
రకుల్ మరో ఛాన్స్ కొట్టేసింది
హీరోయిన్గా ఎదగాలంటే అందం, అభినయం మాత్రమే ఉంటే సరిపోదు. లక్ కూడా కలిసి రావాలి.. అలా లక్కీ స్టార్గా గుర్తింపు తెచ్చుకుంటున్న టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. తన తోపాటు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లందరూ అవకాశాల కోసం ఎదురుచూస్తుంటే రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం స్టార్లు, సూపర్ స్టార్లతో కూడా సినిమాలకు కమిట్ అవుతోంది. ఇప్పటికే మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్లో రూపొందుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్కు సెలెక్ట్ అయిన ఈ బ్యూటి మరో ఇంట్రస్టింగ్ సినిమాకు ఓకె చెప్పింది.
ప్రస్తుతం ప్రేమమ్, సాహసం స్వాసగా సాగిపో సినిమాలను రిలీజ్కు రెడీ చేసిన యంగ్ హీరో నాగచైతన్య, తన నెక్ట్స్ సినిమాను కూడా కన్ఫామ్ చేశాడు. నాగార్జున హీరోగా సొగ్గాడే చిన్ని నాయనా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ను అందించిన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాకు రకుల్ ప్రీత్ను హీరోయిన్గా తీసుకోవాలని భావిస్తున్నారట. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలతో టాప్ స్టార్గా ఎదుగుతున్న రకుల్కు ఇది మరో మంచి అవకాశం అన్న టాక్ వినిపిస్తోంది.