Nikhil hero
-
కలెక్షన్లలో కార్తీకేయ 2 అదుర్స్.. బాలీవుడ్‌లోనూ తగ్గేదేలే
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన కార్తికేయ 2 మూవీ బాలీవుడ్‌లోనూ కలెక్షన్లతో అదరగొడుతోంది. ఈ ఏడాది టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. కేవలం నెల రోజుల్లోనే 31 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు సినిమా వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా సక్సెస్ ఊహించని రీతిలో డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను తెచ్చిపెట్టింది. బాలీవుడ్లో ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ నాలుగున్నర కోట్ల వరకు జరిగినట్లు తెలుస్తోంది. గతంలో నిఖిల్ బాలీవుడ్ సినిమాలు చేయకపోయినా పెద్దమొత్తంలో కలెక్షన్లు రావడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. నిఖిల్ జంటగా అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాతో నటించింది. (చదవండి: Karthikeya 2 Movie-Nikhil: శ్రీవారిని దర్శించుకున్న కార్తీకేయ 2 మూవీ టీం) ఎలాంటి అంచనాలు లేకుండా ఆగస్ట్ 13న విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్లో ఊహించని విజయాన్ని అందుకుంది. తెలుగులో దాదాపు అరవై కోట్లకుపైగా కలెక్షన్లతో విజయాన్ని అందుకుంది. చిన్న సినిమా అయినప్పటికీ అందరి అంచనాలు తలకిందులుగా చేస్తూ ప్రపంచవ్యాప్తంగా 130 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. కలియుగ సృష్టి రహస్యాలను పొందుపరిచిన కృష్ణుడి కంకణాన్ని దుష్ట శక్తుల నుంచి కాపాడే ఓ యువకుడి కథతో దర్శకుడు చందూ మొండేటి ఈ సినిమాను తెరకెక్కించారు. కీలకమైన అతిథి పాత్రలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఈ చిత్రంలో కనువిందు చేశారు. -
శంకరాభరణంలో క్రైమ్!
ఆ యువకుడు అత్యంత సంపన్నుడి కొడుకు. యూఎస్‌లో ఉంటాడు. ప్రపంచంలో సుఖపడే జాతి, కష్టపడే జాతి.. ఈ రెండు జాతులే ఉంటాయన్నది ఆ యువకుడి అభిప్రాయం. తనేమో సుఖపడే టైప్ అనుకుంటాడు. కానీ, ఓ పని మీద ఇండియా వచ్చిన అతను కష్టాలపాలవుతాడు. ఈ సుఖపురుషుడు ఆ కష్టాలను ఎలా అధిగమించాడు... అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘శంకరాభరణం’. ఉదయ్ నందనవనమ్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా రచయిత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఈ వారంతో పూర్తవుతుంది. ‘‘హారర్‌కి కామెడీ మిక్స్ చేసి మేం తీసిన ‘గీతాంజలి’ మంచి విజయం సాధించింది. క్రైమ్, కామెడీని మిక్స్ చేసి ఈ ‘శంకరాభరణం’ తీస్తున్నాం’’ అని కోన వెంకట్ చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘భారీ నిర్మాణ వ్యయంతో నలభై మంది తారాగణంతో నిర్మిస్తున్నాం. బీహార్‌లోని ప్రమాదకరమైన లొకేషన్స్‌లో, పుణేకి సమీపంలో ఎవరూ చేయని లొకేషన్స్‌లో, యూఎస్‌లో కొంత శాతం చిత్రీకరించాం. వచ్చే నెల పాటలను, దీపావళికి చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. నందిత కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అంజలి స్పెషల్ రోల్ చేశారు. ఈ చిత్రానికి కథ-స్క్రీన్‌ప్లే-మాటలు: కోన వెంకట్, రచనా సహకారం: వెంకటేశ్ కిలారు, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, కెమెరా: సాయి శ్రీరామ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రామన్ చౌదరి, సహనిర్మాతలు: వి.ఎస్.ఎన్. కుమార్ చీమల, జి. వెంకటేశ్వరరావు. -
సర్ప్రైజింగ్ స్టోరీ
మరో ఛాయాగ్రాహకుడు మెగాఫోన్ పట్టారు. ‘కార్తికేయ’ చిత్రానికి ఛాయాగ్రహణం సమకూర్చిన కార్తీక్ ఘట్టమనేనిని దర్శకునిగా పరిచయం చేస్తూ నిఖిల్ హీరోగా ‘సూర్య వర్సెస్ సూర్య’ రూపొందుతోంది. బేబీ త్రిష సమర్పణలో మల్కాపురం శివకుమార్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకుంది. స్వామి రారా, కార్తికేయ చిత్రాల తరహాలో విభిన్నమైన ఇతివృత్తంతో వినోదాత్మకంగా ఈ సినిమా రూపొందుతోందని నిర్మాత తెలిపారు. ఇందులో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయని దర్శకుడు చెప్పారు. త్రిదా చౌదరి నాయికగా నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: సత్యమహవీర్, మాటలు: చందు మొండేటి