![NTR congratulates Aay team](/styles/webp/s3/article_images/2024/08/18/Ntr%20%281%29.jpg.webp?itok=frSvPvFw)
ఎన్టీఆర్ బావమరిది, ‘మ్యాడ్’ ఫేమ్ నార్నే నితిన్, నయన్ సారిక హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఆయ్’. అంజి కె. మణిపుత్ర దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదలైంది.
తమ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది. తాజాగా ‘ఆయ్’ యూనిట్ ఎన్టీఆర్‌ను కలిసింది. సినిమా విజయం సాధించినందుకు యూనిట్ సభ్యులను ఎన్టీఆర్ అభినందించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment