షూటింగ్‌ షురూ! | savya sachi Start shooting on 8th of this month | Sakshi
Sakshi News home page

షూటింగ్‌ షురూ!

Published Thu, Nov 2 2017 12:56 AM | Last Updated on Sun, Jul 14 2019 10:21 AM

savya sachi Start shooting on 8th of this month - Sakshi

మీ లెఫ్ట్‌ హ్యాండ్‌ మీ హ్యాండోవర్‌లోనే ఉందా..? ఇదేం తిక్క ప్రశ్న. రైట్‌ అయినా లెఫ్ట్‌ అయినా ఎవరి హ్యాండ్‌ వారి హ్యాండోవర్‌లోనే ఉంటుంది కదా అనుకోవచ్చు. కానీ హీరో నాగచైతన్య లెఫ్ట్‌ హ్యాండ్‌కు మాత్రం నో కంట్రోల్‌. అంతేకాదు.. కుడి చేతికి ఎంత పవర్‌ ఉందో సేమ్‌ టు సేమ్‌ అంతే పవర్‌ ఎడమ చేతికి ఉంది. కానీ ఇక్కడో ప్రాబ్లమ్‌ ఉంది. ఏంటంటే... నాగచైతన్య లెఫ్ట్‌ హ్యాండ్‌ అతని బ్రెయిన్‌ చెప్పిన పని చేయదు. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదూ. అన్నట్లు.. చైకి లెఫ్ట్‌హ్యాండ్‌ మీద కంట్రోల్‌ లేనిది రీల్‌ లైఫ్‌లోనే.

రియల్‌ లైఫ్‌లో కాదండోయ్‌. చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ‘సవ్యసాచి’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో నాగచైతన్య క్యారెక్టర్‌ పైన చెప్పిన విధంగా ఉంటుంది. ఈ సినిమా షూటింగ్‌ను ఈ నెల 8న స్టార్ట్‌ చేయాలనుకుంటున్నారు. కన్నడ బ్యూటీ నిధీ అగర్వాల్‌ను హీరోయిన్‌గా సెలక్ట్‌ చేశారని ఇన్‌సైడ్‌ టాక్‌. పెళ్లి తర్వాత చై–సామ్‌ హనీమూన్‌ వెళ్లారు. ట్రిప్‌ని ఎంజాయ్‌ చేసి, హైదరాబాద్‌ కూడా వచ్చేశారు. ఇక, ఇద్దరూ తమ తమ షూటింగ్స్‌తో బిజీగా ఉంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement