Aay Movie
-
ఒకేరోజు ఓటీటీల్లోకి వచ్చేసిన 20 మూవీస్.. ఇవి డోంట్ మిస్
మరో వీకెండ్ వచ్చేసింది. ఈ వారం థియేటర్లలో రిలీజైన వాటిలో 'మత్తు వదలరా 2' అనే కామెడీ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మిగిలిన వాటి టాక్ తెలియాల్సి ఉంది. మరోవైపు ఓటీటీలో మాత్రం బోలెడన్ని తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ రిలీజైపోయాయి. ఈ శుక్రవారం ఏకంగా 20 చిత్రాలు పలు ఓటీటీల్లోకి వచ్చేశాయి. ఇంతకీ అవేంటి? వీటిలో చూడాల్సిన సినిమాలేంటి?(ఇదీ చదవండి: ‘మత్తు వదలరా 2’ మూవీ రివ్యూ)మొత్తంగా ఈ వీకెండ్ 25 సినిమాల వరకు ఉన్నాయి. కానీ వీటిలో తలవన్, రఘు తాత, సెక్టార్ 36, టీన్జ్ అనే డబ్బింగ్ బొమ్మలు బాగున్నాయి. మరోవైపు ఆయ్, స్పార్క్ లాంటి స్ట్రెయిట్ చిత్రాలు కూడా స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. వీటిలో మీరు ఏది చూసినా సరే ఫుల్ టైమ్పాస్తో పాటు ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. మరి వీటిలో మీరేం చూస్తారు లేదా చూడబోతున్నారు?ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చేసిన మూవీస్ (సెప్టెంబరు 13)అమెజాన్ ప్రైమ్ఔరోన్ మైన్ కహాన్ దమ్ థా - హిందీ సినిమాబ్యాడ్ న్యూజ్ - హిందీ మూవీడ్రీమ్ డీల్స్ - జర్మన్ సిరీస్ఎన్ ఫిన్ - స్పానిష్ సిరీస్ట్రాప్ - ఇంగ్లీష్ సినిమారూపాంతర - కన్నడ మూవీటీన్జ్ - తెలుగు డబ్బింగ్ సినిమానెట్ఫ్లిక్స్సెక్టార్ 36 - తెలుగు డబ్బింగ్ మూవీఆఫీసర్ బ్లాక్ బెల్ట్ - కొరియన్ సినిమాఅగ్లీస్ - ఇంగ్లీష్ మూవీఆయ్ - తెలుగు సినిమామిస్టర్ బచ్చన్ - తెలుగు మూవీజీ5బెర్లిన్ - హిందీ మూవీనునకుళి - తెలుగు డబ్బింగ్ సినిమారఘు తాత - తెలుగు డబ్బింగ్ మూవీహాట్స్టార్గోలీ సోడా రైజింగ్ - తమిళ సిరీస్హౌ టూ డై ఎలోన్ - ఇంగ్లీష్ సిరీస్ఇన్ వోగ్: ద 90స్ - ఇంగ్లీష్ సిరీస్లెగో స్టార్ వార్స్ - ఇంగ్లీష్ సిరీస్ద ఓల్డ్ మ్యాన్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్సన్ నెక్స్ట్స్పార్క్ - తెలుగు సినిమాఆహానన్బన్ ఒరువన్ వంత పిరాగు - తమిళ సినిమాపరాక్రమం - తెలుగు మూవీ (సెప్టెంబరు 14)లయన్స్ గేట్ ప్లేలేట్ నైట్ విత్ ద డెవిల్ - ఇంగ్లీష్ సినిమాసోనీ లివ్తలవన్ - తెలుగు డబ్బింగ్ మూవీ(ఇదీ చదవండి: దేవరకు సెన్సార్ బోర్డ్ షాక్.. ఆ నాలుగు సీన్స్ మార్చాల్సిందే!) -
ఓటీటీలో 'ఆయ్' సినిమా.. ప్రకటన వచ్చిందండోయ్
ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన ‘ఆయ్’ భారీ విజయాన్ని అందుకుంది. ఆగష్టు 15న రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లనే రాబట్టింది. అయితే, ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. మంచి వినోదంతో కూడిన గోదావరి నేపథ్యంలో సినిమా వచ్చి చాలా రోజులైంది. ఆ గ్యాప్‌ని ‘ఆయ్’ తీర్చేసింది. ఇందులో జూ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా, నయన్ సారిక హీరోయిన్గా నటించారుచిన్న సినిమాగా తెరకెక్కిన 'ఆయ్' బాక్సాఫీస్ వద్ద రూ. 20 కోట్లకు పైగానే రాబట్టింది. థియేటర్ బిజనెస్ పూర్తి చేసుకున్న ఆయ్ ఇప్పుడు ఓటీటీ బాట పట్టింది. ఈమేరకు నెట్ఫిక్స్ సంస్థ ఆయ్ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 12న ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుందని పేర్కొంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ,మలయాళంలో విడుదల కానుంది. అంజి కె. మణిపుత్ర దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్‌పై బన్నీ వాసు, విద్యా కొప్పినీడి ఈ సినిమాను నిర్మించారు.కధేంటి..?హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేస్తున్న కార్తీక్ (నార్నె నితిన్) కరోనా లాక్డౌన్ వల్ల తన సొంత ఊరు అమలాపురం వస్తాడు. ఆఫీస్‌కు వెళ్లే అవకాశం లేకపోవడంతో వర్క్ ఫ్రమ్ హోం చేసుకుంటూనే తన చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో తన పక్క ఊరికి చెందిన పల్లవి (నయన్ సారిక)ని చూసి ఇష్టపడతాడు. పల్లవి ఎప్పుడూ సోషల్ మీడియాలో చలాకీగా ఉంటుంది. ఆమెకు కులం పట్టింపులు ఎక్కువగా ఉంటాయి. అయితే, కార్తీక్ తన కులానికి చెందినవాడే అనుకొని ఇష్టపడుతుంది. కానీ, తనది వేరే కులం అని తెలుసుకున్న పల్లవి తన ప్రేమ విషయాన్ని తండ్రి వద్ద దాస్తుంది. ప్రేమ విషయం తెలిస్తే చంపేస్తాడని పెద్దలు కుదిర్చిన పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. ఇదే సమయంలో పల్లవి, కార్తీక్‌లను ఒక్కటి చేయాలని వారి స్నేహితులు చాలా ప్రయాత్నాలు చేస్తుంటారు. ఫైనల్‌గా వారిద్దరిని ఎవరు కలుపుతారు..? స్నేహితుల ప్రయత్నాలు ఫలిస్తాయా..? చివరకు కార్తిక్ తండ్రి తీసుకున్న నిర్ణయం ఏంటి..? ఫైనల్‌గా వారిద్దరూ పెళ్లి చేసుకున్నారా..? తెలియాలంటే సెప్టెంబర్ 12 నెట్‌ఫ్లిక్స్‌లో 'ఆయ్' సినిమా చూడాల్సిందే. -
'ఆయ్'... మన కోనసీమేనండి!
మనం ఎంచుకున్న లక్ష్యానికి నిబద్ధత, శ్రమ, తపన తోడైతే దాని ఫలితం అద్భుతంగా ఉంటుందనే నమ్మకాన్ని ‘ఆయ్’ సినిమా దర్శకుడు అంజిబాబు కంచిపల్లి రుజువు చేశాడు. తొలి ప్రయత్నంలోనే సినీ దర్శకుడిగా విజయాన్ని సొంతం చేసుకున్నాడు... డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం పట్టణ శివారు కొంకాపల్లి అంజిబాబు స్వస్థలం. పదో తరగతి చదువుతున్న రోజుల్లో ఒకరోజు...‘నేను సినిమా డైరెక్టర్ కావాలనుకుంటున్నాను’ అని తండ్రి బూరయ్య, సోదరులకు చెప్పాడు. ఆ వయసులో పిల్లల నోటి నుంచి వినిపించే కలలకు పెద్దలు ‘అలాగే’ అంటారు తప్ప అంత సీరియస్‌గా తీసుకోరు. కానీ అంజిబాబు మాత్రం యమ సీరియస్‌గా తీసుకున్నాడు. ‘ముందు నువ్వు డిగ్రీ పూర్తి చేయి. తర్వాత ఆలోచిద్దాం’ అని తండ్రి చెప్పాడు. తన లక్ష్యాన్ని సీరియస్‌గా తీసుకున్నప్పటికీ చదువును మాత్రం అశ్రద్ధ చేయలేదు. అమలాపురంలో డిగ్రీ పూర్తి చేసిన తరువాత ఓ మంచి రోజు తన కలల దారిని వెదుక్కుంటూ హైదరాబాద్ బస్సెక్కేశాడు. ఎంతోమంది దర్శకుల దగ్గర అసిస్టెంట్‌గా పని చేశాడు.కోనసీమలో బాల్యం నుంచి స్నేహంగా చిగురించిన బంధాలు, అనుబంధాలు పెద్దయ్యాక కులాల కుంపటి రాజుకుని నాశనమవుతున్నాయి. కులాల బీటలతో స్నేహం, ప్రేమ విచ్ఛిన్నం అవుతున్నాయి. ఇదే తన కథలో ప్రధానాంశంగా ఎంచుకుని సినిమా కోసం ఓ స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాడు.తాను రాసుకున్న కథను గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్, భాగస్వామి బన్నీ వాసులకు వినిపించాడు. గీతా ఆర్ట్స్‌కు నచ్చడంతో అంజిబాబు కథా రచయితగా తొలి విజయం సాధించాడు. సినిమాని కోనసీమ నదీ పరీవాహక గ్రామాల్లో చిత్రీకరించడం రెండో విజయం. అమలాపురం వేదికగా రూపుదిద్దుకున్న ‘కోనసీమ ఫిలిమ్ అసోసియేషన్’కు చెందిన సినీ ఆర్టిస్ట్‌లతో కొంత మందికి అంజిబాబు ‘ఆయ్’ సినిమాలో నటించే అవకాశాన్ని ఇచ్చి వారి నుంచి మంచి నటనను రాబట్టాడు. తన తండ్రిపై ఉన్న అభిమానంతోనే ‘ఆయ్’ సినిమాలోని హీరో తండ్రి క్యారెక్టర్‌కు ‘బూరయ్య’ అని పేరు పెట్టాడు.చిన్నతనం నుంచి తాను పుట్టి పెరిగిన కోనసీమలోని ప్రకృతి అందాలు, గ్రామీణ సౌందర్యాలను తాను తీసే తొలి చిత్రంలో తెరకెక్కించాలనే కలను నిజం చేసుకున్నాడు. కోనసీమ యాస, నేటివిటీకి హాస్యాన్ని జోడించి ‘ఆయ్’ చిత్రాన్ని తెరకెక్కించి విజయాన్ని అందుకున్నాడు అంజిబాబు. – పరసా సుబ్బారావు, సాక్షి, అమలాపురం టౌన్"తొలి ప్రయత్నంలోనే సినీ దర్శకుడు కావాలన్న నా శ్రమ, కల ఇప్పుడు ’ఆయ్’ చిత్ర రూపంలో ఫలించినందుకు సంతోషంగా ఉంది. సమాజానికి ఓ మంచి సందేశం ఇవ్వాలన్న నా కోరిక కూడా ‘ఆయ్’ చిత్రం ద్వారా తీరింది. కోనసీమ అందాలు, అచ్చమైన పల్లె వాతావరణం, గోదారోళ్ల యాస మాటలు, సందర్భోచిత హాస్యంతో సినిమాను తీయాలనే ఆలోచనతో ‘ఆయ్’ చిత్రం కథను రాశాను. నా క«థను మెచ్చి చిత్రాన్ని తెరకెక్కించేలా చేసిన గీతా ఆర్ట్స్‌కు, అల్లు అరవింద్, బన్నీ వాసులకు నా ధన్యవాదాలు." – అంజిబాబు కంచిపల్లి, ఆయ్ చిత్ర దర్శకుడు -
Aay Movie Team: అల్లు అర్జున్‌ని కలిసిన ఎన్టీఆర్ బావమరిది (ఫొటోలు)
-
దిల్ రాజు వ్యాఖ్యలపై బన్నీ వాసు రియాక్షన్
-
ఈ బ్యూటీ చాలా క్యూటీ..అందంతో పిచ్చెక్కిస్తోంది నయన్ సారిక 'ఆయ్'(ఫొటోలు)
-
బామ్మర్ది కోసం వచ్చాడండి ‘ఆయ్’.. టీంను అభినందించిన ఎన్టీఆర్ (ఫొటోలు)
-
ఆయ్‌కి ఎన్టీఆర్ అభినందనలు
ఎన్టీఆర్ బావమరిది, ‘మ్యాడ్’ ఫేమ్ నార్నే నితిన్, నయన్ సారిక హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఆయ్’. అంజి కె. మణిపుత్ర దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదలైంది.తమ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది. తాజాగా ‘ఆయ్’ యూనిట్ ఎన్టీఆర్‌ను కలిసింది. సినిమా విజయం సాధించినందుకు యూనిట్ సభ్యులను ఎన్టీఆర్ అభినందించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
‘ఆయ్’ చూశాక పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి: ‘బన్నీ’ వాసు
‘‘ఆయ్’ కో ప్రొడ్యూసర్స్ రియాజ్, భాను నాకు మంచి మిత్రులు. వాళ్లు చెప్పడంతో అంజి చెప్పిన ‘ఆయ్’ కథ వింటూ రెండున్నర గంటలు నాన్‌స్టాప్‌గా నవ్వాను. ప్రేక్షకులతో కలిసి సినిమా చూస్తున్నప్పుడు నా ముందు సీట్లో ఉన్న ఓ వ్యక్తి నవ్వలేక లేచి నిలబడ్డాడు. నేను కథ విన్నప్పుడు ఎలాగైతే ఎంజాయ్ చేశానో దాన్ని స్క్రీన్‌పై చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారని అప్పుడు అర్థమైంది’’ అని నిర్మాత ‘బన్నీ’ వాసు అన్నారు. నార్నే నితిన్, నయన్ సారిక జంటగా అంజి కె. మణిపుత్ర దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆయ్’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలైంది. ఈ సందర్భంగా శుక్రవారం ‘బన్నీ’ వాసు మీడియాతో మాట్లాడుతూ– ‘‘ఆయ్’లోని వినోదానికి దర్శకుడు భావోద్వేగాలను కలపడంతో మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది. ఈ చిత్రానికి వస్తోన్న స్పందన చూసి పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ‘ఆయ్’ షోలు పెంచేందుకు చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు.