ఇటు కాజల్‌... అటు నిత్యా... మధ్యలో శర్వా | Sharwanand Kajal Aggarwal and Nithya Menen New Movie Launch | Sakshi
Sakshi News home page

ఇటు కాజల్‌... అటు నిత్యా... మధ్యలో శర్వా

Published Tue, Nov 28 2017 12:47 AM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

Sharwanand Kajal Aggarwal and Nithya Menen New Movie Launch - Sakshi - Sakshi

ఇప్పటివరకూ ఇద్దరమ్మాయిలతో సినిమాలు చేయని హీరోల్లో శర్వానంద్‌ ఒకరు. ఆల్మోస్ట్‌ శర్వా హీరోగా చేసిన సినిమాలు అన్నిటిలోనూ సింగిల్‌ హీరోయినే. కానీ, కెరీర్‌లో తొలిసారి ఇద్దరమ్మాయిలతో సినిమా చేయబోతున్నారు. శర్వానంద్‌ హీరోగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఓ సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే.

అందులో శర్వా సరసన కాజల్‌ అగర్వాల్, నిత్యా మీనన్‌ హీరోయిన్లుగా నటించనున్నారు.సోమవారం ఉదయం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. హారిక అండ్‌ హాసిని సంస్థ అధినేత ఎస్‌. రాధాకృష్ణ (చినబాబు) చిత్రదర్శక–నిర్మాతలకు స్క్రిప్ట్‌ అందజేశారు. ఈ సందర్భంగా హీరోయిన్ల పేర్లు ప్రకటించారు.

పూజాకార్యక్రమాల అనంతరం శర్వానంద్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి హీరో నాగచైతన్య క్లాప్‌ ఇవ్వగా, దర్శకుడు మారుతి కెమెరా స్విచ్చాన్‌ చేశారు. డిసెంబర్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తామని నిర్మాత నాగవంశీ తెలిపారు. ఈ ప్రారంభోత్సవంలో నిర్మాతలు బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, పి. కిరణ్, దర్శకుడు అనిల్‌ రావిపూడి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రశాంత్‌ పిళ్లై, కెమెరా: దివాకర్‌ మణి, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రవీందర్, సమర్పణ: పి.డి.వి. ప్రసాద్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement