మెగా- అల్లు ఫ్యామిలీకి గొడవలు.. నిర్మాత ఏమన్నారంటే? | Bunny Vas Reacts On Mega and Allu Family Relations | Sakshi

Bunny Vas: చిరంజీవి అలా చేయడానికి కారణమదే: బన్నీ వాసు

Jul 19 2024 9:02 PM | Updated on Jul 20 2024 8:49 AM

Bunny Vas Reacts On Mega and Allu Family Relations

టాలీవుడ్‌లో మెగా- అల్లు కుటుంబాల మధ్య దూరం పెరిగిందని గతంలో చాలాసార్లు వార్తలొచ్చాయి. వీరి మధ్య రిలేషన్‌ దెబ్బతిన్నట్లు సోషల్ మీడియాలోనూ పెద్దఎత్తున వైరలైంది. అంతే కాకుండా ఎన్నికలముందు వైకాపా నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్‌కు మద్దతుగా అల్లు అర్జున్‌ ప్రచారం చేశారు. అప్పటి నుంచే వీరి మధ్య మరింత దూరం పెరిగినట్లు రూమర్స్ వినిపించాయి. తాజాగా ఈ విషయంపై టాలీవుడ్ నిర్మాత బన్నీవాసు స్పందించారు. ఆయ్ మూవీ ప్రెస్‌మీట్‌లో ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన క్లారిటీ ఇచ్చారు.

బన్నీ వాసు మాట్లాడుతూ..  'కొన్ని కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీలో చిన్నచిన్న గొడవలు వస్తుంటాయి. కానీ నేను 20 ఏళ్ల నుంచి మెగా- అల్లు ఫ్యామిలీని చూస్తున్నా. వారి కుటుంబాలు కలిసి ఉండాలని చిరంజీవి ఎల్లప్పుడు కోరుకుంటారు. అందుకే ప్రతి సంక్రాంతికి ఫ్యామిలీని తీసుకొని బెంగళూరు వెళ్తారు. అంతమందిని తీసుకెళ్లడం మామూలు విషయం కాదు. చాలా ఖర్చు కూడా అవుతుంది. దానికి ప్రధాన కారణం అందరూ కలిసి ఉండాలనేదే ఆయన కోరిక. ఇలా చేయడం వల్ల మేమంతా ఒకటే అని చెప్పడం.  ఏ కుటుంబంలోనైనా ఒకరు తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని విషయాల్లో ఇష్యూస్‌ వస్తాయి. కానీ ఇవీ జస్ట్‌ పాసింగ్ క్లౌడ్స్ అంతే. అంత మాత్రాన దీన్ని ఇలా చూడడం అనేది కరెక్ట్‌ కాదని నా అభిప్రాయం. వారి బంధం గురించి నాకు బాగా తెలుసు. వాళ్లందరూ కలిసి ఉండాలనే మేం అందరం కోరుకుంటాం.' అని  అన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement