
టైమ్ బాగుంటే గెలిచే చాన్స్ అందరికీ ఉంటుంది. కానీ గెలుపు తలుపు తీయడం అంత ఈజీ కాదు. ఎన్నో ఇబ్బందులు, మరెన్నో ఎదురు దెబ్బలు ఎదుర్కోవాలి. కానీ గెలవాలంటే పరుగు అపకూడదు.. పోరాడాలి. ఎంత ఎక్కువ పోరాడి గెలిస్తే అంత ఎక్కువ మజా ఉంటుంది. ప్రస్తుతం ఆ మజా కోసమే పోరాడుతున్నారు హీరో నాగచైతన్య. చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న సినిమా ‘సవ్యసాచి’. నిధి అగర్వాల్ కథానాయిక. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.
నాగచైతన్యపై ఛేజింగ్ సీన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. ‘‘ప్రజెంట్ ప్రీ–క్లైమాక్స్ ఫైట్ సీన్ జరుగుతోంది. సినిమాలో మూడు రిస్కీ ఫైట్లు ఉంటాయి. వీటిలో మేజర్ రిస్కీ ఫైట్‌ను ప్రస్తుతం షూట్ చేస్తున్నాం. ఈ ౖఫైట్‌ను సిక్స్ డేస్ షూట్ చేస్తాం. రామ్–లక్ష్మణ్ మాస్టర్స్ డిజైన్ చేసిన ఈ ఫైట్ థ్రిల్‌కి గురి చేసే విధంగా ఉంటుంది. ఈ నెల 7న మొదలుపెట్టిన ఈ ఫైట్‌ను 12న పూర్తి చేస్తాం. ఆ తర్వాత సంక్రాంతికి బ్రేక్ తీసుకుంటాం. ఈ నెలాఖరున మరో షెడ్యూల్‌ను మొదలుపెడతాం’’ అని యూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment