సర్‌ప్రైజింగ్ స్టోరీ
మరో ఛాయాగ్రాహకుడు మెగాఫోన్ పట్టారు. ‘కార్తికేయ’ చిత్రానికి ఛాయాగ్రహణం సమకూర్చిన కార్తీక్ ఘట్టమనేనిని దర్శకునిగా పరిచయం చేస్తూ నిఖిల్ హీరోగా ‘సూర్య వర్సెస్ సూర్య’ రూపొందుతోంది. బేబీ త్రిష సమర్పణలో మల్కాపురం శివకుమార్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకుంది.
స్వామి రారా, కార్తికేయ చిత్రాల తరహాలో విభిన్నమైన ఇతివృత్తంతో వినోదాత్మకంగా ఈ సినిమా రూపొందుతోందని నిర్మాత తెలిపారు. ఇందులో సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయని దర్శకుడు చెప్పారు. త్రిదా చౌదరి నాయికగా నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: సత్యమహవీర్, మాటలు: చందు మొండేటి