
నాగచైతన్య, నాగార్జున
నాగార్జున, నాగచైతన్య నిజజీవితంలో తండ్రీ కొడుకులు. కానీ చూడ్డానికి మాత్రం అన్నదమ్ముల్లా ఉంటారని అక్కినేని అభిమానులు సరదాగా చెప్పుకుంటుంటారు. ఇప్పుడు నాగార్జున, నాగచైతన్య తాతామనవళ్లుగా నటించబోతున్నారు. రెండేళ్ల క్రితం కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున హీరోగా ‘సోగ్గాడే చిన్ని నాయనా’ అనే సినిమా రూపొందిన విషయం తెలిసిందే. ఇందులో నాగార్జున చేసిన బంగార్రాజు క్యారెక్టర్ ఆడియన్స్‌ను బాగా మెప్పించింది. ఇప్పుడు సేమ్ కాంబినేషన్‌లోనే ‘సోగ్గాడే చిన్ని నాయానా’ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కనుంది.
అయితే ఇందులో నాగచైతన్య కూడా నటిస్తారు. బంగార్రాజు మనవడి పాత్రలో నాగచైతన్య కనిపిస్తారు. ఈ సినిమా షూటింగ్ వేసవిలో ఆరంభం కానుందని సమాచారం. ఇంతకుముందు ‘మనం’ సినిమాలో నాగార్జునకు నాన్న పాత్రలో నాగచైతన్య కనిపించారు. ఇప్పుడు ఈ చిత్రం కోసం మనవడిగా మారారు. ఈ సంగతి ఇలా ఉంచితే... 2002లో నాగార్జున హీరోగా వచ్చిన ‘మన్మథుడు’ చిత్రానికి కూడా స్వీకెల్ చేస్తున్నారట నాగార్జున. ఈ సినిమాకు నటుడు, ‘చిలసౌ’ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తారు. మార్చిలో ఈ సినిమా షూటింగ్ పోర్చ్‌గల్‌లో స్టార్ట్ అవుతుందని ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment