Naga Chaitanya Moved To His New House In Hyderabad, Do You Know First Guest - Sakshi
Sakshi News home page

Naga Chaitanya : కొత్తింట్లోకి గృహప్రవేశం చేసిన నాగచైతన్య.. ఫస్ట్‌ గెస్ట్‌ ఎవరో తెలుసా?

Published Thu, Mar 23 2023 12:45 PM | Last Updated on Thu, Mar 23 2023 1:10 PM

Naga Chaitanya Finally Moved To His New House See The First Guest - Sakshi

అక్కినేని హీరో నాగచైతన్య ఎట్టకేలకు ఓ ఇంటివాడు అయ్యాడు. సమంతతో విడిపోయిన తర్వాత ఎక్కువగా హోటల్స్‌లోనే ఉంటున్న నాగచైతన్య తాజాగా కొత్త ఇల్లు నిర్మించుకున్నాడు. ఉగాది సందర్భంగా కొత్తింట్లోకి గృహప్రవేశం చేశాడు. నాగార్జున ఇంటికి దగ్గర్లోనే ఓ స్థలం కొన్న చై తన అభిరుచికి తగ్గట్లుగా ఇంటిని డిజైన్‌ చేయించుకున్నాడట.

స్విమ్మింగ్ పూల్, అందమైన గార్డెన్, జిమ్, థియేటర్  సహా విలాసవంతంగా ఇంటిని రెడీ చేసుకొని ఎలాంటి హడావిడి, ఆర్భాటం లేకుండా కొత్త ఇంట్లోకి ప్రవేశించాడు. ఇక చైతూ ఇంట్లోకి మొదటి అతిథి మరెవరో కాదు.. ప్రేమమ్‌ సినిమాతో చైకు హిట్‌ ఇచ్చిన చందూ మొండేటి.

ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసుకున్నారు. ఉగాది రోజున యువసామ్రాట్ కొత్త ఇళ్ళు. నేనే మొదటి అతిథి.  కంగ్రాట్యూలేషన్ అండ్ థాంక్యూ నాగ చైతన్య అంటూ  చందూ మొండేటి ఓ ఫోటోను పంచుకోగా ప్రస్తుతం ఈ పిక్‌ నెట్టింట వైరల్‌గా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement