అల్లుడు లెట్స్‌ డు కుమ్ముడు | Naga Chaitanya Role In Sailaja Reddy Alludu Movie | Sakshi
Sakshi News home page

అల్లుడు లెట్స్‌ డు కుమ్ముడు

Published Thu, Apr 19 2018 12:43 AM | Last Updated on Thu, Sep 27 2018 8:49 PM

Naga Chaitanya Role In Sailaja Reddy Alludu Movie - Sakshi

నాగచైతన్య

మర్యాదల్లో ఏదైనా తేడా వచ్చిందో లేక ఫ్యామిలీని ఎవరైనా ఏమైనా కామెంట్‌ చేశారో.. కరెక్ట్‌ రీజన్‌ తెలీదు కానీ, విలన్స్‌ను కుమ్మేస్తున్నాడు అల్లుడు. ఈ అల్లుడు ఎవరి తాలుకానో తెలుసు కదా! పవర్‌ఫుల్‌ శైలజారెడ్డి తాలుకా అండీ బాబు. నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘శైలజారెడ్డిగారి అల్లుడు’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు.

అనూ ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక. శైలజారెడ్డి పాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నారని సమాచారం. ప్రస్తుతం హీరో నాగచైతన్యపై ఫైట్‌ సీన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. అంటే అల్లుడు లెట్స్‌ డు కుమ్ముడు అన్నమాట. ఆఫ్టర్‌ ఫైట్‌ అనూతో సరసాలడతారట నాగచైతన్య. అదేనండి.. ఈ సినిమాలో హీరో హీరోయిన్లపై రొమాంటిక్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తారని చెబుతున్నాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement