
నిధి అగర్వాల్
అబ్బాయిలను ఇష్టపడాలంటే బోలేడు గుడ్ క్వాలిటీస్ వారిలో ఉండాలని అమ్మాయిలు కోరుకుంటారు. తమను ఎప్పుడూ సంతోషంగా ఉంచుతూ నవ్వించే అబ్బాయిలను మరింత ఇష్టపడతారు కొందరు అమ్మాయిలు. అయితే. . కేవలం నవ్విస్తే సరిపోదు. నిజాయితీగా కూడా ఉండాలి అంటున్నారు కథానాయిక నిధి అగర్వాల్. ‘‘నవ్వించే అబ్బాయిలకు ఈజీగా అమ్మాయిలు ఎట్రాక్ట్ అవుతారు. నవ్వు వారి రిలేషన్‌షిప్‌ను స్ట్రాంగ్‌గా ఉంచుతుంది’’ అన్న ఓ ట్విటర్ కామెంట్‌కు నిధి స్పందిస్తూ...‘‘అబ్బాయిలు ఓన్లీ నవ్విస్తే సరిపోదు. నిజాయితీగా కూడా ఉండాలి. అలాగే స్థిరంగా ఉంటూనే చాలా ప్రేమించాలి’’ అని సరదాగా పేర్కొన్నారు. అన్నట్లు ఈ బ్యూటీ ఈ ఏడాది తెలుగు తెరపై ఎంట్రీ ఇవ్వనున్నారు. నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘సవ్యసాచి’ సినిమాలో నిధినే కథానాయిక. ఈ సినిమాను జూలై లోపు రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment