'సవ్యసాచి'గా నాగచైతన్య | Naga Chaitanya New movie savya sachi | Sakshi
Sakshi News home page

'సవ్యసాచి'గా నాగచైతన్య

Published Wed, Aug 16 2017 10:38 AM | Last Updated on Tue, Sep 12 2017 12:14 AM

Naga Chaitanya New movie savya sachi

ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాల సక్సెస్ తో మంచి ఫాంలో ఉన్న నాగచైతన్య వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఇప్పటికే కృష్ణ ఆర్వీ మరిముత్తు దర్శకత్వంలో యుద్ధం శరణం సినిమాను పూర్తి చేసిన చైతూ.. మరో సినిమాను స్టార్ట్ చేస్తున్నాడు. తనకు ప్రేమమ్ లాంటి ఘన విజయాన్ని అందించిన చందూ మొండేటి దర్శకత్వంలో కొత్త సినిమాను ప్రారంభిస్తున్నాడు.

మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు సవ్యసాచి అనే టైటిల్ ను ఫైనల్ చేశారు. ఈ రోజు (బుధవారం) సినిమా టైటిల్ లోగోనూ రిలీజ్ చేశారు. ఈ టైటిల్ పోస్టర్ చూస్తే సినిమా యాక్షన్ జానర్ లో సాగుతుందని తెలుస్తోంది. సెప్టెంబర్ లో సవ్యసాచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. చాలా కాలంగా మాస్ హీరోగా ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న చైతన్య, వరుసగా రెండు మాస్ యాక్షన్ సినిమాలతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement