‘ఆయ్‌’ చూశాక పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి: ‘బన్నీ’ వాసు | Bunny Vas Talks About AAY Movie | Sakshi
Sakshi News home page

‘ఆయ్‌’ చూశాక పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి: ‘బన్నీ’ వాసు

Aug 17 2024 11:10 AM | Updated on Aug 17 2024 11:17 AM

Bunny Vas Talks About AAY Movie

‘‘ఆయ్‌’ కో ప్రొడ్యూసర్స్‌ రియాజ్, భాను నాకు మంచి మిత్రులు. వాళ్లు చెప్పడంతో అంజి చెప్పిన ‘ఆయ్‌’ కథ వింటూ రెండున్నర గంటలు నాన్‌స్టాప్‌గా నవ్వాను. ప్రేక్షకులతో కలిసి సినిమా చూస్తున్నప్పుడు నా ముందు సీట్‌లో ఉన్న ఓ వ్యక్తి నవ్వలేక లేచి నిలబడ్డాడు. నేను కథ విన్నప్పుడు ఎలాగైతే ఎంజాయ్‌ చేశానో దాన్ని స్క్రీన్‌పై చూసి ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తున్నారని అప్పుడు అర్థమైంది’’ అని నిర్మాత ‘బన్నీ’ వాసు అన్నారు. 

నార్నే నితిన్, నయన్‌ సారిక జంటగా అంజి కె. మణిపుత్ర దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆయ్‌’. అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలైంది. ఈ సందర్భంగా శుక్రవారం ‘బన్నీ’ వాసు మీడియాతో మాట్లాడుతూ– ‘‘ఆయ్‌’లోని వినోదానికి దర్శకుడు భావోద్వేగాలను కలపడంతో మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యింది. ఈ చిత్రానికి వస్తోన్న స్పందన చూసి పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ‘ఆయ్‌’ షోలు పెంచేందుకు చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement