫీ అందించిన ‘సవ్యసాచి’ చిత్రం నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘యువసామ్రాట్’ వద్దన్నా
‘‘సక్సెస్ విషయంలో చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అవుతున్నాయి. పెద్ద సినిమాలు చిన్నవి అవుతున్నాయి. కథ ముఖ్యం. సినిమా సక్సెస్ అనేది కేవలం హీరో, డైరెక్టర్‌దే కాదు. ఆ సినిమాకి చేసిన ఇతర యాక్టర్స్, టెక్నీషియన్స్కూ చెందుతుంది’’ అన్నారు నాగచైతన్య. మారుతి దర్శకత్వంలో నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా ఎస్. రాధాకృష్ణ సమర్పణలో నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మించిన సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’. ఈ సినిమా నేడు విడుదలవుతున్న సందర్భంగా నాగచైతన్య చెప్పిన విశేషాలు. ► ఈ సినిమాలో ఈగో లేని హీరో క్యారెక్టర్ చేశాను. కానీ, నా చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ ఫుల్‌గా ఈగో ఫీల్ అవుతాయి. అప్పుడు హీరో ఏం చేశాడు? అనేది ఆసక్తికరం. అనవసర ఈగో వల్ల వచ్చే సమస్యలు, రిలేషన్ బ్రేక్ అయ్యే పరిస్థితులను సినిమాలో చూపించాం. క్లైమాక్స్‌లో మంచి ఎమోషనల్ డ్రామా ఉంది. నాకు, ‘వెన్నెల’ కిశోర్ మధ్య ఉన్న సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తాయి. నా దృష్టిలో ఒక బ్యాలెన్సింగ్ కోణంలో ఈగో కరెక్టే అనిపిస్తుంది. కానీ, అది పక్కవారిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. ఈ సినిమాతో ఆడియన్స్‌కు మరింత చేరువ అవుతాను. ► మారుతీగారు ‘బాబు బంగారం’ సినిమా చేస్తున్నప్పుడు నేను ‘ప్రేమమ్’ చేస్తున్నాను. అప్పుడు ఆయనతో పరిచయం అయ్యింది. అలా ఈ సినిమా ప్రారంభానికి బీజం పడింది. నిర్మాత రాధాకృష్ణగారి జడ్జిమెంట్ బాగుంటుంది. అలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి కావాలి. నాన్నగారితో రమ్యకృష్ణగారు చాలా సినిమాలు చేశారు. ఈ సినిమా బిగినింగ్‌లో రమ్యకృష్ణగారితో కలిసి వర్క్ చేయడం కాస్త నెర్వస్‌గా అనిపించింది. ► ఒక సినిమా రిలీజ్ డేట్ మార్చడం కరెక్ట్ కాదన్నదే నా అభిప్రాయం. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ‘శైలజారెడ్డి అల్లుడు’ రిలీజ్ డేట్ మార్చాల్సి వచ్చింది. సమంత ‘యు టర్న్’, నా సినిమా ఒకేసారి వస్తాయనుకోలేదు. నిజానికి వాళ్లే ముందు డేట్ ఫిక్స్ చేసుకున్నారు. మా సినిమా, మీ ‘యు టర్న్’తో పాటు వస్తుందని సమంతతో చెప్పినప్పుడు ఇంట్లో ఓ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. మా ఇద్దరి సినిమాల్లో ఏది సక్సెస్ కావాలంటే.. రెండూ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ► యువసామ్రాట్ ట్యాగ్ వద్దని మారుతిగారికి చెప్పాను. కానీ వినలేదు. ఈ ట్యాగ్‌ను పెద్ద బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ చదువుతాను. నెగటివ్ కామెంట్స్‌ను పాజిటివ్‌గానే తీసుకుంటాను. నా మీద ప్రేమతోనే వాళ్లు అలా స్పందిస్తున్నారనుకుంటున్నా. ► ‘సవ్యసాచి’ సినిమాలో ఒక సాంగ్ బ్యాలెన్స్ ఉంది. నవంబర్‌లో రిలీజ్ చేస్తున్నాం. శివనిర్వాణ డైరెక్షన్లో చేయబోతున్న సినిమా అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో, ‘వెంకీమామ’ సినిమా అక్టోబర్ ఎండింగ్లో స్టార్ట్ అవుతాయి. ► నాన్నగారి కోసం (నాగార్జున) రాహుల్ రవీంద్రన్ ఓ కథ రెడీ చేస్తున్నాడు. అలాగే ‘బంగార్రాజు’ సినిమాలో నాన్నగారితో కలిసి యాక్ట్ చేసేది నేనా? అఖిలా? అనేది త్వరలో తెలుస్తుంది. డిజిటల్ మీడియా వైపు మా బ్యానర్ ఫోకస్ పెట్టింది. కొన్ని వెబ్ సిరీస్‌లు ప్లాన్ చేస్తున్నాం. ► కొత్త డైరెక్టర్స్‌ను ప్రోత్సహించడం ఇష్టమే. ఆల్రెడీ కొన్ని సినిమాలు చేశాను కూడా. కొన్ని వర్కౌట్ కాలేదు. అయితే ఒకరిని వేలెత్తి చూపే మనస్తత్వం కాదు నాది. నా జడ్జిమెంట్ కూడా తప్పు అయ్యుండవచ్చు. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో కెల్లా ‘ప్రేమమ్’కు బాగా కనెక్ట్ అయ్యాను. ► పెళ్లి తర్వాత లైఫ్ బాగుంది. పెళ్లి తర్వాత సమంతకు కెరీర్ ఎలా ఉంటుందో అని భయపడ్డాను. కానీ, ఆమె కెరీర్ సూపర్‌గా సాగడం హ్యాపీగా ఉంది. ► కెరీర్ పరంగా యాక్టర్స్ అందరికీ థ్రెట్ ఉంటుంది. అందరూ మంచి సినిమాలే చేయాలనుకుంటారు. ఇలాంటి పోటీ వాతావరణం మంచిదే. మంచి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయి. ‘అర్జున్ రెడ్డి’, ‘ఆర్ ఎక్స్ 100’... సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. నేనీ టైప్ సినిమాలు చేయాలంటే కాస్త టైమ్ పడుతుంది. -
‘శైలజారెడ్డి అల్లుడు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్
-
‘అల్లరి అల్లుడు’ అంత హిట్ అవ్వాలి
‘‘చైతన్యని అందరూ శైలజారెడ్డిగారి అల్లుడు అంటున్నారు.. కాదు.. అక్కినేని నాగేశ్వరరావుగారి మనవడు.. నాగార్జున పెద్దకొడుకు. ప్రేమకథా చిత్రాలైనా, ఎంటర్టైన్మెంట్ చిత్రాలైనా, ఒక స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్ ఉన్న సినిమాల్లో అయినా నాన్నగారికి నాన్నగారే సాటి. ఇప్పుడు ఆయన వారసత్వాన్ని చైతన్య తీసుకున్నాడు’’ అని హీరో నాగార్జున అన్నారు. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా రమ్యకృష్ణ ముఖ్య పాత్రలో మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. ఎస్.రాధాకృష్ణ(చినబాబు) సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఎస్.నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 13న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నాగార్జున మాట్లాడుతూ– ‘‘చైతన్య చాలా సాఫ్ట్.. చక్కగా నవ్వుతూ ఉంటాడు.. బంగారం.. అని మీరందరూ అంటూ ఉంటారు. కాదు.. తనలో చిలిపితనం కూడా ఉంది. నేను కొంచెం సినిమా చూశా. మారుతీగారు ఆ చిలిపితనాన్ని చక్కగా వాడుకున్నారు. నేను, రమ్యకృష్ణ కలసి ఎన్నో సినిమాలు చేశాం, చాలా పెద్ద హిట్స్ అయ్యాయి.‘బాహుబలి’ తర్వాత రమ్య అంటే భారతదేశంలో తెలియనివారు ఎవరూ లేరు. నాతోపాటు ‘అల్లరి అల్లుడు’ చిత్రంలో చిన్న గెస్ట్‌రోల్ చేసింది. ఇప్పుడు చైతన్యతో ‘శైలజారెడ్డి అల్లుడు’ చేసింది. ఈ సినిమా ‘అల్లరి అల్లుడు’ అంత హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మారుతీగారికి మాస్ పల్స్ బాగా తెలుసు. మా ఫ్యాన్స్‌కి ఏం కావాలో ఈ సినిమాలో మీరు ఇస్తున్నందుకు థ్యాంక్స్. గత నెలలో నాకు బాగా దగ్గరైన ఇద్దరు మనల్ని వదిలి వెళ్లిపోయారు. హరి అన్నయ్య(హరికృష్ణ). ఎవర్నైనా ఇక్కడ నేను ‘అన్న’ అని పిలుస్తానంటే అది ఆయనొక్కర్నే. ఆయన వెళ్లిపోయిన రోజు నా పుట్టినరోజు. పొద్దున్నే వార్త వినగానే ఎలా కనెక్ట్ చేసుకోవాలో కూడా తెలియలేదు. నా స్నేహితుడు, ఆత్మీయుడు రవీందర్ రెడ్డి మరణం కూడా నన్ను బాధించింది. చైతన్య కెరీర్లో ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా బిగ్గెస్ట్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు. హీరో నాని మాట్లాడుతూ– ‘‘ఇంతకుముందు జనరేషన్లో మంచి సాంగ్స్ అన్నీ నాగార్జునగారికి పడితే.. మా జనరేషన్లో మంచి సాంగ్స్ నాగచైతన్యకు పడ్డాయి. ఆ ఫ్యామిలీకి మంచి పాటలన్నీ అలా రాసిపెట్టినట్లు ఉన్నాయి. ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రం కొంచెం ‘అల్లరి అల్లుడు’ లాంటి సినిమా అని నాగార్జునగారు నాతో అన్నారు. ఆ మాట చాలు ఈ సినిమాలో ఏ స్థాయి ఎంటర్టైన్మెంట్ ఉంటుందో’’ అన్నారు. ‘‘ఇంత స్పీడ్‌గా షూటింగ్ పూర్తి చేసి, ఇంతే త్వరగా సినిమా రిలీజ్ చేస్తుండటం ఇన్నేళ్లలో ఫస్ట్‌టైమ్ చూస్తున్నా. వేడివేడిగా మీ ముందుకు రాబోతోంది’’ అన్నారు రమ్యకృష్ణ. మారుతి మాట్లాడుతూ– ‘‘నాగచైతన్యగారిని మీరు(అభిమానులు) ఎలా చూడాలనుకుంటున్నారో వందశాతం అలాగే ఉంటారని గ్యారంటీ ఇస్తున్నా. ఈ సినిమా నుంచి ఆయన యువసామ్రాట్.. ఫిక్స్ అవ్వండి. ఈ సినిమాలో ట్యాగ్ వేస్తున్నా. ‘శైలజారెడ్డి అల్లుడు’ ఓ మంచి లవ్‌స్టోరీ. రమ్యమేడమ్తో ఫొటో దిగడం, పనిచేయడం అందరికీ ఓ కలలా ఉంటుంది. అలాంటిది ఆమెను డైరెక్ట్ చేయడం నా కల నెరవేరినట్టే. ఓ యాక్టర్‌గా, హీరోగా పరిచయమైన నా హీరో(నాగచైతన్య).. ఇప్పుడు నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు’’ అన్నారు. నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘మా అక్కినేని అభిమానులందరికీ నమస్కారం. బయటికి అభిమానులు అంటున్నాం కానీ మీరందరూ నా ఫ్యామిలీయే. ప్రతి సినిమా ఈవెంట్‌కి వచ్చి ఇలాగే ఎంకరేజ్ చేసి ఇదే ఎనర్జీ ఇచ్చి ప్రోత్సహిస్తారు. మీరే నా బలం, బలహీనత.. మీరిచ్చే ప్రేమకి మీరు కోరుకునేది ఓ హిట్ సినిమా. ఇకనుంచి ప్రతి సినిమా మిమ్మల్ని మైండ్‌లో పెట్టుకుని మీరు గర్వపడే సినిమాలు చేస్తానని మాట ఇస్తున్నా. మారుతిగారు మనకి ఓ సూపర్ సినిమా ఇచ్చారు. చినబాబుగారు, వంశీ, పీడీవీ ప్రసాద్‌గారు రెండేళ్లకిందట ఎప్పటికీ మరచిపోలేని ‘ప్రేమమ్’ అనే సినిమా ఇచ్చారు. ఇప్పుడు ఈ సినిమా ఇచ్చారు. రమ్య మేడమ్ ఈ సినిమాకి పెద్ద సపోర్ట్. పండుగకి ఇది పండుగలాంటి సినిమా. మీరు ఎంజాయ్ చేసి, మీ మొహంలో ఓ నవ్వుంటే నేనూ ఆరోజు పండుగ చేసుకుంటా’’ అన్నారు. ‘‘ఇటీవల స్టేజ్ ఎక్కిన ప్రతిసారి నాకు మాటలు సరిగ్గా వచ్చేవి కాదు. అన్నయ్య(నాగచైతన్య) గురించి మాట్లాడాలన్నప్పుడు మాత్రం తన్నుకుంటూ వస్తున్నాయి. మారుతీగారు మీరు కరెక్ట్ టైమ్‌లో కరెక్ట్ హీరోని పట్టారు. సినిమాలో అల్లుణ్ని చేశారు. పెళ్లి చేసుకున్న తర్వాత అన్నయ్య ఫేస్‌లో సడెన్‌గా మంచి గ్లో వచ్చింది’’ అని హీరో అఖిల్ అన్నారు. చిత్ర సమర్పకులు రాధాకృష్ణ, నిర్మాతలు పీడీవీ ప్రసాద్, నాగవంశీ, అనూ ఇమ్మాన్యుయేల్, నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, రవిశంకర్, నటులు కాశీ విశ్వనాథ్, నరేశ్, సంగీత దర్శకుడు గోపీసుందర్, కెమెరామెన్ నిజ ర్ పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అన్నీ సొంత నిర్ణయాలే!
‘‘కెరీర్ స్టార్టింగ్‌లో ఉన్నాను. తప్పులు చేస్తే దిద్దుకునే అవకాశం ఉంటుంది. పోటీ ఫీలవ్వను. హిట్, ఫ్లాప్స్ నా కంట్రోల్లో ఉండవు. సినిమాలు ఆడకపోతే చాన్సులు తగ్గుతాయనే నెర్వస్నెస్ ఉంటుంది. సినిమా సినిమాకు నన్ను నేను బెటర్ చేసుకోవాలనుకుంటాను. సొంత నిర్ణయాలు తీసుకోవడానికే ఇష్టపడతాను’’ అన్నారు అనూ ఇమ్మాన్యుయేల్. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యు యేల్ జంటగా మారుతి దర్శకత్వంలో నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా అనూ ఇమ్మాన్యుయేల్ చెప్పిన సంగతులు... ► ఈ మూవీలో ఈగోయిస్ట్ అండ్ యాంగ్రీ గాళ్ అను పాత్ర చేశాను. ఎప్పుడూ తనే నంబర్ 1 అవ్వాలనుకుంటుంది. గర్వంగా ఫీల్ అవుతుంది. కానీ ఒకసారి ప్రేమిస్తే ఎక్కువగా ప్రేమిస్తుంది. ఇంతకు ముందు నేను చేసిన పాత్రలకు భిన్నంగా ఉంటుంది. రియల్ లైఫ్‌లో నేను కొంచెం ఈగోయిస్ట్. అయితే ఎంతవరకూ ఉండాలో అంతవరకే. ► నాగచైతన్య కంఫర్టబుల్ అండ్ చాలెంజింగ్ కో స్టార్. రమ్యకృష్ణగారి ఎనర్జీ సూపర్. పెద్ద పెద్ద డైలాగ్స్‌ను కూడా ఆమె జ్ఞాపకం పెట్టుకుని సులభంగా చెప్పేవారు. సినిమాలో రమ్యకృష్ణగారి కూతురు పాత్రలో కనిపిస్తాను. మారుతిగారు అమేజింగ్ డైరెక్టర్. సెట్లో నేను ఎక్కువగా సైలెంట్‌గానే ఉంటాను. కానీ ఒకసారి నాకు కనెక్ట్ అయితే నాన్‌స్టాప్‌గా మాట్లాడతాను. ► ‘అజ్ఞాతవాసి’ స్క్రిప్ట్‌ని వినే సైన్ చేశాను. ఆ సినిమా మంచి వర్కింగ్ ఎక్స్పీరియన్స్. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’లో నటించడం హ్యాపీ. ‘గీత గోవిందం’ సినిమాలో నాకు ఆఫర్ వచ్చింది. కానీ డేట్స్ లేకపోవడంతో కుదరలేదు. అందుకే గెస్ట్ రోల్ చేశాను. ‘అజ్ఞాతవాసి, గీతగోవిందం’ సినిమాలకు నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్పాను. హైదరాబాద్‌లో ఇల్లు ఇంకా కొనలేదు. కానీ హోమ్లీ ఫీలింగ్ ఉంది. ► నేను నటించిన కొన్ని సినిమాలు ఆశించినంతగా ఆడలేదు. అయితే ఏం? కెరీర్ స్టారింగ్‌లో శ్రుతీహాసన్‌కి కూడా ఇలానే జరిగింది. ఫ్లాప్స్ అనేవి జర్నీలో ఓ భాగం. ప్రస్తుతం నా మాతృభాష మలయాళంతో పాటు ఇతర భాషల నుంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ముందు తెలుగులో ప్రూవ్ చేసుకోవాలను కుంటున్నాను. మంచి స్క్రిప్ట్, స్ట్రాంగ్ రోల్స్ కోసం చూస్తున్నాను. ప్రయోగాత్మక చిత్రాలు చేయాలని ఉన్నా యంగ్ యాక్ట్రస్ని కాబట్టి ఇప్పుడే కరెక్ట్ కాదేమో అనిపిస్తోంది. కరెక్ట్ టైమ్ వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను. -
అమ్మాయి కోపం... అబ్బాయి శాంతి జపం!
అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి బోలెడు మ్యాజిక్కులు, జిమ్మిక్కులు చేస్తుంటారు అబ్బాయిలు. మామూలు అమ్మాయిల ప్రేమను గెలుచుకోవడానికే ఇంత కష్టపడితే... కొంచెం ఈగో ఉన్న అమ్మాయి మనసులో ప్లేస్ సంపాదించాలంటే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సిందే. అదే చేశారు నాగచైతన్య. కాస్త శాంతించమని అనూ ఇమ్మాన్యుయేల్ కోసం పాట అందుకున్నారు. ఆ పాట వీడియో శాంపిల్‌ను శుక్రవారం విడుదల చేశారు. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా మారుతి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’. రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాలోని ‘అనుబేబీ’ సాంగ్ వీడియో టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఇందులో నాగచైతన్య స్టెప్స్ కొత్తగా ఉన్నాయి. ‘‘అను బేబీ’ సాంగ్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా యూ ట్యూబ్‌లో విడుదల చేశాం. కృష్ణకాంత్ రాశారు. అనుదీప్ దేవ్ పాడారు. శేఖర్ వీజే కొరియోగ్రఫీ చేశారు. ఆడియో విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం’’అని చిత్రబృందం పేర్కొంది. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఈ చిత్రాన్ని ఈ నెల 31న విడుదల చేయాలనుకుంటున్నారు. -
అల్లుడు వస్తున్నాడు
అల్లుడు రాక కోసం సర్వం సిద్ధం చేశారు. మరి.. అల్లుడికి అత్తయ శైలజారెడ్డి ఎలాంటి సౌకర్యాలు, ఏ స్థాయి స్వాగత మర్వాదలు చేశారనేది సిల్వర్ స్క్రీన్‌పై చూడాల్సిందే. మారుతి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తున్నారు. అత్తయ్య శైలజారెడ్డి పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నారు. గోపీసుందర్ స్వరాలు అందిస్తున్నారు. రీసెంట్గా నాగచైతన్య, అను, రమ్యకృష్ణలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ నెల 9న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘‘శైలజా రెడ్డి అల్లుడు వస్తున్నాడు’’ అని పేర్కొన్నారు దర్శకుడు మారుతి. ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ చేయనున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. -
డేట్ నైట్
వీకెండ్‌ని రొమాంటిక్‌గా గడిపారు కొత్త జంట నాగచైతన్య, సమంత. యాడ్ షూట్ కోసం ముంబై వెళ్లిన ఈ ఇద్దరూ షూట్ అయిపోయిన వెంటనే ముంబై రెస్టారెంట్లో సరదాగా సమయం గడిపారు. వర్క్‌ని, వీకెండ్‌ని బ్యాలెన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సమంత. పెళ్లి తర్వాత రెండు యాడ్స్ చేసిన ఈ జంట తర్వలోనే ఫుల్ లెంగ్త్ మూవీలో కూడా కనిపించనున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందబోయే లవ్ ఎంటర్టైనర్లో ఈ జంట పెళ్లి తర్వాత ఫస్ట్ టైమ్ స్క్రీన్‌పై సందడి చేయ నున్నారు. ఇందులో నాగచైతన్య క్రికెటర్ పాత్రను పోషించనున్నారని టాక్. -
నిజాయితీ ఉండాలి
అబ్బాయిలను ఇష్టపడాలంటే బోలేడు గుడ్ క్వాలిటీస్ వారిలో ఉండాలని అమ్మాయిలు కోరుకుంటారు. తమను ఎప్పుడూ సంతోషంగా ఉంచుతూ నవ్వించే అబ్బాయిలను మరింత ఇష్టపడతారు కొందరు అమ్మాయిలు. అయితే. . కేవలం నవ్విస్తే సరిపోదు. నిజాయితీగా కూడా ఉండాలి అంటున్నారు కథానాయిక నిధి అగర్వాల్. ‘‘నవ్వించే అబ్బాయిలకు ఈజీగా అమ్మాయిలు ఎట్రాక్ట్ అవుతారు. నవ్వు వారి రిలేషన్‌షిప్‌ను స్ట్రాంగ్‌గా ఉంచుతుంది’’ అన్న ఓ ట్విటర్ కామెంట్‌కు నిధి స్పందిస్తూ...‘‘అబ్బాయిలు ఓన్లీ నవ్విస్తే సరిపోదు. నిజాయితీగా కూడా ఉండాలి. అలాగే స్థిరంగా ఉంటూనే చాలా ప్రేమించాలి’’ అని సరదాగా పేర్కొన్నారు. అన్నట్లు ఈ బ్యూటీ ఈ ఏడాది తెలుగు తెరపై ఎంట్రీ ఇవ్వనున్నారు. నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘సవ్యసాచి’ సినిమాలో నిధినే కథానాయిక. ఈ సినిమాను జూలై లోపు రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. -
మనం చూడనిది!
‘‘నా వయసు 32’’ అంటున్నారు నాగార్జున. హ్యాండ్సమ్గా ఫిట్‌గా ఉండే నాగార్జున ఏజ్ ఫిఫ్టీ ప్లస్ అయినా థర్టీ ప్లస్ అంటే నమ్మేట్టే ఉంటుంది. ఇంతకీ పని గట్టుకుని ‘32 ఇయర్స్’ అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందీ అంటే.. ‘నా వయసు ముప్పై రెండే, కానీ... నటుడిగా’ అన్నారు నాగ్. మే 23తో నటుడిగా నాగార్జున వయసు 32. అదేనండీ ఇండస్త్రీకి వచ్చి 32ఏళ్లు అవుతోంది. నాగార్జున హీరోగా పరిచయమైన ‘విక్రమ్’ మే 23న రిలీజ్ అయింది. అదే రోజున అక్కినేని నాగేశ్వరరావు లాస్ట్ సినిమా ‘మనం’ కూడా విడుదలవ్వడం విశేషం. ఈ విషయం గురించి నాగార్జున స్పందిస్తూ – ‘‘కొన్ని సంఘటనలు కాకతాళీయంగా జరుగుతాయా? లేక యూనివర్శ్‌కి నంబర్ గేమ్స్ అంటే ఇష్టమా? అని ఆశ్చర్యపోతుంటాను. నా ఫస్ట్ సినిమా ‘విక్రమ్’, మా నాన్నగారి లాస్ట్ సినిమా ‘మనం’ రెండూ మే 23నే రిలీజ్ అయ్యాయి. మేం ఏదీ ప్లాన్ చేయలేదు. అన్నీ అలా జరిగిపోయాయి. ఆ డేట్ 23ని రివర్స్ చేస్తే 32. అది నా ఏజ్. యాక్టర్‌గా నా వయసు 32. ఇన్ని సంవత్సరాలుగా అందరూ చూపిస్తున్న అభిమానానికి చాలా థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు. ‘మనం’ సినిమా రిలీజ్ అయి నాలుగు సంవత్సరాలు కావడంతో తండ్రిని గుర్తు చేసుకుంటూ – ‘‘మనం’ రిలీజ్ అయి 4 సంవత్సరాలు అవుతోంది. మమ్మల్నందర్నీ నవ్వించారు, ఏడిపించారు, జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పించారు. ఇలా ప్రతీ విషయాన్ని గుర్తు చేసుకుంటూనే ఉంటాం నాన్నా. ప్రతీక్షణం మీ గురించే ఆలోచిస్తూ చిరునవ్వు తెచ్చుకుంటాం. ఏయన్ఆర్ ఎప్పటికీ బతికే ఉంటారు’’ అని ఉద్వేగంగా పేర్కొన్నారు నాగార్జున. అన్నట్లు ‘మనం’లో ఏయన్నార్ కింద, నాగచైతన్య కుర్చీలో కూర్చుని, నాగార్జున నిలబడి ఉన్న ఫస్ట్ లుక్ బాగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో కనిపించని రేర్ ఫొటో ఒకటుంది. పైన ఉన్నది అప్పుడు మనం చూడని ఫొటోనే. ‘మనం’ విడుదలై నాలుగేళ్లైన సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ రిలీజ్ చేసిన ఫొటో ఇది. -
అల్లుడు లెట్స్ డు కుమ్ముడు
మర్యాదల్లో ఏదైనా తేడా వచ్చిందో లేక ఫ్యామిలీని ఎవరైనా ఏమైనా కామెంట్ చేశారో.. కరెక్ట్ రీజన్ తెలీదు కానీ, విలన్స్‌ను కుమ్మేస్తున్నాడు అల్లుడు. ఈ అల్లుడు ఎవరి తాలుకానో తెలుసు కదా! పవర్ఫుల్ శైలజారెడ్డి తాలుకా అండీ బాబు. నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘శైలజారెడ్డిగారి అల్లుడు’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. శైలజారెడ్డి పాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నారని సమాచారం. ప్రస్తుతం హీరో నాగచైతన్యపై ఫైట్ సీన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. అంటే అల్లుడు లెట్స్ డు కుమ్ముడు అన్నమాట. ఆఫ్టర్ ఫైట్ అనూతో సరసాలడతారట నాగచైతన్య. అదేనండి.. ఈ సినిమాలో హీరో హీరోయిన్లపై రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరిస్తారని చెబుతున్నాం. -
సెంట్రల్ పార్క్... ఓ తీయని జ్ఞాపకం
ప్రేమికులకు ఫస్ట్ కలిసిన ప్లేస్, ఫస్ట్ ప్రపోజ్ చేసిన డేట్, ఫస్ట్ డిన్నర్, ఫస్ట్, ఫస్ట్.... ఇలా ఫస్ట్‌లన్నీ ప్రత్యేకమే. ఎప్పుడైనా తాము ఫస్ట్ కలుసుకున్న ప్లేస్‌కి వెళ్లినా, ఫస్ట్ ప్రపోజ్ చేసుకున్న చోటుకి వెళ్లినా కచ్చితంగా ‘నోస్టాల్జియా’ ఫీల్ అవుతారు. ఇప్పుడు అదే ఫీలింగ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు క్రేజీ కపుల్ నాగచైతన్య, సమంత. రియల్ లైఫ్‌లో సమంతకు చైతన్య ఎప్పుడు ప్రపోజ్ చేశారో తెలీదు కానీ రీల్ లైఫ్‌లో మాత్రం ఎనిమిదేళ్ల క్రితం గౌతమ్ వాసుదేవ్‌మీనన్ రూపొందించిన‘ఏ మాయ చేశావె’ సినిమాలో చేశారు. ఆ సన్నివేశంలో‘ఐ లవ్ యూ జెస్సీ. మనం పెళ్లి చేసుకుందాం. ఇప్పుడే.. ఇక్కడే..’ అని సమంతతో చెబుతారు నాగచైతన్య. అలా రీల్ లైఫ్‌లో చేసిన ప్రపోజల్ రియలై చైతు–సామ్ జోడీ అయ్యారు. ప్రస్తుతం నాగచైతన్య, సమంత హాలిడేలో భాగంగా న్యూయార్క్ సందర్శించారు. అక్కడ సెంట్రల్ పార్క్ దగ్గర తాము ఫస్ట్ టైమ్ (రీల్లో) ప్రపోజ్ చేసుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. దాన్ని ఓ మెమరీగా బంధించుకోవటానికి ఓ సెల్ఫీ కూడా క్లిక్ చేసుకున్నారు. ఆ ఫొటోను సమంత షేర్ చేస్తూ ‘‘సాధారణంగా సెల్ఫీలంటే అంతగా నచ్చదు. కానీ ఈసారి మాత్రం దిగాల్సిందే. సెంట్రల్ పార్క్.. ఇదంతా మొదలైంది ఇక్కడే. ఎనిమిదేళ్లు అయిపోయింది. థ్యాంక్స్ చెప్పుకోవటానికి వచ్చినట్టుంది. ప్రేమ ఏదో ఓ మార్గాన్ని వెతుకుతుంది. జరగాలని రాసి పెట్టుంటే కచ్చితంగా జరుగుతుంది’’ అని పేర్కొన్నారు సమంత. -
వేసవిలో అల్లుడొస్తాడు!
సంక్రాంతి పండక్కి కొత్త అల్లుడు అత్తింటికి వెళ్తాడు. కానీ మా సినిమాలోని అల్లుడు మాత్రం వేసవిలో వస్తాడు అంటున్నారు డైరెక్టర్ మారుతి. నాగచైతన్య హీరోగా మారుతి దర్వకత్వంలో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ ఓ సినిమా నిర్మిస్తున్నారు. ఇందులో అనూ ఇమ్యాన్యుయేల్ కథానాయిక. ఈ చిత్రానికి ‘శైలజారెడ్డిగారి అల్లుడు’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆల్రెడీ ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. ‘‘అందరూ నాగచైతన్య మూవీ గురించి అడుగుతున్నారు. అతను ‘సవ్యసాచి’ సినిమాతో బిజీగా ఉన్నాడు. నేనూ మీలాగే (ఫ్యాన్స్) తనకోసం వెయిట్ చేస్తున్నాను. మేలో ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాం. డోంట్ వర్రీ.. ఫ్యాన్స్‌కు ఎలా కావాలో అలానే ఉంటుంది సినిమా’’ అని మారుతి పేర్కొన్నారు. సో.. వేసవికి అల్లుడొస్తాడన్నమాట. ఈ సంగతి ఇలా ఉంచితే... చందు మొండేటి దర్వకత్వంలో నాగచైతన్య హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘సవ్యసాచి’ మేలో విడుదల చేయాలనుకుంటున్నారు. -
బ్యాంగ్ బ్యాంగ్
భూమిక చివరిసారిగా తెలుగు స్క్రీన్‌పై కనిపించింది ఎప్పుడు? ఓ మూడేళ్లు అయ్యుంటుంది. ఈ ఏడాది ‘ఎంసీఏ’ (మిడిల్ క్లాస్ అబ్బాయి)తో తెలుగుకి మళ్లీ వచ్చారు. ఈ చిత్రంలో ఆమె హీరో నానికి వదినగా నటించి, మంచి మార్కులే కొట్టేశారు. కమ్‌బ్యాక్ అంటే.. ఇలా బ్యాంగ్ బ్యాంగ్‌గా ఉండాలన్నట్టు ఈ చిత్రంలో భూమిక మెప్పించారు. నెక్ట్స్ ఏంటి? మళ్లీ కనిపిస్తారా? గ్యాప్ తీసుకుంటారా? అంటే.. చాన్సే లేదు. ఇక వరుసగా సినిమాలు చేసేలా ఉన్నారు. ఎందుకంటే, ‘ఎంసీఏ’ ఇలా రిలీజైందో లేదో భూమిక మరో సినిమాతో బిజీ అయ్యారు. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తున్న ‘సవ్యసాచి’ షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు భూమిక. దీన్నిబట్టి చూస్తుంటే ఈ బ్యూటీ తన కెరీర్ మీద ఫుల్ ఫోకస్ పెట్టారనిపిస్తోంది. సో.. భూమిక యూత్ హీరోలందరికీ అక్క, వదినగా, అవి కాకపోతే కథ డిమాండ్‌ని బట్టి కథానాయికగా కూడా కనిపించే అవకాశం ఉంది. -
గృహప్రవేశం
సినీ స్టార్‌కి ఒక హౌస్ నచ్చాలంటే అది ఎలా ఉండాలి? సూపర్బ్ డిజైన్ విత్ ఆల్ ఫెసిలిటీస్ అండ్ ఫర్నిచర్‌తో అదిరిపోవాలి. అలాంటి ఇల్లు కట్టాలంటే ఎట్లీస్ట్ వన్ ఇయర్ టైమ్ పడుతుంది. కానీ, యాక్టర్ మాధవన్ ఇంటిని మాత్రం హైదరాబాద్‌లో 25 డేస్‌లో కట్టేశారు. భాగ్యనగరానికి ఆయనెప్పుడు మకాం మార్చారు? అనే డౌట్ క్లారిఫై కావాలంటే మేటర్‌కు బ్రేక్ ఇవ్వకుండా కంటిన్యూ చేయండి. నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సవ్యసాచి’. ఈ సినిమాలో మాధవన్ ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో ఈ సినిమా షూటింగ్‌ను సిక్స్ డేస్ బ్యాక్ స్టార్ట్ చేసిన షెడ్యూల్లో మాధవన్ పాల్గొంటున్నారు. ఈ సినిమాలో మాధవన్ ఉండే ఇంటిని సెట్‌గా వేయించారు నిర్మాతలు. ఇది కాస్ట్లీ సెట్ అని, పూర్తవడానికి 25 రోజులు పట్టిందని పేర్కొన్నారు. అంటే.. మాధవన్ రీల్ లైఫ్‌లో కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశారన్నమాట. అన్నట్లు.. రామ్‌చరణ్ ‘రంగస్థలం’లో అసలు సిసలు పల్లెటూరిని తలపించేలా బ్రహ్మాండంగా సెట్స్ వేసిన రామకృష్ణనే ‘సవ్యసాచి’కి కూడా ఆర్ట్ డైరెక్టర్. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘నీలో మంచి బ్రదర్ ఉన్నాడని నాకు తెలుసు. కానీ, సౌత్ మొత్తం నిన్ను ఇష్టపడుతున్నారు. దానికి కారణం నువ్వు మంచి హ్యూమన్ బీయింగ్. నీతో కలసి సినిమా చేయడం ఆనందంగా ఉంది’’ అని నాగచైతన్య బర్త్‌డే (నవంబర్ 21) సందర్భంగా మాధవన్ అంటే, ‘‘నువ్వు మా సినిమాలోకి వచ్చినందుకు ఎగై్జటింగ్‌గా ఉంది’’ అని చైతూ అన్నారు. ఈ మాటలను బట్టి ఈ ఇద్దరూ ఎంతగా కనెక్ట్ అయ్యారో అర్థమవుతోంది. ఇద్దరి కాంబినేషన్లో వచ్చే సీన్స్ బ్రహ్మాండంగా వర్కవుట్ అవుతాయని కూడా ఊహించవచ్చు. -
ఇటు కాజల్... అటు నిత్యా... మధ్యలో శర్వా
ఇప్పటివరకూ ఇద్దరమ్మాయిలతో సినిమాలు చేయని హీరోల్లో శర్వానంద్ ఒకరు. ఆల్మోస్ట్ శర్వా హీరోగా చేసిన సినిమాలు అన్నిటిలోనూ సింగిల్ హీరోయినే. కానీ, కెరీర్లో తొలిసారి ఇద్దరమ్మాయిలతో సినిమా చేయబోతున్నారు. శర్వానంద్ హీరోగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఓ సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే. అందులో శర్వా సరసన కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటించనున్నారు.సోమవారం ఉదయం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. హారిక అండ్ హాసిని సంస్థ అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) చిత్రదర్శక–నిర్మాతలకు స్క్రిప్ట్ అందజేశారు. ఈ సందర్భంగా హీరోయిన్ల పేర్లు ప్రకటించారు. పూజాకార్యక్రమాల అనంతరం శర్వానంద్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి హీరో నాగచైతన్య క్లాప్ ఇవ్వగా, దర్శకుడు మారుతి కెమెరా స్విచ్చాన్ చేశారు. డిసెంబర్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత నాగవంశీ తెలిపారు. ఈ ప్రారంభోత్సవంలో నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, పి. కిరణ్, దర్శకుడు అనిల్ రావిపూడి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రశాంత్ పిళ్లై, కెమెరా: దివాకర్ మణి, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, సమర్పణ: పి.డి.వి. ప్రసాద్. -
సవ్యసాచి... ఎటు నీ చూపుల గురి?
‘సవ్యసాచి’... పంచ పాండవుల్లోని అర్జునుడికున్న పేర్లలో ఒకటి! ఈ పేరు ఎందుకు వచ్చిందంటే... ‘రెండు చేతులతోనూ విల్లు ఎక్కుపెట్టగల సమర్ధుడు కాబట్టి’ అనే ఆన్సర్ వస్తుంది. అక్కినేని నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ‘సవ్యసాచి’ పేరుతో సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సిన్మా టైటిల్ లోగోతో పాటు రెండు చేతులను వెనక్కి పెట్టుకుని శూలాలు పట్టుకున్న హీరోని చూస్తే పైన చెప్పిన ఆన్సర్ నిజమే అన్పిస్తుంది. అయితే... అర్జునుణ్ణి ‘సవ్యసాచి’ అనడానికి ఇంకో కారణం ఉంది. అదేంటంటే... పట్టుదల, అంకితభావం, కఠోర శ్రమతో అతి తక్కువ కాంతిలోనూ శబ్దాన్ని బట్టి విల్లు ఎక్కుపెట్టి వస్తువు ని కొట్టగల నైపుణ్యం అర్జునుడి సొంతమట! ఈ మాటలను దృష్టిలో పెట్టుకునే ఈ రోజు నాగచైతన్య బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన లుక్‌ను డిజైన్ చేసినట్టున్నారు. చైతూ చూపుల్లో ఓ పట్టుదల, కసి కనిపిస్తున్నాయ్ కదూ!! ఆ చూపుల గురి ఎటో మరి? ప్రస్తుతం హైదరాబాద్‌లో చైతూ, మాధవన్ తదితరులపై సీన్స్ తీస్తున్నారు. ఇందులో నిధీ అగర్వాల్ హీరోయిన్. ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి, కెమెరా: యువరాజ్, సీఈఓ: చిరంజీవి (చెర్రీ), లైన్ ప్రొడ్యూసర్: పీటీ గిరిధర్, నిర్మాతలు: వై. నవీన్, వై. రవిశంకర్, మోహన్ (సీవీయం). -
షూటింగ్ షురూ!
మీ లెఫ్ట్ హ్యాండ్ మీ హ్యాండోవర్లోనే ఉందా..? ఇదేం తిక్క ప్రశ్న. రైట్ అయినా లెఫ్ట్ అయినా ఎవరి హ్యాండ్ వారి హ్యాండోవర్లోనే ఉంటుంది కదా అనుకోవచ్చు. కానీ హీరో నాగచైతన్య లెఫ్ట్ హ్యాండ్‌కు మాత్రం నో కంట్రోల్. అంతేకాదు.. కుడి చేతికి ఎంత పవర్ ఉందో సేమ్ టు సేమ్ అంతే పవర్ ఎడమ చేతికి ఉంది. కానీ ఇక్కడో ప్రాబ్లమ్ ఉంది. ఏంటంటే... నాగచైతన్య లెఫ్ట్ హ్యాండ్ అతని బ్రెయిన్ చెప్పిన పని చేయదు. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. అన్నట్లు.. చైకి లెఫ్ట్‌హ్యాండ్ మీద కంట్రోల్ లేనిది రీల్ లైఫ్‌లోనే. రియల్ లైఫ్‌లో కాదండోయ్. చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ‘సవ్యసాచి’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో నాగచైతన్య క్యారెక్టర్ పైన చెప్పిన విధంగా ఉంటుంది. ఈ సినిమా షూటింగ్‌ను ఈ నెల 8న స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. కన్నడ బ్యూటీ నిధీ అగర్వాల్‌ను హీరోయిన్గా సెలక్ట్ చేశారని ఇన్సైడ్ టాక్. పెళ్లి తర్వాత చై–సామ్ హనీమూన్ వెళ్లారు. ట్రిప్‌ని ఎంజాయ్ చేసి, హైదరాబాద్ కూడా వచ్చేశారు. ఇక, ఇద్దరూ తమ తమ షూటింగ్స్‌తో బిజీగా ఉంటారు. -
రకుల్ మరో ఛాన్స్ కొట్టేసింది
హీరోయిన్గా ఎదగాలంటే అందం, అభినయం మాత్రమే ఉంటే సరిపోదు. లక్ కూడా కలిసి రావాలి.. అలా లక్కీ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్న టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. తన తోపాటు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లందరూ అవకాశాల కోసం ఎదురుచూస్తుంటే రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం స్టార్లు, సూపర్ స్టార్లతో కూడా సినిమాలకు కమిట్ అవుతోంది. ఇప్పటికే మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్లో రూపొందుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌కు సెలెక్ట్ అయిన ఈ బ్యూటి మరో ఇంట్రస్టింగ్ సినిమాకు ఓకె చెప్పింది. ప్రస్తుతం ప్రేమమ్, సాహసం స్వాసగా సాగిపో సినిమాలను రిలీజ్‌కు రెడీ చేసిన యంగ్ హీరో నాగచైతన్య, తన నెక్ట్స్ సినిమాను కూడా కన్ఫామ్ చేశాడు. నాగార్జున హీరోగా సొగ్గాడే చిన్ని నాయనా లాంటి బ్లాక్ బస్టర్ హిట్‌ను అందించిన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాకు రకుల్ ప్రీత్‌ను హీరోయిన్గా తీసుకోవాలని భావిస్తున్నారట. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలతో టాప్ స్టార్‌గా ఎదుగుతున్న రకుల్‌కు ఇది మరో మంచి అవకాశం అన్న టాక్ వినిపిస్తోంది. -
వరుసగా లైన్లో పెడుతున్నాడు
యంగ్ హీరో నాగచైతన్య ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఇప్పటికే గౌతం మీనన్ దర్శకత్వంలో సాహసం శ్వాసగా సాగిపో సినిమాను పూర్తి చేసిన చైతన్య, ఆ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ప్రస్తుతం మలయాళ సూపర్ హిట్ సినిమా ప్రేమమ్‌ను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు లైన్లో ఉండగానే సోగ్గాడే చిన్నినాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మరో సినిమా కోసం చర్చలు జరుపుతున్నాడు. ఇలా మూడు సినిమాలతో బిజీగా ఉన్న చైతూ, ఇప్పుడు నాలుగో సినిమాను కూడా లైన్లో పెట్టే ఆలోచనలో ఉన్నాడట. గబ్బర్‌సింగ్ సినిమాతో స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిన హరీష్ శంకర్, ఇటీవల సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాతో మరోసారి కమర్షియల్‌గా ప్రూవ్ చేసుకున్నాడు. దీంతో హరీష్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి చైతు ప్లాన్ చేసుకుంటున్నాడన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సుబ్రమణ్యం ఫర్ సేల్ తరువాత ఇంత వరకు సినిమా ఎనౌన్స్ చేయని హరీష్ శంకర్, నాగచైతన్య ఇమేజ్ తగ్గ కథ కోసం ట్రై చేస్తున్నాడు. కరెక్ట్ లైన్ దొరికితే త్వరలోనే ఈ సినిమా ప్రాజెక్ట్ కూడా ఫైనల్ చేసి లైన్లో పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడు చైతు.