bunny vas
-
‘ఆయ్’ చూశాక పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి: ‘బన్నీ’ వాసు
‘‘ఆయ్’ కో ప్రొడ్యూసర్స్ రియాజ్, భాను నాకు మంచి మిత్రులు. వాళ్లు చెప్పడంతో అంజి చెప్పిన ‘ఆయ్’ కథ వింటూ రెండున్నర గంటలు నాన్‌స్టాప్‌గా నవ్వాను. ప్రేక్షకులతో కలిసి సినిమా చూస్తున్నప్పుడు నా ముందు సీట్లో ఉన్న ఓ వ్యక్తి నవ్వలేక లేచి నిలబడ్డాడు. నేను కథ విన్నప్పుడు ఎలాగైతే ఎంజాయ్ చేశానో దాన్ని స్క్రీన్‌పై చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారని అప్పుడు అర్థమైంది’’ అని నిర్మాత ‘బన్నీ’ వాసు అన్నారు. నార్నే నితిన్, నయన్ సారిక జంటగా అంజి కె. మణిపుత్ర దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆయ్’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలైంది. ఈ సందర్భంగా శుక్రవారం ‘బన్నీ’ వాసు మీడియాతో మాట్లాడుతూ– ‘‘ఆయ్’లోని వినోదానికి దర్శకుడు భావోద్వేగాలను కలపడంతో మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది. ఈ చిత్రానికి వస్తోన్న స్పందన చూసి పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ‘ఆయ్’ షోలు పెంచేందుకు చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు. -
మీడియాతో AAY టీమ్ ఇంటరాక్షన్
-
మెగా- అల్లు ఫ్యామిలీకి గొడవలు.. నిర్మాత ఏమన్నారంటే?
టాలీవుడ్లో మెగా- అల్లు కుటుంబాల మధ్య దూరం పెరిగిందని గతంలో చాలాసార్లు వార్తలొచ్చాయి. వీరి మధ్య రిలేషన్ దెబ్బతిన్నట్లు సోషల్ మీడియాలోనూ పెద్దఎత్తున వైరలైంది. అంతే కాకుండా ఎన్నికలముందు వైకాపా నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్‌కు మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం చేశారు. అప్పటి నుంచే వీరి మధ్య మరింత దూరం పెరిగినట్లు రూమర్స్ వినిపించాయి. తాజాగా ఈ విషయంపై టాలీవుడ్ నిర్మాత బన్నీవాసు స్పందించారు. ఆయ్ మూవీ ప్రెస్మీట్లో ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన క్లారిటీ ఇచ్చారు.బన్నీ వాసు మాట్లాడుతూ.. 'కొన్ని కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీలో చిన్నచిన్న గొడవలు వస్తుంటాయి. కానీ నేను 20 ఏళ్ల నుంచి మెగా- అల్లు ఫ్యామిలీని చూస్తున్నా. వారి కుటుంబాలు కలిసి ఉండాలని చిరంజీవి ఎల్లప్పుడు కోరుకుంటారు. అందుకే ప్రతి సంక్రాంతికి ఫ్యామిలీని తీసుకొని బెంగళూరు వెళ్తారు. అంతమందిని తీసుకెళ్లడం మామూలు విషయం కాదు. చాలా ఖర్చు కూడా అవుతుంది. దానికి ప్రధాన కారణం అందరూ కలిసి ఉండాలనేదే ఆయన కోరిక. ఇలా చేయడం వల్ల మేమంతా ఒకటే అని చెప్పడం. ఏ కుటుంబంలోనైనా ఒకరు తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని విషయాల్లో ఇష్యూస్ వస్తాయి. కానీ ఇవీ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్ అంతే. అంత మాత్రాన దీన్ని ఇలా చూడడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. వారి బంధం గురించి నాకు బాగా తెలుసు. వాళ్లందరూ కలిసి ఉండాలనే మేం అందరం కోరుకుంటాం.' అని అన్నారు. అల్లు అర్జున్ కి మెగా ఫ్యామిలీ గొడవ ఉందా??#AlluArjun #BunnyVas #TeluguFilmNagar pic.twitter.com/YFXCOxglXA— Telugu FilmNagar (@telugufilmnagar) July 19, 2024 -
'అందుకే బన్నీ గడ్డం ట్రిమ్ చేశాడు'.. సుకుమార్‌తో గొడవపై టాలీవుడ్ నిర్మాత!
ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పుష్ప-2: ది రూల్. సుకుమార్- బన్నీ కాంబోలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 2021లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన పుష్పకు సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ వాయిదా పడిన నేపథ్యంలో ఈ సినిమాపై రూమర్స్ పెద్దఎత్తున వైరలవుతున్నాయి. హీరో, డైరెక్టర్ మధ్య గ్యాప్ వచ్చిందని.. అందుకే షూటింగ్ సైతం ఆలస్యమవుతోందని పలురకాల వార్తలు వినిపిస్తున్నాయి.తాజాగా పుష్ప-2పై వస్తున్న రూమర్స్‌పై నిర్మాత బన్నీవాస్ స్పందించారు. ఆయ్ మూవీ ప్రెస్‌మీట్‌కు హాజరైన ఆయనకు ఈ ప్రశ్న ఎదురుకావడంతో క్లారిటీ ఇచ్చారు. పుష్ప-2పై మీడియాలో వార్తలు చూస్తే నవ్వు వస్తోందని అన్నారు. అల్లు అర్జున్ పార్ట్ కేవలం 15 నుంచి 20రోజుల లోపే ఉందని తెలిపారు. ఎడిటింగ్ అయ్యాక.. ఇంకా ఏమైనా అల్లు అర్జున్ పార్ట్ బ్యాలెన్స్ ఉంటే అప్పుడు షూటింగ్ పెట్టుకుందామని సుకుమార్ అన్నారని వివరించారు.అందుకే బన్నీ తన గడ్డాన్ని ట్రిమ్ చేసుకున్నారని వెల్లడించారు. బన్నీ-సుకుమార్ మధ్య బాండింగ్ ఎప్పటికీ అలానే ఉంటుందని పేర్కొన్నారు. ఆగష్టు మొదటి వారంలో షూటింగ్ మొదలవుతుందని స్పష్టం చేశారు. పుష్ప లాంటి పాన్ ఇండియా సినిమాను ఇంత సింపుల్‌గా ఎందుకు తీసుకుంటార నిర్మాత బన్నీ వాస్ ప్రశ్నించారు. కాగా.. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోన్న పుష్ప-2.. ఈ ఏడాది డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
రెండు సినిమాల మధ్య మొదలైన క్రికెట్ యుద్ధం
టాలీవుడ్ సినిమా ప్రమోషన్స్‌లో సరికొత్త ప్లాన్‌తో నిర్మాతలు ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో 'ఆయ్' సినిమాతో పాటు కమిటీ కుర్రోళ్ళు చిత్రాలు ఆగష్టులోనే విడుదల కానున్నాయి. అయితే తాజాగా ఈ రెండు చిత్రాల యూనిట్ సభ్యులు క్రికెట్లో పోటీ పడ్డారు.ఆగస్ట్ 15న రిలీజ్ కానున్న 'ఆయ్' సినిమాకు బన్నీ వాస్ నిర్మాతగా ఉన్నారు. కమిటీ కుర్రోళ్ళు చిత్రానికి నిర్మాతగా నిహారిక కొణిదెల ఉన్నారు. అయితే, వీరిద్దరూ రెండు జట్లగా ఏర్పడి క్రికెట్ పోటీకి సిద్ధమంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. రెండు టీమ్స్ మధ్య క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించి బన్నీ వాస్, నిహారిక కొణిదెల మధ్య జరిగిన సరదా చాలెంజ్‌లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బన్నీ వాస్ విసిరిన చాలెంజ్‌ను నిహారిక కొణిదెల స్వీకరించారు. కచ్చితంగా ఆయ్ టీమ్ మీద తమ కమిటీ కుర్రోళ్ళు టీమ్ విజయం సాధిస్తుందని ఆమె నమ్మకంగా ఉన్నారు.జూలై 19న సాయంత్రం ఆరు గంటలకు మ్యాచ్ ప్రారంభమైంది. ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయమేమంటే ఈ రెండు సినిమాలు గోదావరి బ్యాక్ డ్రాప్‌తోనే తెరకెక్కాయి. క్రికెట్, మూవీ లవర్స్‌ను ఈ మ్యాచ్ ఆకట్టుకుంటుందనటంలో సందేహం లేదు.ఆయ్ సినిమా గురించిఫన్ ఎంటర్టైనర్గా ఆకట్టుకోనుంది ఆయ్ చిత్రం. నార్నే నితిన్, నయన్ సారిక, రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య తదితరులు ఇందులో ప్రధాన తారాగణంగా నటించారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగష్టు 15న ఈ చిత్రం విడుదల కానుంది. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రొడ్యూసర్ బన్నీ వాస్, విద్యా కొప్పినీడి సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. రామ్ మిర్యాల సంగీతాన్ని సమకూరుస్తున్నారు.కమిటీ కుర్రోళ్ళు సినిమా గురించినిహారిక కొణిదెల సమర్పణలో రూపొందుతున్న కమిటీ కుర్రోళ్ళు చిత్రం సినీ ప్రేక్షకుల హృదయాలను మెప్పిస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. ఈ సినిమా కూడా ఆగష్టులోనే రిలీజ్ కానుంది. సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, ఐశ్వర్య రచిరాజు, మణికాంత పరుశు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివ కుమార్ మట్ట తదితరులు సినిమాలో నటించారు. యదు వంశీ దరక్శకత్వంలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై పద్మజ కొణిదెల,జయలక్ష్మి అడపాక ఈ చిత్రాన్ని నిర్మించారు. -
నాగచైతన్య- సాయి పల్లవి ‘తండేల్’ మూవీ ప్రారంభం (ఫొటోలు)
-
అంబాజీపేట మ్యారేజ్ బ్యాండులో గట్టిగానే కొట్టిన మల్లిగాడు
కేరాఫ్ కంచర పాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకటేశ్ మహా. ఇప్పుడాయన సమర్పణలో సుహాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’. ఈ సినిమాకు దుశ్యంత్ కటికనేని దర్శకత్వం వహిస్తున్నారు.జీఏ2 పిక్చర్స్, స్వేచ్ఛ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ తాజాగా విడుదలైంది. (ఇదీ చదవండి: సూర్యచంద్రులకు కూడా నిన్ను చూపించేదాన్ని కాదు: విజయ్ ఆంటోనీ భార్య) ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కలర్ ఫోటో’ జాతీయ స్థాయిలో అవార్డు దక్కడంతో సుహాస్‌కు మంచి గుర్తింపు దక్కినా రైటర్ పద్మభూషణ్‌తో ఫ్యామిలీ ఆడియెన్స్ కు మరింత చేరువయ్యాడు. తాజాగా ఆయన నుంచి వస్తున్న అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు టీజర్ అందరినీ మెప్పించేలా ఉంది. మల్లిగాడు (సుహాస్) ఒక సెలూన్ నడుపుతూనే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్‌లో డప్పు కొడుతుంటాడు. అలాంటి వాడికి ఒక కాలేజీ అమ్మాయి పరిచయం కావడం.. వారిద్దరూ ప్రేమలో పడటం వల్ల ఎదరయ్యే సమస్యలు కథలు ప్రధానంగా ఉన్నట్లు టీజర్లో తెలుస్తోంది. టీజర్ చివరిలో సుహాస్‌కు గుండు కొట్టిస్తూ ఉన్న షాట్ హైలైట్‌గా ఉన్నా.. అందుకు ప్రధాన కారణాలు ఎంటి..? అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతుంది. టీజర్ చూస్తుంటే మల్లిగాడు బ్యాండ్ గట్టిగానే కొట్టినట్లు ఉన్నాడు. -
శ్రీకాకుళంలో పర్యటించిన హీరో నాగ చైతన్య, చందు, బన్నీ వాసు (ఫొటోలు)
-
నిఖిల్ సిద్ధార్థ్ '18 పేజిస్' మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
‘పక్కా కమర్షియల్’మూవీ (ఫొటోలు)
-
2002లో ఇండస్ట్రీకి, ఈ పదేళ్లలో ఎన్నో మార్పులొచ్చాయి: బన్నీ వాసు
డిస్టిబ్యూటర్‌గా కెరీర్ మొదలుపెట్టి 100% లవ్ సినిమాతో నిర్మాతగా మారి ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు చేశారు బన్నీ వాసు. ప్రస్తుతం "పక్కా కమర్షియల్" సినిమా నిర్మిస్తున్న ఆయన తన పుట్టినరోజు సందర్బంగా మీడియాతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 'నేను ఎంత సంపాదించాను అని కాకుండా, ఆడియన్స్‌ను థియేటర్‌కు ఎంత దగ్గరగా ఉంచాం అనేది ఇంపార్టెంట్. అందుకే పక్కా కమర్షియల్ సినిమాను కూడా అందరికీ అందుబాటులో ఉండేలా టికెట్ రేట్స్ పెట్టాం. కామన్ పీపుల్, మధ్యతరగతి ప్రజలు సినిమాకి వచ్చే పాజిబిలిటే ఉన్నట్లే ప్లాన్ చేసాము. 2002లో నేను ఇండస్ట్రీకి వచ్చాను, నిర్మాతగా 2011లో నా మొదటి సినిమా చేసాను. ఈ పదేళ్లలో చాలా మార్పులు వచ్చాయి. రాముడు బుద్ధిమంతుడు అని చెప్తే ఇప్పుడు వినేవారు లేరు, రాముడు బెత్తం పడతాడు అని చెప్తే వినే పరిస్థితి వచ్చింది. సినిమా థియేటర్లో ఆడాలంటే ఎక్స్ట్రార్డినరీ కంటెంట్ ఉండాలి. నార్మల్, ఆర్డినరీ కంటెంట్‌తో సినిమా చేయలేము. పక్కా కమర్షియల్ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం 18 పేజెస్ సినిమా జరుగుతుంది. ఆ తరువాత చందు మొండేటి, పవన్ సాధినేని సినిమాలు ఉండబోతున్నాయి' అని చెప్పుకొచ్చారు. చదవండి: మాడవీధుల్లో చెప్పులేసుకుని తిరిగిన కొత్త పెళ్లికూతురు సీక్రెట్‌గా సింగర్ పెళ్లి, ఆపేందుకు ప్రయత్నించిన మాజీ భర్త -
ప్రతిరోజూ పండగే అందరి విజయం
‘‘మారుతి ‘ప్రతిరోజూ పండగే’ సినిమా కథని నాకు చెప్పినప్పుడు యూత్‌ఫుల్ ఎలిమెంట్స్ లేవు కదా? అన్నాను. కానీ మారుతి నమ్మకంగా ఉన్నాడు. షూటింగ్ పూర్తయ్యాక సినిమా చూస్తున్నంత సేపు నవ్వుకుంటూ ఉన్నాం. థియేటర్స్‌లో ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా సినిమాను పెద్ద హిట్ చేసిన అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ ఏడాది చివర్లో సాయితేజ్ సక్సెస్ కొట్టాడు. ఈ విజయం అందరిదీ’’ అని అల్లు అరవింద్ అన్నారు. సాయితేజ్, రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 20న విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ప్రతిరోజూ పండగ సంబరాలు’ కార్యక్రమంలో పాటల రచయిత ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కథ విన్నప్పుడే విజ యాన్ని ఉహించాను. విదేశాలకు వెళ్లిన తర్వాత మనుషుల మధ్య ప్రేమ, అభిమానాలు తగ్గాయి. ఈ పాయింట్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు’’ అన్నారు. ‘‘ఒక తండ్రీ కొడుకుల మధ్య ఉండే అనుబంధాన్ని చూపించాలనుకున్నా. ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు’’ అన్నారు మారుతి. ‘‘ప్రతిరోజూ పండగే’ సినిమాని సపోర్ట్ చేసున్న వారికి ధన్యవాదాలు. ఈ సక్సెస్‌ను మెగా అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు అంకితమిస్తున్నా’’ అన్నారు సాయితేజ్. ‘‘నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ ఇచ్చిన అరవింద్, వాసుగార్లకు థ్యాంక్స్’’ అన్నారు తమన్. -
ప్రతిరోజూ పండుగే : మూవీ రివ్యూ
టైటిల్: ప్రతిరోజూ పండుగే జానర్: ఫ్యామిలీ ఎంటర్టైనర్ నటీనటులు: సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా, సత్యరాజ్, రావు రమేశ్, విజయ్‌కుమార్, నరేశ్, ప్రభ తదితరులు సంగీతం: థమన్ ఎస్ సినిమాటోగ్రఫీ: జయకుమార్ నిర్మాత: బన్నీ వాస్ దర్శకత్వం: మారుతి బ్యానర్లు: యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన తాజా సినిమా ‘ప్రతిరోజూ పండుగే’. వినూత్న కాన్సెప్ట్‌లతో కమర్షియల్ సినిమాలు తెరకెక్కించే దర్శకుడు మారుతీ ఒక ఫీల్‌గుడ్ టైటిల్‌తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. అడపాదడపా హిట్లతో నెట్టుకొస్తున్న సాయి ‘చిత్రలహరి’ సినిమాతో సూపర్‌హిట్ అందుకున్నారు. అటు మారుతీ కూడా భలేభలే మగాడివోయ్, మహానుభావుడు సినిమాల తర్వాత మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ప్రతిరోజూ పండుగే’ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇంతకూ ‘ప్రతిరోజూ పండుగే’ అంటూ తాత-మనవళ్లు ప్రేక్షకులకు ఏం చెప్పారు? సంక్రాంతికి ముందే తెర నిండుగా పండుగ తీసుకొచ్చారా? కథ: రాజమండ్రికి చెందిన పసుపులేటి రఘురామయ్య వయస్సు మీదపడిన పెద్దాయన. ఆయన పిల్లలు దూరంగా సెటిలయ్యారు. ఈ దశలో ఆయనకు లంగ్ క్యాన్సర్ తీవ్రమవుతుంది. ఇంకా కొన్ని వారాలే బతుకుతారని డాక్టర్ చెప్తారు. కానీ ఎక్కడో దూరంగా సెటిలైన పిల్లలు తండ్రికి వచ్చిన కష్టం కన్నా.. ఎన్ని రోజులు ఆయనతో ఉండి.. ఎంత తర్వగా ఆయన చావు తతంగం పూర్తి చేసి.. చేతులు దులుపుకొని వెళ్లిపోవాలా? అని చూస్తారు. కానీ, ఆయన మానవడు మాత్రం తాత చివరి రోజులు సంతోషంగా చూడాలనుకుంటాడు. ఆయన నెరవేరని కోరికలు తీర్చాలనుకుంటాడు. కానీ, అతని తల్లిదండ్రులు, బాబాయి-పిన్నిలు, అత్త-మామల ధోరణి అందుకు భిన్నంగా ఉంటుంది. చివరి రోజుల్లో తండ్రిని సుఖంగా చూసుకోవడం కంటే తమ జాబ్‌లు, జీవితాలు ఇవే ముఖ్యమనుకుంటారు. పెద్దాయన మనస్సు నొప్పించేలా ప్రవర్తిస్తుంటారు. ఈ నేపథ్యంలో తాత కోసం తపించే సాయి ఏం చేస్తాడు? తమ పిల్లల కోసం సర్వస్వాన్ని త్యాగం చేసే వాళ్లు కూడా యాంత్రిక జీవితంలో పడి.. వృద్ధాప్యంలోని తల్లిదండ్రులను చూసుకోవడంలో నిర్లిప్తంగా ఉంటారు. ఏదోలే పోతేపోయారు అనుకుంటారు. అలాంటి వారిని ఈ మనవడు ఎలా మారుస్తాడు? అన్నది మిగతా కథ. విశ్లేషణ: ‘ప్రతిరోజూ పండుగే’ అనే ఫీల్ గుడ్ టైటిల్‌తో బీటలు వారుతున్న కుటుంబ సంబధాల నేపథ్యంగా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు. ఫస్టాప్ కథ ఒకింత ఫ్లాటుగా ప్రారంభమవుతుంది. తాతకు లంగ్‌క్యాన్సర్ అని తెలియడం, మనవడు సాయి పరిగెత్తుకురావడం, తాత కోరికలు తీర్చడం, తాత కోసం ఏంజిల్ అరుణను పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడటం, సత్యరాజ్ పిల్లలంతా ఇంటికి చేరడం ఇలా కథ.. ఒకింత సాగదీసినట్టు అనిపిస్తుంది. కానీ, ఫస్టాఫ్‌లో వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులను అలరిస్తాయి. పలుచోట్ల గిలిగింతలు పెడుతాయి. కామెడీ సీన్లతో సాగుతూ ఇంటర్వెల్ వరకు వచ్చేసరికి కథ ప్రధాన మలుపు తిరుగుతుంది. సెకండాప్లోనూ కథ పెద్దగా కనిపించదు. తండ్రి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ కోసం ఆరాటపడుతూ.. బతికుండే తండ్రి చావు కోసం పిల్లలు చేసే ఆరాట ఆర్భాటాలు... సమాజంలోని అసంబద్ధతను చూపిస్తూనే కడుపుబ్బా నవ్విస్తాయి. ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ సీన్లు భావోద్వేగంగా సాగుతూ ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తాయి. క్లైమాక్స్ ఒకింత లెంగ్తీగా అనిపించినా సినిమాకు ఇదే ప్రధాన బలమని చెప్పవచ్చు. వృద్ధాప్యంలోని తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారిని వారిని కడిగిపారేసేలా క్లైమాక్స్ సీన్లు సాగుతాయి. ఇక, తాతమనవళ్లుగా సత్యరాజ్-సాయి సెంటిమెంట్‌ను పండించారు. సినిమాలో ప్రధానపాత్ర సత్యరాజ్దే. చావుకు చేరువగా ఉన్న తన పట్ల కుటుంబసభ్యుల అనుచిత ప్రవర్తన, ఎప్పుడెప్పుడు వెళ్లిపోదామా అనుకునే వారి తీరుతో ఆయన పడే మానసిక క్షోభ.. సత్యరాజ్ అద్భుతంగా పండిచారు. మనవడిగా, పెద్దలకు బుద్ధిచెప్పే కొడుకుగా సాయి కూడా తన నటనతో మెప్పించాడు. ఒక ఫైట్ సీన్లో తొలిసారి తెరమీద సాయి సిక్స్‌ప్యాక్ బాడీని ఎక్స్పోజ్ చేశాడు. సాయి తండ్రిగా రావు రమేశ్ పాత్ర సెటిల్డ్ యాక్టింగ్‌తో ఆద్యంతం నవ్వులు కురిపిస్తుంది. అందంగా కనిపించడమే కాదు.. టిక్‌టాక్ పిచ్చిలో మునిగిపోయిన ఏంజిల్ అరుణగా రాశీ ఖన్నా తన పరిధి మేరకు పాత్రను పండించారు. పాటలు, కొన్ని కామెడీ సీన్లు మినహాగా హీరోయిన్ పాత్రకు అంతగా స్కోప్ లేదు. మిగతా నటులూ తమ పాత్ర పరిధి మేరకు మెప్పించారు. థమన్ పాటలు బావున్నాయి. క్యాచీ వర్డ్స్‌తో సాగే ‘ఓ బావా’ పాటను తెరకెక్కించిన విధానమూ బాగుంది. నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్‌గా నిలిచింది. సినిమా స్థాయి తగ్గట్టుగా నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. ఎడిటింగ్‌లో సినిమాకు మరింత పదును పెట్టాల్సింది. కథ ఒకింత రొటీన్‌గా అనిపించడం, కామెడీ సీన్లు, క్లైమాక్స్ బాగున్నా.. స్క్రీన్‌ప్లే అంతగా నవ్యత లేకపోవడం, సాగదీసినట్టు అనిపించడం, ఇలాంటి కథతో ఇప్పటికే శతమానం భవతి లాంటి సినిమాలు రావడం.. ఈ సినిమాను ప్రేక్షకులు మేరకు ఆదరిస్తాన్నది చూడాలి బలాలు తాత-మనవళ్ల సెంటిమెంట్ కామెడీ సీన్లు క్లైమాక్స్ సీన్లు బలహీనతలు రొటీన్ కథ, కథనాలు సాగదీసినట్టు అనిపించడం - శ్రీకాంత్ కాంటేకర్ -
అదే మా బ్యానర్ విజయ రహస్యం
‘‘శైలజా రెడ్డి అల్లుడు’ తర్వాత కొన్ని నెలలు ఓ కథ మీద వర్క్ చేశాడు మారుతి. ఆ తర్వాత మరో ఆలోచనను పంచుకున్నాడు. అది నచ్చింది. కానీ ఎక్కడో చిన్న సందేహం. అయితే మా అమ్మగారి వల్ల ఈ సినిమా చేయాలనుకున్నాను’’ అన్నారు నిర్మాత ‘బన్నీ’’ వాస్. సాయితేజ్, రాశీ ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘ప్రతి రోజూ పండగే’. అల్లు అరవింద్ సమర్పణలో జిఏ2 పిక్చర్స్‌పై ‘బన్నీ’ వాస్ నిరి్మంచారు. సత్యరాజ్, రావు రమేశ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ నెల 20న ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా ‘బన్నీ’ వాస్ చెప్పిన విశేషాలు. ►దర్శకుడు మారుతి, నేను, యూవీ క్రియేషన్స్ వంశీ, యస్కేయన్ (ఈ చిత్ర సహనిర్మాత) మంచి ఫ్రెండ్స్. ఏ ఐడియా వచి్చనా నలుగురం పంచుకుంటాం. డైరెక్టర్, ప్రొడ్యూసర్‌లా ఎప్పుడూ ఉండం. మారుతి క్రియేటర్ కాబట్టి అతని ఆలోచనల్ని నేను గౌరవిస్తాను. ►‘ప్రతి రోజూ పండగే’ కథ బాగానే అనిపించింది కానీ అమ్మానాన్నలను అశ్రద్ధ చేసేవాళ్లు ఎవరుంటారు? కనెక్ట్ అవుతారా? అనే డౌట్‌ని కొందరు వ్యక్తం చేశారు. ఇది జరిగిన కొన్ని రోజులకే మా అమ్మగారు నాకు ఫోన్ చేశారు. ‘ఐదు రోజులుగా నీతో మాట్లాడటానికి ప్రయతి్నస్తున్నాను రా’ అన్నారు. నాకు వెంటనే తల్లిదండ్రులను అశ్రద్ధ చేసేవాళ్లలో నేను కూడా ఉన్నానా? అని భయం వేసింది. మేం పట్టించుకోనప్పుడు మీకెలా ఉంటుంది అమ్మా? అని అడిగాను. ‘పెద్దయిపోయారు. మీకు బాధ్యతలు ఉంటాయని సర్ది చెప్పుకుంటాం రా’ అని చెప్పింది. అందరం ఏదో ఒకసారి మన పేరెంట్స్‌ను అశ్రద్ధ చేస్తున్నవాళ్లమే. అలాంటి కథ కాబట్టి మారుతిని గోఎహెడ్ అన్నాను. ►ఈ చిత్రంలో తేజ్ ఫిట్బాడీతో కనిపిస్తాడు. ‘బాడీ మీద క్రమశిక్షణ తప్పింది. వర్కౌట్ చేస్తాను’ అని ఈ సినిమా కోసం బాడీని రెడీ చేశాడు. యాక్టర్‌గా తనను తాను చాలా మెరుగుపరుచుకుంటున్నాడు. ►చావు అనివార్యం. పెళ్లి, పుట్టినరోజుని ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటామో చావుని కూడా అలానే సెలబ్రేట్ చేసుకోవాలి. ఈ విషయాన్ని సీరియస్‌గా, ఫన్నీగా చెప్పాం. ►అల్లు అరవింద్‌గారి సలహాలు బావుంటాయి. మనం చెప్పినదాంట్లో పాయింట్ ఉందంటే తీసుకుంటారు. మూడు జనరేషన్స్ (అరవింద్‌గారు , నేను, నూతన దర్శకులు) కలసి పని చేయడమే మా బేనర్ విజయ రహస్యం. ►ప్రస్తుతం ‘జెర్సీ’ హిందీ రీమేక్, అఖిల్– ‘బొమ్మరిల్లు’ భాస్కర్ చిత్రం, కార్తికేయ ‘చావు కబురు చల్లగా’, నిఖిల్– సూర్యప్రతాప్ సినిమాలు చేస్తున్నాం. ►సోషల్ మీడియాను ఎక్కువగా వినియోగించను. కానీ ఎప్పుడైనా బాధ కలిగినా, నా అభిప్రాయాలను పంచుకోవాలన్నా ఫేస్బుక్లో స్పందిస్తా. ►మేం అడ్వాన్స్ ఇచ్చినా ఆ దర్శకుడికి వేరే ఆఫర్ ఉంటే చేసుకోమంటాం. దర్శకులను మా దగ్గరే ఉండాలని నిబంధన పెట్టం. ప్రాజెక్ట్ ఓకే అయ్యాక మాత్రం వదలం (నవ్వుతూ). -
‘గీత గోవిందం’ దర్శకుడి నెక్ట్స్ ప్రాజెక్ట్!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా గీత గోవిందం. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వందకోట్లకు పైగా గ్రాస్ సాధించి సత్తా చాటింది. ఓవర్ సీస్లో రెండు మిలియన్లు వసూళ్లు సాధించిన ఈ సినిమా.. దర్శకుడు పరశురామ్‌కు స్టార్ ఇమేజ్ను తెచ్చిపెట్టింది. గీత గోవిందం భారీ సక్సెస్ సాధించటంతో పరుశురామ్ తెరకెక్కించబోయే తదుపరి సినిమాపై ఆసక్తి నెలకొంది. తాజాగా తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు పరుశురామ్. గీత గోవిందం చిత్రాన్ని నిర్మించిన గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లోనే తన తదుపరి చిత్రం ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే నిర్మాత బన్నీవాసుకు నాలుగైదు లైన్లు వినిపించినట్టుగా చెప్పిన పరుశురామ్ దేవుడికి మనిషి మధ్య జరిగే ఓ కథను బన్నీవాసు ఫైనల్ చేసినట్టుగా తెలిపారు. పూర్తి స్క్రిప్ట్ రెడీ అయిన తరువాత అల్లు అరవింద్‌కు వినిపిస్తానని తెలిపారు. -
‘కొత్త జంట’ ఆడియో ఆవిష్కరణ