
‘మజిలీ’ సినిమాలో క్రికెటర్ పూర్ణగా బంతులను బౌండరీలు దాటించారు నాగచైతన్య. లేటెస్ట్‌గా చేస్తున్న ‘వెంకీ మామ’ సినిమాలో మిలటరీ ఆఫీసర్‌గా బార్డర్ దగ్గర శత్రువులను రఫ్ ఆడించనున్నారట. నెక్ట్స్ అజయ్ భూపతి దర్శకత్వంలో చేయబోయే సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారట. ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో నాగచైతన్య ఓ యాక్షన్ థ్రిల్లర్ చేయడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే.
ఇందులో స్టైలిష్ పోలీస్ ఆఫీసర్‌గా చైతన్య పాత్రను డిజైన్ చేశారట అజయ్ భూపతి. ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా క్లైమాక్స్‌లో కొద్దిసేపు పోలీస్‌గా కనిపించారు చైతన్య. ఇందులో పూర్తిస్థాయి పోలీస్‌గా తొలిసారి కనిపించనున్నారు. ఈ చిత్రానికి ‘మహా సముద్రం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. పి. కిరణ్ నిర్మించనున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా సమంతను నటింపచేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉందని తెలిసింది. ఈ ఏడాది సెకండ్ హాఫ్‌లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
Comments
Please login to add a commentAdd a comment