నాగచైతన్య
భారతంలో అర్జునుడి రెండు చేతులకు సమానమైన బలం ఉండేది. అలాంటి శక్తి ఓ హీరోకి ఉంటే ఎలా ఉంటుంది? అనే అంశం ఆధారంగా రూపొందిన సినిమా ‘సవ్యసాచి’. నాగచైతన్య, నిధీ అగర్వాల్ జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నవీన్, రవిశంకర్, మోహన్ నిర్మించారు. ‘‘ఈ సినిమా ట్రైలర్‌ను అక్టోబర్ 1న ఉదయం 10 గంటలకు విడుదల చేయబోతున్నాం. షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందన్న నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. మాధవన్, భూమికా చావ్లా, ‘వెన్నెల’ కిశోర్, సత్య, రావు రమేశ్ కీలక పాత్రలు చేశారు. యం.యం. కీరవాణి సంగీతం అందించారు. యువరాజ్ సినిమాటోగ్రఫీ అందించిన ‘సవ్యసాచి’ చిత్రం నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment