చైతూ.. ఈసారైనా హిట్‌ కొట్టేనా..? | Naga Chaitanya May Get Success With Savyasachi | Sakshi
Sakshi News home page

Oct 25 2018 9:22 AM | Updated on Jul 14 2019 10:21 AM

Naga Chaitanya May Get Success With Savyasachi - Sakshi

అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్యలో ఆదినుంచీ లవర్‌ బాయ్‌లానే చూస్తున్నారు ప్రేక్షకులు. మాస్‌ మంత్రం జపించి హిట్‌కొట్టాలనుకున్న ప్రతిసారీ చైతూకు ఎదురుదెబ్బే తగిలింది. జోష్‌తో ఎంట్రీ ఇస్తే అంతగా వర్కౌట్‌ కాలేదు. తరువాత లవర్‌ బాయ్‌గా నటించిన ఏమాయ చేసావే, 100% లవ్‌ సినిమాలతో  నాగచైతన్య సక్సెస్‌ సాధించాడు. అయితే మళ్లీ దడ, ఆటోనగర్‌ సూర్య లాంటి సినిమాలతో మాస్‌ ప్రేక్షకులను మెప్పించేందుకు ట్రై చేశాడు. 

కానీ అవి కూడా మిశ్రమ ఫలితాన్నే ఇచ్చాయి. కానీ మాస్‌ ఆడియన్స్‌కు దగ్గరచేయలేకపోయాయి. బెజవాడ, దోచేయ్‌, యుద్దం శరణంలాంటి సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నాడు. ఒక లైలాకోసం, రారండోయ్‌ వేడుక చూద్దాం, శైలజా రెడ్డి అల్లుడు లాంటి ఫ్యామిలి, లవ్‌ ఎంటర్‌టైనర్‌తో ఫర్వాలేదనిపించాడు. ప్రేక్షకులు చైతూలో ఓ లవర్‌బాయ్‌ను చూస్తుంటే.. చైతూ మాత్రం మాస్‌ ప్రేక్షకులను మెప్పించేందుకు ట్రై చేస్తూ.. యాక్షన్‌ సినిమాలను ఎంచుకుంటున్నాడు. మళ్లీ ‘సవ్యసాచి’తో యాక్షన్‌ ఓరియెంటెడ్‌ను చేస్తూ.. మాస్‌ను ఆకట్టుకునేందుకు డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో మనముందుకు వస్తున్నాడు. మరి ఈసారైనా చైతూ మాంచి హిట్‌ కొడతాడో లేదో చూడాలి. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం నవంబర్‌ 2న విడుదల కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement