
నాగచైతన్య, సమంత
ప్రేమికులకు ఫస్ట్ కలిసిన ప్లేస్, ఫస్ట్ ప్రపోజ్ చేసిన డేట్, ఫస్ట్ డిన్నర్, ఫస్ట్, ఫస్ట్.... ఇలా ఫస్ట్‌లన్నీ ప్రత్యేకమే. ఎప్పుడైనా తాము ఫస్ట్ కలుసుకున్న ప్లేస్‌కి వెళ్లినా, ఫస్ట్ ప్రపోజ్ చేసుకున్న చోటుకి వెళ్లినా కచ్చితంగా ‘నోస్టాల్జియా’ ఫీల్ అవుతారు. ఇప్పుడు అదే ఫీలింగ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు క్రేజీ కపుల్ నాగచైతన్య, సమంత. రియల్ లైఫ్‌లో సమంతకు చైతన్య ఎప్పుడు ప్రపోజ్ చేశారో తెలీదు కానీ రీల్ లైఫ్‌లో మాత్రం ఎనిమిదేళ్ల క్రితం గౌతమ్ వాసుదేవ్‌మీనన్ రూపొందించిన‘ఏ మాయ చేశావె’ సినిమాలో చేశారు. ఆ సన్నివేశంలో‘ఐ లవ్ యూ జెస్సీ.
మనం పెళ్లి చేసుకుందాం. ఇప్పుడే.. ఇక్కడే..’ అని సమంతతో చెబుతారు నాగచైతన్య. అలా రీల్ లైఫ్‌లో చేసిన ప్రపోజల్ రియలై చైతు–సామ్ జోడీ అయ్యారు. ప్రస్తుతం నాగచైతన్య, సమంత హాలిడేలో భాగంగా న్యూయార్క్ సందర్శించారు. అక్కడ సెంట్రల్ పార్క్ దగ్గర తాము ఫస్ట్ టైమ్ (రీల్‌లో) ప్రపోజ్ చేసుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. దాన్ని ఓ మెమరీగా బంధించుకోవటానికి ఓ సెల్ఫీ కూడా క్లిక్ చేసుకున్నారు. ఆ ఫొటోను సమంత షేర్ చేస్తూ ‘‘సాధారణంగా సెల్ఫీలంటే అంతగా నచ్చదు.
కానీ ఈసారి మాత్రం దిగాల్సిందే. సెంట్రల్ పార్క్.. ఇదంతా మొదలైంది ఇక్కడే. ఎనిమిదేళ్లు అయిపోయింది. థ్యాంక్స్ చెప్పుకోవటానికి వచ్చినట్టుంది. ప్రేమ ఏదో ఓ మార్గాన్ని వెతుకుతుంది. జరగాలని రాసి పెట్టుంటే కచ్చితంగా జరుగుతుంది’’ అని పేర్కొన్నారు సమంత.
Comments
Please login to add a commentAdd a comment