
నాగచైతన్య- సాయి పల్లవి కాంబినేషన్‌తో మరో సినిమా ప్రారంభమైంది. లవ్ స్టోరీ చిత్రం తర్వాత వారిద్దరూ ‘తండేల్’లో నటిస్తున్నారు.

చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. మత్స్యకారుల జీవితం నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా తండేల్ చిత్రం రూపొందుతోంది.

తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి నాగార్జున, వెంకటేశ్, సాయి పల్లవి, అల్లు అరవింద్‌తో పాటు మూవీ టీమ్ హాజరైంది.
























