
నిఖిల్ హీరోగా నటించిన ‘కార్తికేయ’ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. చందూ మొండేటి దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని గతంలోనే ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల అది ఆలస్యమవుతూ వచ్చింది. ప్రస్తుతం నిఖిల్ తమిళ్ రీమేక్ మూవీలో నటిస్తున్నారు. చందూ మొండేటి సవ్యసాచి షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
ఈ ప్రాజెక్టులు పూర్తి అయిన తరువాత కార్తికేయ2 ను ప్రారంభిస్తారని సమాచారం. ఈ సినిమాకు నిర్మాతగా నైజాం డిస్ట్రిబ్యూటర్ సునీల్ నిర్మాతగా వ్యవహరించనున్నారని తెలుస్తోంది. సునీల్ నిర్మాణ రంగం వైపు ఆలోచిస్తుండగా.. కార్తికేయ2 స్క్రిప్టు నచ్చి ఈసినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment