
సంక్రాంతి పండక్కి కొత్త అల్లుడు అత్తింటికి వెళ్తాడు. కానీ మా సినిమాలోని అల్లుడు మాత్రం వేసవిలో వస్తాడు అంటున్నారు డైరెక్టర్ మారుతి. నాగచైతన్య హీరోగా మారుతి దర్వకత్వంలో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ ఓ సినిమా నిర్మిస్తున్నారు. ఇందులో అనూ ఇమ్యాన్యుయేల్ కథానాయిక. ఈ చిత్రానికి ‘శైలజారెడ్డిగారి అల్లుడు’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆల్రెడీ ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.
‘‘అందరూ నాగచైతన్య మూవీ గురించి అడుగుతున్నారు. అతను ‘సవ్యసాచి’ సినిమాతో బిజీగా ఉన్నాడు. నేనూ మీలాగే (ఫ్యాన్స్) తనకోసం వెయిట్ చేస్తున్నాను. మేలో ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాం. డోంట్ వర్రీ.. ఫ్యాన్స్‌కు ఎలా కావాలో అలానే ఉంటుంది సినిమా’’ అని మారుతి పేర్కొన్నారు. సో.. వేసవికి అల్లుడొస్తాడన్నమాట. ఈ సంగతి ఇలా ఉంచితే... చందు మొండేటి దర్వకత్వంలో నాగచైతన్య హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘సవ్యసాచి’ మేలో విడుదల చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment