
సమంత, నాగచైతన్య
వీకెండ్‌ని రొమాంటిక్‌గా గడిపారు కొత్త జంట నాగచైతన్య, సమంత. యాడ్ షూట్ కోసం ముంబై వెళ్లిన ఈ ఇద్దరూ షూట్ అయిపోయిన వెంటనే ముంబై రెస్టారెంట్‌లో సరదాగా సమయం గడిపారు. వర్క్‌ని, వీకెండ్‌ని బ్యాలెన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సమంత. పెళ్లి తర్వాత రెండు యాడ్స్ చేసిన ఈ జంట తర్వలోనే ఫుల్ లెంగ్త్ మూవీలో కూడా కనిపించనున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందబోయే లవ్ ఎంటర్‌టైనర్‌లో ఈ జంట పెళ్లి తర్వాత ఫస్ట్ టైమ్ స్క్రీన్‌పై సందడి చేయ నున్నారు. ఇందులో నాగచైతన్య క్రికెటర్ పాత్రను పోషించనున్నారని టాక్.