సూపర్‌ ఎగ్జైటింగ్‌ | payal rajput joins in venky mama shooting | Sakshi
Sakshi News home page

సూపర్‌ ఎగ్జైటింగ్‌

Published Mon, Mar 11 2019 12:59 AM | Last Updated on Mon, Mar 11 2019 7:56 AM

payal rajput joins in venky mama shooting - Sakshi

పాయల్‌ రాజ్‌పుత్

‘వెంకీమామ’ హంగామాకు పాయల్‌ రాజ్‌పుత్‌ సరదాలు తోడయ్యాయి. ఈ సందడిలో పుట్టించిన హాస్యాన్ని వెండితెరపై చూసి నవ్వుకోవాల్సిందే. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కేఎస్‌. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ‘వెంకీమామ’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో వెంకీ సరసన పాయల్‌ రాజ్‌పుత్, నాగచైతన్యకు జోడీగా రాశీఖన్నా నటిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్‌ ఇటీవల  గోదావరి జిల్లాల పరిసర ప్రాంతాల్లో మొదలైన విషయం తెలిసిందే. వెంకీ, నాగచైతన్యలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇటీవల రాశీఖన్నా ఈ సినిమా సెట్‌లో జాయిన్‌ అయ్యారు. తాజాగా పాయల్‌ రాజ్‌పుత్‌ జాయిన్‌ అయ్యారు. ‘కొత్త తెలుగు సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాను సూపర్‌ ఎగ్జైటింగ్‌గా ఉంది’’ అని పేర్కొన్నారు పాయల్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement