కరోనా: సామ్‌ పోస్టు.. చై ‘క్వారంటీమ్‌’ | Samantha Shares Adorable Pic Of Naga Chaitanya With Pet Dog | Sakshi
Sakshi News home page

కరోనా: సామ్‌ పోస్టు.. చై ‘క్వారంటీమ్‌’

Published Thu, Mar 26 2020 4:20 PM | Last Updated on Thu, Mar 26 2020 5:48 PM

Samantha Shares Adorable Pic Of Naga Chaitanya With Pet Dog - Sakshi

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు 21 రోజుల పాటు లాక్‌డౌన్‌కు పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. ఇక ప్రధాని పిలుపుకు సామాన్య జనం నుంచి సెలబ్రిటీలు సైతం మద్దతు పలుకుతున్నారు. ఈ క్రమంలో సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉన్న సెలబ్రిటీలంతా తమ రోజువారి కార్యకలపాలను సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా హీరోయిన్‌ సమంత కూడా భర్త, హీరో నాగచైతన్య, తమ పెంపుడు కుక్కతో సరదాగా ఆడుకుంటున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో గురువారం షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతోంది. నేలపై పడుకుని ఉన్న చైతూపై  హాష్‌ విశ్రాంతి తీసుకుంటున్న ఈ ఫొటోకు సమంత ‘క్వారంటీమ్‌’  అనే క్యాప్షన్‌ను జత చేసి షేర్‌ చేశారు. (అప్పుడు చాలా బాధ కలిగింది : సమంత)

కాగా చై-సామ్‌లు తమపెంపుడు కుక్క హాష్‌కు సంబంధించిన ప్రతి విషయాన్ని తరచూ సోషల్‌ మీడియాలో పంచుకుంటుంటారు. ఇటీవల హాష్‌ మొదటి బర్త్‌డేను సెలబ్రెట్‌ చేసిన ఈ జంట.. హాష్‌తో తమకు ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ సమంత భావోద్యేగ పోస్టును షేర్‌ చేశారు. కాగా ఇటీవల విడుదలై సమంత ‘జాను’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. కాగా ప్రస్తుతం విజయ్‌ సేతుపతి, నయనతార నటిస్తున్న ‘కాతు వాకులా రేండు కాదల్‌’ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. ఇక నాగచైతన్య, సాయి పల్లవితో కలిసి శేఖర్‌ కమ్ముల దర్వకత్వంలో వస్తున్న లవ్‌ స్టోరి ‘ఏమ్‌ పిల్ల..’లో నటిస్తున్నారు. (ఊపిరి తిత్తులు ఇలాగే ఉక్కిరిబిక్కిరి అవుతాయి)

#quaranteam

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement