మరో అందమైన ప్రేమకథ | Naga Chaitanya to romance Sai Pallavi in Sekhar Kammula's next movie | Sakshi
Sakshi News home page

మరో అందమైన ప్రేమకథ

Published Fri, Jun 21 2019 5:56 AM | Last Updated on Fri, Jun 21 2019 5:56 AM

Naga Chaitanya to romance Sai Pallavi in Sekhar Kammula's next movie - Sakshi

నాగచైతన్య, శేఖర్‌ కమ్ముల

‘మజిలీ’వంటి బ్యూటీఫుల్‌ అండ్‌ ఎమోషనల్‌ లవ్‌స్టోరీతో సూపర్‌ సక్సెస్‌ కొట్టి మంచి జోరు మీద ఉన్నారు నాగచైతన్య. ‘ఫిదా’ సినిమాతో ప్రేక్షకులను ఫిదా చేసిన జోష్‌లో ఉన్నారు దర్శకులు శేఖర్‌ కమ్ముల. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా షురూ అయింది. డిస్ట్రిబ్యూటర్స్‌గా ఇప్పటివరకు వందలాది సినిమాలను విడుదల చేసిన ఏషియన్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఈ సినిమాతో తొలిసారి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. నారాయణదాస్‌ నారంగ్, తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ రామ్మోహనరావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో సాయిపల్లవి కథానాయికగా నటించనున్నారు. ‘‘ఇండస్ట్రీలో నేను కెరీర్‌ను స్టార్ట్‌ చేసినప్పటి నుంచి శేఖర్‌ కమ్ములగారితో వర్క్‌ చేయాలనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. నిజమైన, అందమైన ప్రేమకథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ అవుతున్నాం’’ అని నాగచైతన్య పేర్కొన్నారు. ‘‘సెప్టెంబర్‌ ఫస్ట్‌ వీక్‌లో ఈ సినిమా షూటింగ్‌ను స్టార్ట్‌ చేస్తున్నాం. 60–70 రోజుల్లోనే ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ప్రస్తుతం మల్టీస్టారర్‌ మూవీ ‘వెంకీమామ’తో బిజీగా ఉన్నారు నాగచైతన్య. ఈ సినిమాలో వెంకటేశ్‌ మరో హీరో.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement