2002లో ఇండస్ట్రీకి, ఈ పదేళ్లలో ఎన్నో మార్పులొచ్చాయి: బన్నీ వాసు | Producer Bunny Vasu Interview On His Birthday | Sakshi
Sakshi News home page

Bunny Vasu: 2002లో ఇండస్ట్రీకి, ఈ పదేళ్లలో ఎన్నో మార్పులొచ్చాయి: బన్నీ వాసు

Published Fri, Jun 10 2022 7:26 PM | Last Updated on Sat, Jun 11 2022 10:20 AM

Producer Bunny Vasu Interview On His Birthday - Sakshi

డిస్టిబ్యూటర్‌గా కెరీర్‌ మొదలుపెట్టి 100% లవ్ సినిమాతో నిర్మాతగా మారి ఎన్నో సక్సెస్‌ఫుల్‌ సినిమాలు చేశారు బన్నీ వాసు. ప్రస్తుతం "పక్కా కమర్షియల్" సినిమా నిర్మిస్తున్న ఆయన తన పుట్టినరోజు  సందర్బంగా మీడియాతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 

'నేను ఎంత సంపాదించాను అని కాకుండా, ఆడియన్స్‌ను థియేటర్‌కు ఎంత దగ్గరగా ఉంచాం అనేది ఇంపార్టెంట్. అందుకే పక్కా కమర్షియల్ సినిమాను కూడా అందరికీ అందుబాటులో ఉండేలా  టికెట్ రేట్స్ పెట్టాం. కామన్ పీపుల్, మధ్యతరగతి ప్రజలు సినిమాకి వచ్చే పాజిబిలిటే ఉన్నట్లే ప్లాన్ చేసాము. 2002లో నేను ఇండస్ట్రీకి వచ్చాను, నిర్మాతగా 2011లో నా మొదటి సినిమా చేసాను. ఈ పదేళ్లలో చాలా మార్పులు వచ్చాయి.

రాముడు బుద్ధిమంతుడు అని చెప్తే ఇప్పుడు వినేవారు లేరు, రాముడు బెత్తం పడతాడు అని చెప్తే వినే పరిస్థితి వచ్చింది. సినిమా థియేటర్‌లో ఆడాలంటే ఎక్స్‌ట్రార్డినరీ కంటెంట్‌ ఉండాలి. నార్మల్, ఆర్డినరీ కంటెంట్‌తో సినిమా చేయలేము. పక్కా కమర్షియల్ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం 18 పేజెస్ సినిమా జరుగుతుంది. ఆ తరువాత చందు మొండేటి, పవన్ సాధినేని సినిమాలు ఉండబోతున్నాయి' అని చెప్పుకొచ్చారు.

చదవండి: మాడవీధుల్లో చెప్పులేసుకుని తిరిగిన కొత్త పెళ్లికూతురు
సీక్రెట్‌గా సింగర్‌ పెళ్లి, ఆపేందుకు ప్రయత్నించిన మాజీ భర్త

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement