ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన ‘ఆయ్’ భారీ విజయాన్ని అందుకుంది. ఆగష్టు 15న రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లనే రాబట్టింది. అయితే, ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. మంచి వినోదంతో కూడిన గోదావరి నేపథ్యంలో సినిమా వచ్చి చాలా రోజులైంది. ఆ గ్యాప్‌ని ‘ఆయ్’ తీర్చేసింది. ఇందులో జూ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా, నయన్ సారిక హీరోయిన్‌గా నటించారు
చిన్న సినిమాగా తెరకెక్కిన 'ఆయ్' బాక్సాఫీస్ వద్ద రూ. 20 కోట్లకు పైగానే రాబట్టింది. థియేటర్ బిజనెస్ పూర్తి చేసుకున్న ఆయ్ ఇప్పుడు ఓటీటీ బాట పట్టింది. ఈమేరకు నెట్‌ఫిక్స్ సంస్థ ఆయ్ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 12న ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుందని పేర్కొంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ,మలయాళంలో విడుదల కానుంది. అంజి కె. మణిపుత్ర దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్‌పై బన్నీ వాసు, విద్యా కొప్పినీడి ఈ సినిమాను నిర్మించారు.
కధేంటి..?
హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేస్తున్న కార్తీక్ (నార్నె నితిన్) కరోనా లాక్‌డౌన్ వల్ల తన సొంత ఊరు అమలాపురం వస్తాడు. ఆఫీస్‌కు వెళ్లే అవకాశం లేకపోవడంతో వర్క్ ఫ్రమ్ హోం చేసుకుంటూనే తన చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో తన పక్క ఊరికి చెందిన పల్లవి (నయన్ సారిక)ని చూసి ఇష్టపడతాడు. పల్లవి ఎప్పుడూ సోషల్ మీడియాలో చలాకీగా ఉంటుంది. ఆమెకు కులం పట్టింపులు ఎక్కువగా ఉంటాయి. అయితే, కార్తీక్ తన కులానికి చెందినవాడే అనుకొని ఇష్టపడుతుంది. కానీ, తనది వేరే కులం అని తెలుసుకున్న పల్లవి తన ప్రేమ విషయాన్ని తండ్రి వద్ద దాస్తుంది.
ప్రేమ విషయం తెలిస్తే చంపేస్తాడని పెద్దలు కుదిర్చిన పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. ఇదే సమయంలో పల్లవి, కార్తీక్‌లను ఒక్కటి చేయాలని వారి స్నేహితులు చాలా ప్రయాత్నాలు చేస్తుంటారు. ఫైనల్‌గా వారిద్దరిని ఎవరు కలుపుతారు..? స్నేహితుల ప్రయత్నాలు ఫలిస్తాయా..? చివరకు కార్తిక్ తండ్రి తీసుకున్న నిర్ణయం ఏంటి..? ఫైనల్‌గా వారిద్దరూ పెళ్లి చేసుకున్నారా..? తెలియాలంటే సెప్టెంబర్ 12 నెట్‌ఫ్లిక్స్‌లో 'ఆయ్' సినిమా చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment