అనూ ఇమ్మాన్యుయేల్
‘‘కెరీర్ స్టార్టింగ్‌లో ఉన్నాను. తప్పులు చేస్తే దిద్దుకునే అవకాశం ఉంటుంది. పోటీ ఫీలవ్వను. హిట్, ఫ్లాప్స్ నా కంట్రోల్‌లో ఉండవు. సినిమాలు ఆడకపోతే చాన్సులు తగ్గుతాయనే నెర్వస్‌నెస్ ఉంటుంది. సినిమా సినిమాకు నన్ను నేను బెటర్ చేసుకోవాలనుకుంటాను. సొంత నిర్ణయాలు తీసుకోవడానికే ఇష్టపడతాను’’ అన్నారు అనూ ఇమ్మాన్యుయేల్. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యు యేల్ జంటగా మారుతి దర్శకత్వంలో నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా అనూ ఇమ్మాన్యుయేల్ చెప్పిన సంగతులు...
► ఈ మూవీలో ఈగోయిస్ట్ అండ్ యాంగ్రీ గాళ్ అను పాత్ర చేశాను. ఎప్పుడూ తనే నంబర్ 1 అవ్వాలనుకుంటుంది. గర్వంగా ఫీల్ అవుతుంది. కానీ ఒకసారి ప్రేమిస్తే ఎక్కువగా ప్రేమిస్తుంది. ఇంతకు ముందు నేను చేసిన పాత్రలకు భిన్నంగా ఉంటుంది. రియల్ లైఫ్‌లో నేను కొంచెం ఈగోయిస్ట్. అయితే ఎంతవరకూ ఉండాలో అంతవరకే.
► నాగచైతన్య కంఫర్టబుల్ అండ్ చాలెంజింగ్ కో స్టార్. రమ్యకృష్ణగారి ఎనర్జీ సూపర్. పెద్ద పెద్ద డైలాగ్స్‌ను కూడా ఆమె జ్ఞాపకం పెట్టుకుని సులభంగా చెప్పేవారు. సినిమాలో రమ్యకృష్ణగారి కూతురు పాత్రలో కనిపిస్తాను. మారుతిగారు అమేజింగ్ డైరెక్టర్. సెట్‌లో నేను ఎక్కువగా సైలెంట్‌గానే ఉంటాను. కానీ ఒకసారి నాకు కనెక్ట్ అయితే నాన్‌స్టాప్‌గా మాట్లాడతాను.
► ‘అజ్ఞాతవాసి’ స్క్రిప్ట్‌ని వినే సైన్ చేశాను. ఆ సినిమా మంచి వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’లో నటించడం హ్యాపీ. ‘గీత గోవిందం’ సినిమాలో నాకు ఆఫర్ వచ్చింది. కానీ డేట్స్ లేకపోవడంతో కుదరలేదు. అందుకే గెస్ట్ రోల్ చేశాను. ‘అజ్ఞాతవాసి, గీతగోవిందం’ సినిమాలకు నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్పాను. హైదరాబాద్‌లో ఇల్లు ఇంకా కొనలేదు. కానీ హోమ్లీ ఫీలింగ్ ఉంది.
► నేను నటించిన కొన్ని సినిమాలు ఆశించినంతగా ఆడలేదు. అయితే ఏం? కెరీర్ స్టారింగ్‌లో శ్రుతీహాసన్‌కి కూడా ఇలానే జరిగింది. ఫ్లాప్స్ అనేవి జర్నీలో ఓ భాగం. ప్రస్తుతం నా మాతృభాష మలయాళంతో పాటు ఇతర భాషల నుంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ముందు తెలుగులో ప్రూవ్ చేసుకోవాలను కుంటున్నాను. మంచి స్క్రిప్ట్, స్ట్రాంగ్ రోల్స్ కోసం చూస్తున్నాను. ప్రయోగాత్మక చిత్రాలు చేయాలని ఉన్నా యంగ్ యాక్ట్రస్‌ని కాబట్టి ఇప్పుడే కరెక్ట్ కాదేమో అనిపిస్తోంది. కరెక్ట్ టైమ్ వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను.
Comments
Please login to add a commentAdd a comment