Actor Nikhil Karthikeya 2 Movie Record Box Office Collections In Bollywood - Sakshi
Sakshi News home page

Karthikeya 2: బాలీవుడ్ కలెక్షన్లలో కార్తీకేయ 2 అదుర్స్.. ఎన్ని కోట్లో తెలుసా..!

Published Fri, Sep 16 2022 10:33 AM | Last Updated on Fri, Sep 16 2022 11:41 AM

Tollywood Hero Nikhil Movie Karthikeya 2 Record Collections In Bollywood - Sakshi

యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ హీరోగా న‌టించిన కార్తికేయ 2 మూవీ బాలీవుడ్‌లోనూ కలెక్షన‍్లతో అదరగొడుతోంది. ఈ ఏడాది టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. కేవలం నెల రోజుల్లోనే 31 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు సినిమా వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా సక్సెస్‌  ఊహించ‌ని రీతిలో డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు లాభాలను తెచ్చిపెట్టింది. బాలీవుడ్‌లో ఈ సినిమా థియేట్రిక‌ల్ బిజినెస్ నాలుగున్న‌ర కోట్ల వ‌ర‌కు జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. గతంలో నిఖిల్ బాలీవుడ్ సినిమాలు చేయకపోయినా పెద్దమొత్తంలో కలెక్షన్లు రావడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. నిఖిల్‌ జంటగా అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాతో నటించింది. 

(చదవండి: Karthikeya 2 Movie-Nikhil: శ్రీవారిని దర్శించుకున్న కార్తీకేయ 2 మూవీ టీం)

ఎలాంటి అంచనాలు లేకుండా ఆగస్ట్‌ 13న విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్‌లో ఊహించని విజయాన్ని అందుకుంది. తెలుగులో దాదాపు అర‌వై కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్లతో విజయాన్ని అందుకుంది. చిన్న సినిమా అయినప్పటికీ అందరి అంచనాలు తలకిందులుగా చేస్తూ ప్రపంచవ్యాప్తంగా 130 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. కలియుగ సృష్టి ర‌హ‌స్యాల‌ను పొందుప‌రిచిన కృష్ణుడి కంక‌ణాన్ని దుష్ట శ‌క్తుల నుంచి కాపాడే ఓ యువ‌కుడి క‌థ‌తో  ద‌ర్శ‌కుడు చందూ మొండేటి ఈ సినిమాను తెర‌కెక్కించారు. కీల‌క‌మైన అతిథి పాత్ర‌లో బాలీవుడ్ న‌టుడు అనుప‌మ్ ఖేర్ ఈ చిత్రంలో కనువిందు చేశారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement