ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పుష్ప-2: ది రూల్. సుకుమార్- బన్నీ కాంబోలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 2021లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన పుష్పకు సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ వాయిదా పడిన నేపథ్యంలో ఈ సినిమాపై రూమర్స్ పెద్దఎత్తున వైరలవుతున్నాయి. హీరో, డైరెక్టర్ మధ్య గ్యాప్ వచ్చిందని.. అందుకే షూటింగ్ సైతం ఆలస్యమవుతోందని పలురకాల వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా పుష్ప-2పై వస్తున్న రూమర్స్‌పై నిర్మాత బన్నీవాస్ స్పందించారు. ఆయ్ మూవీ ప్రెస్‌మీట్‌కు హాజరైన ఆయనకు ఈ ప్రశ్న ఎదురుకావడంతో క్లారిటీ ఇచ్చారు. పుష్ప-2పై మీడియాలో వార్తలు చూస్తే నవ్వు వస్తోందని అన్నారు. అల్లు అర్జున్ పార్ట్ కేవలం 15 నుంచి 20రోజుల లోపే ఉందని తెలిపారు. ఎడిటింగ్ అయ్యాక.. ఇంకా ఏమైనా అల్లు అర్జున్ పార్ట్ బ్యాలెన్స్ ఉంటే అప్పుడు షూటింగ్ పెట్టుకుందామని సుకుమార్ అన్నారని వివరించారు.
అందుకే బన్నీ తన గడ్డాన్ని ట్రిమ్ చేసుకున్నారని వెల్లడించారు. బన్నీ-సుకుమార్ మధ్య బాండింగ్ ఎప్పటికీ అలానే ఉంటుందని పేర్కొన్నారు. ఆగష్టు మొదటి వారంలో షూటింగ్ మొదలవుతుందని స్పష్టం చేశారు. పుష్ప లాంటి పాన్ ఇండియా సినిమాను ఇంత సింపుల్‌గా ఎందుకు తీసుకుంటార నిర్మాత బన్నీ వాస్ ప్రశ్నించారు. కాగా.. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోన్న పుష్ప-2.. ఈ ఏడాది డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment