సాంకేతిక అద్భుతం ఇది
‘‘కమిట్‌మెంట్, ఎగ్జైట్‌మెంట్ ఉన్న యువ బృందం చేసిన సాంకేతిక అద్భుతం ‘కార్తికేయ’. ‘స్వామి రారా’ తర్వాత నిఖిల్, స్వాతి నటించిన ఈ సినిమాపై ప్రారంభం నుంచి మంచి అంచనాలు ఉన్నాయి’’ అని తనికెళ్ల భరణి చెప్పారు. నిఖిల్, స్వాతి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మించిన ‘కార్తికేయ’ పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. తనికెళ్ల భరణి పాటల సీడీని ఆవిష్కరించారు. మంచు మనోజ్ మాట్లాడుతూ -‘‘ఈ సినిమా విడుదలకు ముందే మంచి లాభాలు తెచ్చిపెట్టింది.
నిఖిల్ చాలా చిన్నస్థాయి నుంచి వచ్చి ఈ స్థాయికెదిగాడు’’ అన్నారు. నిఖిల్ మాట్లాడుతూ -‘‘స్వాతి లక్కీ ఆర్టిస్ట్. నేను పనిచేసిన నాయికల్లో ది బెస్ట్ అంటే స్వాతీనే. మా నిర్మాత చాలా మంచి వ్యక్తి. ఈ సినిమా కోసం చాలా ఖర్చు పెట్టారు’’ అని చెప్పారు. మంచి కథతో పాటు మంచి టీమ్ కుదిరిందని, రొటీన్‌గా కాకుండా డిఫరెంట్‌గా ఉండే సినిమా ఇదని నిర్మాత తెలిపారు. ప్రచార చిత్రం చాలా బావుందని ‘అల్లరి’ నరేశ్ అభినందించారు. ఈ వేడుకలో సుధీర్‌బాబు, వరుణ్ సందేశ్, ఆది, సుధీర్‌వర్మ, రామజోగయ్య శాస్త్రి, వనమాలి తదితరులు పాల్గొన్నారు.