Samantha Shocking Comments On Her Divorce With Naga Chaitanya: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలతో బిజీగా ఉంటూ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. సామ్ తన మనసులోని భావాలను, అనుభూతులను తన ఇన్‌స్టా గ్రామ్ ద్వారా పంచుకుంటుంది. అప్పుడప్పుడు మోటివేషనల్ కోట్స్, జీవితపు సత్యాలు పెడుతూ అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంటోంది. అలాగే సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తూ ఉంటుంది. అయితే ఇప్పటివరకు తాను ప్రస్తావించని అంశం నాగ చైతన్యతో విడాకులు.
అయితే తాజాగా ఈ అంశంపై సమంత స్పందించింది. అక్కినేని నాగచైతన్యతో విడిపోయిన తర్వాత వారి విడాకులపై సమంత స్పందించడం ఇదే తొలిసారి. 'నేను విడాకులు తీసుకున్నప్పుడు కుంగిపోయి చనిపోతానని అనుకున్నాను. నేను చాలా బలహీనమైన వ్యక్తినని నా ఫీలింగ్. కానీ నేను ఎంత బలంగా ఉన్నానో తెలిసి ఇప్పుడు ఆశ్చర్యం వేస్తోంది. నేను ఇంత దృఢంగా ఉండగలనని అనుకోలేదు.' అని ఓ ఇంగ్లీష్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సామ్ చెప్పుకొచ్చింది.
ఇదీ చదవండి: సమంత గొప్ప పాఠం ఇదేనట.. ఇన్‌స్టాలో సామ్ స్టోరీ
Comments
Please login to add a commentAdd a comment