Housewarming
-
సరికొత్త ప్రయాణం : నటి హన్సిక గృహప్రవేశ వేడుక (ఫొటోలు)
-
చిన్ననాటి కల.. ఇన్నాళ్లకు నెరవేరిందన్న హీరోయిన్ (ఫోటోలు)
-
Shobha Shetty: కొత్తింటి కల సాకారం చేసుకున్న బిగ్‌బాస్ బ్యూటీ.. ప్రియుడితో గృహప్రవేశం (ఫోటోలు)
-
కొత్తింట్లోకి అడుగుపెట్టిన 'మహాతల్లి'.. ఎమోషనల్ పోస్ట్
'మహాతల్లి' జాహ్నవి నూతన ఇంట్లోకి గృహప్రవేశం చేసింది. తన భర్తతో కలిసి కొత్తింట్లో కుడికాలు పెట్టింది. డ్రీమ్ హౌస్‌లో పాలు పొంగించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ భావోద్వేగానికి లోనైంది. 'నాలుగు సంవత్సరాల క్రితం సుశాంత్, నేను కొత్తింటి కోసం వెతకడం ప్రారంభించాము. కొంతకాలానికే మాకు పర్ఫెక్ట్గా సరిపోతుందనుకునే ఇల్లు దొరికేసింది.నా వల్ల అవుతుందా?నా కుక్కపిల్లలు ఆడుకోవడానికి, అటూఇటూ పరిగెత్తడానికి అవసరమయ్యేంత పెద్ద స్థలం ఉంది. మేము ఇల్లు కొనాలని అనుకున్నప్పటి నుంచి ఎన్నోసార్లు ఇది మావల్ల అయ్యే పని కాదేమోనని మథనపడ్డాం. ఆ సమయంలో నా బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ నాకు అండగా నిలబడ్డారు. ఇప్పుడు కొత్తిల్లు సొంతమవుతుంటే అంతా ఏదో కలలా అనిపిస్తోంది' అని క్యాప్షన్‌లో రాసుకొచ్చింది. ఏప్రిల్ 19న గృహప్రవేశం చేసినట్లు పేర్కొంది. ఎవరీ జాహ్నవి?కర్నూలుకు చెందిన తెలుగమ్మాయి జాహ్నవి. నిఫ్ట్‌లో ఫ్యాషన్ టెక్నాలజీ చదివిన ఆమె మొదట్లో షార్ట్ ఫిలిం డైరెక్టర్ హరీశ్ నాగరాజుతో కలిసి కొన్ని లఘుచిత్రాలకు పని చేసింది. అలా మహాతల్లి- మహానుభావుడు అనే వెబ్‌సిరీస్‌లో నటించింది. ఇది ఎంతలా క్లిక్ అయిందంటే జాహ్నవి మహాతల్లి పేరిట సొంతంగా ఓ ఛానలే ప్రారంభించింది. వెబ్ సిరీస్‌లు చేస్తూ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ బాగా పాపులర్ అయింది.అన్ని రకాల విషయాలపై తనదైన రీతిలో వీడియోలు చేస్తూ ఉంటుంది. లై, మెంటల్ మదిలో వంటి చిత్రాల్లోనూ నటించింది. కొన్నేళ్ల క్రితం సుశాంత్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అందరిలాగే ఈ జంట కూడా సొంతిల్లు ఉండాలని కల గనేవారు. తాజాగా ఆ కలను వీరు సాకారం చేసుకోవడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Jahnavi Dasetty (@mahathalli) చదవండి: వార్ 2 కోసం జూనియర్ ఎన్టీఆర్ కసరత్తులు.. అది లీక్ చేయొద్దనే.. -
Manjula Nirupam Photos: బుల్లితెర జంట నూతన గృహప్రవేశం (ఫోటోలు)
-
కొత్తిల్లు కొన్న డాక్టర్‌బాబు.. గృహప్రవేశం ఫోటోలు వైరల్
బుల్లితెర డాక్టర్‌బాబు కొత్తిల్లు కొన్నాడు. భార్య మంజులతో కలిసి నటుడు పరిటాల నిరుపమ్ కొత్తింట్లోకి గృహప్రవేశం చేశాడు. ఈ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. డ్రీమ్ హోమ్ సాకారమైందంటూ కొన్ని ఫోటోలు పంచుకోగా అవి ప్రస్తుతం వైరల్‌గా మారాయి. శ్రీరాముడి పట్టాభిషేకం ఫోటోతో నిరుపమ్.. మంగళహారతితో మంజుల కుడికాలు పెట్టి నూతన ఇంట్లోకి అడుగుపెట్టారు. శ్రీరామనవమి రోజే నూతన ఇంట్లో పాలు పొంగించినట్లు తెలుస్తోంది. కొత్తిల్లు కొన్న ఈ జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మీరు ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షిస్తూ కామెంట్లు చేస్తున్నారు. కాగా మంజుల- నిరుపమ్ ఎన్నో ఏళ్లుగా సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్నారు. నిరుపమ్ అయితే.. కార్తీక దీపం సీరియల్‌తో బుల్లితెర హీరోగా మారిపోయాడు. తన యాక్టింగ్ స్కిల్స్‌కు అందరూ ఫిదా అయిపోయారు. ధారావాహికల ద్వారానే కాకుండా టీవీ షోలలోనూ తరచూ పాల్గొంటుంటారు. View this post on Instagram A post shared by Manjula Paritala (@paritala_manjula_official) -
Smriti Irani నూతన గృహప్రవేశ వేడుక: సాంప్రదాయ లుక్‌లో కేంద్ర మంత్రి
# Smriti Irani Performs Griha Pravesh కేంద్ర మంత్రి ,అమేథీ ఎంపీ స్మృతి ఇరానీ కొత్త ఇంట్లోకి ప్రవేశించారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో 'గృహ ప్రవేశ' వేడుకలు సాంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. స్మృతి, జుబిన్ ఇరానీతో కలిసి గురువారం అమేథీలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఉజ్జయని పూజారి ఆశిశ్ మహరాజ్ ఆధ్వర్యంలో గృహ ప్రవేశ వేడుకను నిర్వహించారు. విజయవంతమైన నటిగా , పార్లమెంటేరియన్‌గా మాత్రమేకాకుండా సోషల్ మీడియా యాక్టివ్‌గా ఉంటారు. ఈ నేపథ్యంలోనూ ఆమె తన భర్త జుబిన్ ఇరానీతో కలిసి నిర్వహించిన వేడుక ఫోటోలను షేర్ చేశారు. అందమైన మెరూన్ , పసుపు రంగు చీరలో, క్రీమ్-హ్యూడ్ కుర్తాలో జుబిన్ హుందాగా కనిపించారు. ‘‘దుర్గామాత కృప, మహదేవుడి ఆశీర్వాదంతోపాటు, పెద్దోళ్ల ఆదరణ, చిన్నోళ్ల ప్రేమ, స్నేహంతో అమేథీలో కట్టుకున్న కొత్త ఇంట్లోకి ప్రవేశించా’’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో రానున్న ఎన్నికల్లో రాహుల్ గాంధీ, స్మృతి మధ్య పోటీ పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. #WATCH | Union Minister Smriti Irani and her husband Zubin Irani perform rituals at the 'Griha Pravesh' ceremony at their residence in Amethi, Uttar Pradesh. pic.twitter.com/dN4EoBXZkX — ANI (@ANI) February 22, 2024 సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అమేథీలో ఆమె గృహ ప్రవేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల్లో తాను గెలిస్తే అమేథీని శాశ్వత ఇంటి అడ్రస్‌గా మార్చుకుంటానని స్మృతి ఇరానీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ కంచుకోట అమేథీలో తొలిసారి రాహుల్ గాంధీని ఓడించారు. అంతేకాదు ఈ వారం ప్రారంభంలో, రాబోయే ఎన్నికల్లో అమేథీ నుండి తనపై పోటీ చేయాలని స్మృతి, రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. బీజేపీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన స్మృతి 2014లో రాహుల్ గాంధీతో పోటీపడి ఓటమి పాలయ్యారు. కానీ 2004 నుంచి వరుసగా మూడు సార్లు గెలుపొందిన రాహుల్‌ని ఓడించి 2019లో సంచలన విజయం సాధించారు. 2019 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా 2021లో అమేథీ గౌరీగంజ్ తహసీల్‌లోని మావాయి గ్రామంలో 15వేల చదరపు అడుగుల స్థలం కొనుగోలు చేశారామె. 2023లో ‘కిచ్డీ భోజ్’ కార్యక్రమం నిర్వహించి స్మృతి తాజాగా గృహ ప్రవేశం నిర్వహించారు. -
ఎన్నికల తర్వాతే గృహప్రవేశం!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ స్థిరాస్తి రంగంపై పడింది. సాధారణంగా రియల్టీ మార్కెట్లో నగదు ప్రవాహమే ఎక్కువగా ఉంటుంది. ఇందులోనూ అనధికారిక లావాదేవీలే అధికం. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పోలీసు లు, ఎన్నికల సంఘం అధికారులు నగదు ప్రవాహంతోపాటు ఆన్లైన్ లావాదేవీలపై కూడా గట్టి నిఘా పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో నగదు లావాదేవీలు జరపడం శ్రేయస్కరం కాదని గృహ కొనుగోలుదారులు భావిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో నగదు తీసుకెళ్తే.. పోలీసుల తనిఖీల్లో చిక్కితే అసలుకే ఎసరొస్తుందని ఎన్నికలు పూర్తయ్యే వరకు గృహ కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నారు. దీంతో ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్లపై తీవ్ర ప్రభావం పడనుంది. అప్పటి వరకూ ఎదురుచూపులే.. సామాన్య, మధ్యతరగతి ప్రజలు పొదుపు చేసిన డబ్బుతో ప్లాట్లు, అపార్ట్మెంట్లు కొనుగోలు చేస్తుంటారు. చాలా తక్కువ మొత్తానికి గృహ రుణం కోసం బ్యాంకులకు వెళ్తుంటారు. మరోవైపు ఆన్లైన్ ఖాతా ద్వారా నగదు లావాదేవీలు జరుపుదామంటే.. వాటిపై కూడా నిఘా పెట్టా లని ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో బ్యాంకర్లు దృష్టి పెట్టారు. దీంతో ఎన్నికలు పూర్తయ్యే వరకు గృహ ప్రవేశాలకు గడ్డుకాలమేనని చెప్పాలి. ఎన్నికలు డెవలపర్ల మీద కంటే కొనుగోలుదారులపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. ఎన్నికలకు 1–2 నెలల ముందు నుంచి, ఎన్నికలయ్యాక 2 నెలల వరకు కస్టమర్లు వేచిచూసే ధోరణిలో ఉంటారు. ఎందుకంటే కొత్త ప్రభుత్వం వస్తే కొత్త పథకాలు, రాయితీలు, పాలసీలు తమ పెట్టుబడుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయోనని కొనుగోలుదారులు వేచి చూస్తుంటారు. ముందస్తు బుకింగ్‌లు.. స్థిరాస్తి సంస్థలకు నిరంతర క్రయవిక్రయాలు జరపకపోతే సంస్థ కార్యకలాపాలు, ఉద్యోగుల జీవభత్యాలు ఇతరత్రా వ్యయాల నిర్వహణ భారంగా మారుతుంది. దీంతో పలు నిర్మాణ సంస్థలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రవాసులు, విశ్వసనీయమైన కస్టమర్లతో ముందస్తు బుకింగ్‌లు చేసుకుంటున్నారు. ఎన్నికల తర్వాత చెల్లింపులు జరిపేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. మరోవైపు ఎన్నికల సమయంలో రియల్టర్లు రాజకీయ పార్టీలకు, నాయకులకు నిధులు సమకూర్చడం సాధారణమే కానీ, ఈసారి తెలంగాణలో నెలల వ్యవధిలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు వేర్వేరుగా జరుగుతాయి. దీంతో బిల్డర్లు ఫండ్‌ను కూడా వేర్వేరుగా ఏర్పాటు చేయాల్సి వస్తుందని, ఇది డెవలపర్లకు కొంత భారమేనని ఓ డెవలపర్ అభిప్రాయపడ్డారు. -
అక్క చెల్లెమ్మల చిరకాల స్వప్నం సీఎం వైఎస్ జగన్ సాకారం
-
వైవా హర్ష గృహప్రవేశం.. అటెండ్ అయిన మెగా హీరో !
ప్రముఖ కమెడియన్, యూట్యూబర్ వైవా హర్ష కొత్తింటి కల సాకారం చేసుకున్నాడు. తాజాగా అతడు తన భార్యతో కలిసి గృహప్రవేశం చేశాడు. ఇంట్లో పాలు పొంగించి, పూజ చేసుకున్న ఫోటోలను అతడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ గృహప్రవేశానికి మెగా హీరో సాయిధరమ్ తేజ్ వచ్చి హర్షకు శుభాకాంక్షలు తెలిపాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కొత్తింట్లో అడుగుపెట్టిన హర్షకు సెలబ్రిటీలు, అభిమానులు కంగ్రాట్స్ చెప్తున్నారు. యూట్యూబర్‌గా కెరీర్ ఆరంభించిన హర్ష.. వైవా కాన్సెప్ట్‌తో వీడియో తీసి బాగా పాపులర్ అయ్యాడు. అప్పటి నుంచి అతడి పేరు వైవా హర్షగా స్థిరపడిపోయింది. అతడి ప్రతిభకు యూట్యూబ్ నుంచే కాకుండా వెండితెర నుంచి కూడా అవకాశాలు వచ్చాయి. 2014లో మై నే ప్యార్ కియాతో సినిమాలో నటించిన హర్ష కలర్ ఫోటోలో కీలక పాత్రలో నటించాడు. ఇప్పటివరకు కమెడియన్‌గా, హీరో స్నేహితుడిగా నటించిన హర్ష సుందరం మాస్టర్ సినిమాతో హీరోగా మారుతున్నాడు. ఈ చిత్రంతో కళ్యాణ్ సంతోష్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా ఆర్టీ టీమ్ వర్క్స్, గోల్డెన్ మీడియా బ్యానర్లపై రవితేజ, సుధీర్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించింది. చదవండి: 99% పక్కా అన్నారు, ఏమైందో మరి.. చివరికి నన్ను తీసేశారు.. మై విలేజ్ షో అనిల్ -
ఉదయ భాను కొత్తింటిని చూశారా?భలే రిచ్‌గా ఉందే!
బుల్లితెరపై ఎంతమంది యాంకర్లు ఉన్నా ఉదయ భానుది సెపరేట్ స్టైల్. ఒకప్పుడు స్టార్ యాంకర్‌గా రాణించిన ఉదయభాను బుల్లితెర శ్రీదేవిగా పాపులర్ అయ్యింది. అచ్చమైన తెలుగులో గలగలా మాట్లాడే ఉదయ భాను యాంకరింగ్‌కు ఇప్పటికీ ఎంతోమంది అభిమానులు ఉన్నారు.యాంకర్లలో ఎక్కువ పారితోషికం అందుకున్న యాంకర్‌గానూ ఉదయభానుకు పేరుంది. చదవండి: సోషల్ మీడియాలో మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న రష్మిక హీరోయిన్‌కు ఏమాత్రం తగ్గని అందం ఆమె సొంతం. దీనికి తోడు తనదైన స్టైల్లో హోస్టింగ్ చేసే ఉదయభాను బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా అలరించింది. అయితే పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టాక మాత్రం కనుమరుగైపోయింది. ఈమధ్యే మళ్లీ యాంకర్‌గా రీఎంట్రీ ఇచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్లు, షోలు చేస్తుంది. సొంతంగా యూట్యూబ్ ఛానెల్ కూడా నిర్వహిస్తూ తనకు సంబంధించిన పలు విషయాలను షేర్ చేస్తుంటుంది. తాజాగా కొత్త ఇంట్లోకి వెళ్లిన ఉదయభాను దీనికి సంబంధించిన హోంటూర్ వీడియోను పంచుకుంది. విశాలవంతమైన గదులతో రిచ్ లుక్‌లో ఇల్లు అదిరిపోయింది. ఇది చూసిన నెటిజన్లు ఉదయభానుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: భర్తను తలుచుకొని ఎమోషనల్ అయిన సురేఖ వాణి -
ఎట్టకేలకు ఓ ఇంటివాడైన నాగచైతన్య.. ఫోటో వైరల్
అక్కినేని హీరో నాగచైతన్య ఎట్టకేలకు ఓ ఇంటివాడు అయ్యాడు. సమంతతో విడిపోయిన తర్వాత ఎక్కువగా హోటల్స్‌లోనే ఉంటున్న నాగచైతన్య తాజాగా కొత్త ఇల్లు నిర్మించుకున్నాడు. ఉగాది సందర్భంగా కొత్తింట్లోకి గృహప్రవేశం చేశాడు. నాగార్జున ఇంటికి దగ్గర్లోనే ఓ స్థలం కొన్న చై తన అభిరుచికి తగ్గట్లుగా ఇంటిని డిజైన్ చేయించుకున్నాడట. స్విమ్మింగ్ పూల్, అందమైన గార్డెన్, జిమ్, థియేటర్ సహా విలాసవంతంగా ఇంటిని రెడీ చేసుకొని ఎలాంటి హడావిడి, ఆర్భాటం లేకుండా కొత్త ఇంట్లోకి ప్రవేశించాడు. ఇక చైతూ ఇంట్లోకి మొదటి అతిథి మరెవరో కాదు.. ప్రేమమ్ సినిమాతో చైకు హిట్ ఇచ్చిన చందూ మొండేటి. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఇన్‌స్టా వేదికగా షేర్ చేసుకున్నారు. ఉగాది రోజున యువసామ్రాట్ కొత్త ఇళ్ళు. నేనే మొదటి అతిథి. కంగ్రాట్యూలేషన్ అండ్ థాంక్యూ నాగ చైతన్య అంటూ చందూ మొండేటి ఓ ఫోటోను పంచుకోగా ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Chandoo Mondeti (@chandoo.mondeti) -
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం.. ఈ ఏడాదిశుభ ముహూర్తాలు ఇవే!
చైత్రమాసం ►22.03.23 బుధవారం, శుక్ల పాడ్యమి ఉత్తరాభాద్ర, వృషభలగ్నం, ఉ.10.02 వసంత నవరాత్రుల ప్రారంభం, కలశ స్థాపన, పంచాంగ శ్రవణం. ►26.03.23 ఆదివారం, షష్ఠి రోహిణి, మకరలగ్నం, తె.2.51 గృహారంభం. ►27.03.23 సోమవారం, షష్ఠి రోహిణి, మేషలగ్నం, ఉ.8.15 క్రయవిక్రయాలు, నూతన వస్త్ర ఆరంభము. ►29.03.23 చైత్ర శుద్ధ అష్టమి నుంచి 25.04.23 వైశాఖ శుద్ధ షష్ఠి మంగళవారం వరకు గురు మౌఢ్యమి. ►30.03.23 గురువారం, శు. నవమి పునర్వసు, మేషలగ్నం, ఉ.8.03 అన్నప్రాశన, క్రయవిక్రయాలు. ►05.04.23 బుధవారం, శు. చతుర్ధశి ఉత్తర, మేషలగ్నం ఉ.7.39 అన్నప్రాశన, క్రయవిక్రయాలు, దస్త్రం, కేశఖండన. ►06.04.23 గురువారం, పూర్ణిమ హస్త, మేషలగ్నం, ఉ.7.35 అన్నప్రాశన, క్రయవిక్రయాలు, దస్త్రం, కేశఖండన. ►07.04.23 శుక్రవారం, బ. పాడ్యమి చిత్త, మేషలగ్నం, ఉ.7.31 అన్నప్రాశన, క్రయవిక్రయాలు, దస్త్రం, కేశఖండన. ►08.04.23 శనివారం, విదియ స్వాతి, వృషభలగ్నం ఉ.8.55 అన్నప్రాశన, క్రయవిక్రయాలు, దస్త్రం, కేశఖండన. ►10.04.23 సోమవారం, చవితి అనూరాధ, మేషలగ్నం ఉ.7.20 అన్నప్రాశన, క్రయవిక్రయాలు, దసం, కేశఖండన. ►12.04.23 బుధవారం, సప్తమి మూలా, మేషలగ్నం ఉ.7.12 డోలారోహణం, అన్నప్రాశన, క్రయవిక్రయాలు, దస్త్రం, కేశఖండన. ►15.04.23 శనివారం, దశమి ధనిష్ఠ, వృషభలగ్నం ఉ.8.22 డోలారోహణం, అన్నప్రాశన, క్రయవిక్రయాలు, దస్త్రం, కేశఖండన. వైశాఖమాసం ►21.04.23 శుక్రవారం, వైశాఖ శు. విదియ భరణి, కన్యాలగ్నం సా. 4.40 వ్యాపారం, క్రయవిక్రయాలు. ►23.04.23 ఆదివారం, చవితి రోహిణి, కర్కాటకలగ్నం, ఉ.11.45 వ్యాపారం, క్రయవిక్రయాలు, అన్నప్రాశన, కేశఖండన, బారసాల. ►25.04.23 గురుమోఢ్యమి త్యాగం ►26.04.23 బుధవారం, సప్తమి పునర్వసు, కన్యాలగ్నం, సా. 4.20 వ్యాపారం, క్రయవిక్రయాలు, అన్నప్రాశన, కేశఖండన, బారసాల. ►27.04.23 గురువారం, సప్తమి పుష్యమి, వృషభలగ్నం, ఉ.7.41 వ్యాపారం, క్రయవిక్రయాలు, అన్నప్రాశన, కేశఖండన, బారసాల. ►30.04.23 ఆదివారం, దశమి మఘ, వృషభలగ్నం, ఉ.7.29 వివాహం, వ్యాపారం, క్రయవిక్రయాలు, అన్నప్రాశన, కేశఖండన, బారసాల. ►03.05.23 బుధవారం, త్రయోదశి హస్త, వృషభలగ్నం, ఉ.7.18 వివాహం, గృహారంభం, ఉపనయనం, శంకుస్థాపన. ►03.05.23 బుధవారం, చతుర్దశి చిత్త, మకరలగ్నం రా.12.22 వివాహం, గర్భాధానం. ►05.05.23 శుక్రవారం, వైశాఖ పూర్ణిమ స్వాతి, కన్యాగ్నం, మ.3.45 క్రయవిక్రయాలు, దస్త్రం. ►07.05.23 ఆదివారం, బ. విదియ అనూరాధ, వృషభలగ్నం, ఉ.7.02 వివాహం, గృహారంభం, ఉపనయనం, అన్నప్రాశన, క్రయవిక్రయాలు. ►10.05.23 బుధవారం, పంచమి పూర్వాషాఢ, వృషభలగ్నం, ఉ.6.50 క్రయవిక్రయాలు, సమస్తశుభాలు. ►10.05.23 నుంచి 28.05.23 వరకు నిజకర్తరి గృహప్రవేశం, శంకుస్థాపనలు, బోరింగ్లు నిషిద్ధం. ►11.05.23 గురువారం, షష్ఠి ఉత్తరాషాఢ, వృషభలగ్నం ఉ.6.47 అన్నప్రాశన, దేవతా ప్రతిష్ఠ, వివాహం, సమస్త శుభాలు. ►14.05.23 ఆదివారం, దశమి శతభిషం, మిథునలగ్నం, ఉ.9.24 అన్నప్రాశన, ఉపనయనం, అక్షరాభ్యాసం, వివాహం, సమస్త శుభాలు. జ్యేష్ఠమాసం ►21.05.23 ఆదివారం, శు. విదియ మృగశిర, మిథునలగ్నం ఉ.9.56 అన్నప్రాశన, ఉపనయనం, అక్షరాభ్యాసం, వివాహం, క్రయవిక్రయాలు. ►25.05.23 గురువారం, షష్ఠి పుష్యమి, మిథునలగ్నం, ఉ.8.40 అన్నప్రాశన, ఉపనయనం, అక్షరాభ్యాసం, వివాహం, క్రయవిక్రయాలు. ►26.05.23 శుక్రవారం, సప్తమి మఖ, మీనలగ్నం రా.1.52 వివాహం, గర్భాధానం, ప్రయాణాలు. ►31.05.23 బుధవారం, ఏకాదశి స్వాతి, మిథునలగ్నం, ఉ.8.16 అన్నప్రాశన, ఉపనయనం, అక్షరాభ్యాసం, శంకుస్థాపన, ప్రతిష్ఠ, గృహప్రవేశం. ఆషాఢ మాసం ►03.06.23 శనివారం, పూర్ణిమ అనూరాధ, మీనలగ్నం రా.1.20 వివాహం, గృహప్రవేశం, గర్భాధానం. ►05.06.23 సోమవారం, బ. విదియ మూల, మిథునలగ్నం, ఉ.7.20 సమస్త శుభాలు. ►07.06.23 బుధవారం, చవితి ఉత్తరాషాఢ, మిథునలగ్నం ఉ.7.49 అన్నప్రాశన, వివాహం. శ్రవణం, మీనలగ్నం, రా.1.04 వివాహం, గర్భాధానం, ప్రయాణం. ►08.06.23 గురువారం, పంచమి శ్రవణం, కన్యాలగ్నం, మ.1.30 డోలారోహణం, క్రయవిక్రయాలు. ►09.06.23 శుక్రవారం, సప్తమి శతభిషం, మీనలగ్నం, రా.12.56 వివాహం, గృహప్రవేశం. అధిక శ్రావణమాసం ►23.07.23 ఆదివారం, శు. షష్ఠి ఉత్తరా, కన్యాలగ్నం ఉ.11.50 డోలారోహణం, క్రయవిక్రయాలు, బారసాల, కేశఖండనం, ప్రయాణాలు. ►26.07.23 బుధవారం, శు. నవమి స్వాతి, వృశ్చికలగ్నం, మ.4.09 క్రయవిక్రయాలు, డోలారోహణం. ►28.07.23 శుక్రవారం, శు. దశమి అనూరాధ, కన్యాలగ్నం, ఉ.10.15 డోలారోహణం, క్రయవిక్రయాలు, బారసాల, కేశఖండనం, ప్రయాణాలు. ►30.07.23 ఆదివారం, శు. చతుర్దశి మూలా, కన్యాలగ్నం ఉ.10.07 డోలారోహణం, క్రయవిక్రయాలు, బారసాల, కేశఖండనం, ప్రయాణాలు. ►31.07.23 సోమవారం, శు. చతుర్దశి పూర్వాషాఢ, ధనుర్లగ్నం సా.5.01 క్రయవిక్రయాలు, ప్రయాణం. ►04.08.23 శుక్రవారం, బ. తదియ పూర్వాభాద్ర, ధనుర్లగ్నం సా.4.45 క్రయవిక్రయాలు, ప్రయాణం. ►05.08.23 శనివారం, బ. చవితి ఉత్తరాభాద్ర, వృశ్చికలగ్నం మ.1.30 క్రయ విక్రయాలు, ప్రయాణం. ►06.08.23 ఆదివారం, బ. పంచమి రేవతి, కన్యాలగ్నం, ఉ.11.05 నామకరణం, డోలారోహణం, క్రయవిక్రయాలు, ప్రయాణం. ►07.08.23 సోమవారం, బ. షష్ఠి అశ్వని, కన్యాలగ్నం, ఉ.10.19 నామకరణం, డోలారోహణం, క్రయవిక్రయాలు, ప్రయాణం. ►08.08.23 మంగళవారం శోభకృత్నామ సంవత్సర అధిక శ్రావణ బహుళ సప్తమి నుంచి శోభకృత్ నామ సంవత్సర నిజ శ్రావణ శుద్ధ తదియ వరకు ►19.08.2023 వరకు శుక్ర మౌఢ్యమి. నిజ శ్రావణ మాసం ►20.08.23 శుక్లపక్షం, ఆదివారం, చవితి, హస్త, వృషభలగ్నం, రా.12.08 గృహారంభం, గృహప్రవేశం, వివాహం. ►20.08.23 ఆదివారం, పంచమి చిత్త, కర్కాటకలగ్నం, రా.2.58 గృహారంభం, గృహప్రవేశం, వివాహం. ►24.08.23 గురువారం, నవమి అనూరాధ, వృషభలగ్నం, రా.3.11 వివాహం, గృహప్రవేశం. మిథునలగ్నం, రా.2.40 వివాహం, గృహప్రవేశం, గర్భాధానం. ►26.08.23 శనివారం, దశమి మూలా, వృషభలగ్నం, రా.11.45 వివాహం, గృహప్రవేం, గర్భాధానం. ►30.08.23 బుధవారం, పూర్ణిమ శతభిషం, వృషభలగ్నం, రా.11.30 వివాహం, గృహప్రవేం, గర్భాధానం. ►31.08.23 గురువారం, బ. పాడ్యమి శతభిషం, వృశ్చికలగ్నం, ఉ.11.48 రాఖీపూర్ణిమ, వివాహం, క్రయవిక్రయాలు. ►01.09.23 శుక్రవారం, బ. విదియ ఉత్తరాభాద్ర, వృషభ లగ్నం, రా.11.21 వివాహం, గర్భాధానం, గృహప్రవేశం, ప్రయాణాలు. ►02.09.23 శనివారం, బ. తదియ ఉత్తరాభాద్ర, వృశ్చికలగ్నం, ఉ.11.45 వివాహం, గృహప్రవేశం, ప్రయాణాలు. ►02.09.23 శనివారం, బ. తదియ రేవతి, వృషభలగ్నం, రా.11.18 వివాహం, గృహారంభం, గృహప్రవేశం. ►03.09.23 ఆదివారం, బ. చవితి రేవతి, వృశ్చికలగ్నం, ఉ.11.35 వివాహం, గృహారంభం, గృహప్రవేశం. ►03.09.23 ఆదివారం, బ. పంచమి అశ్వని, వృషభలగ్నం, రా.11.41 వివాహం, గృహారంభం, గృహప్రవేశం. ►04.09.23 సోమవారం, బ. పంచమి అశ్విని, వృషభలగ్నం, ఉ.9.20 క్రయవిక్రయాలు. ►06.09.23 బుధవారం, బ. అష్టమి రోహిణి, వృషభలగ్నం, రా.11.02 వివాహం, గృహారంభం, గృహప్రవేశం, గర్భాధానం. ►07.09.23 గురువారం, బ. అష్టమి రోహిణి, వృశ్చికలగ్నం, ఉ.10.21 వివాహం, గృహారంభం, గృహప్రవేశం. ►07.09.23 గురువారం, బ. నవమి మృగశిర, మిథునలగ్నం, రా.1.25 వివాహం, గృహారంభం, గృహప్రవేశం. ►10.09.23 ఆదివారం, బ. ఏకాదశి పునర్వసు, వృశ్చికలగ్నం, రా.11.09 శంకుస్థాపన, క్రయవిక్రయాలు, గృహప్రవేశం, ప్రయాణాలు. భాద్రపద మాసం ►16.09.23 శనివారం, శు. విదియ హస్త, వృశ్చికలగ్నం, ఉ.10.46 డోలారోహణం, అన్నప్రాశన, బారసాల, కేశఖండన, క్రయవిక్రయాలు. ►17.09.23 ఆదివారం, శు. తదియ చిత్త, ధనుర్లగ్నం మ.1.53 డోలారోహణం, బారసాల, కేశఖండన, క్రయవిక్రయాలు. ►18.09.23 సోమవారం, శు. తదియ చిత్త, శుభ సమయం ఉ.10.30 నుంచి వినాయక చవితి పూజ గణపతి నవరాత్రులు. ►24.09.23 ఆదివారం, శు. ఏకాదశి పూర్వాషాఢ, వృశ్చికలగ్నం,ఉ.10.30 డోలారోహణం, అన్నప్రాశన, నామకరణం, కేశఖండన, క్రయవిక్రయాలు. ►25.09.23 సోమవారం, శు. ఏకాదశి శ్రవణం, వృశ్చికలగ్నం, ఉ.11.55 డోలారోహణం, అన్నప్రాశన, నామకరణం, కేశఖండన, క్రయవిక్రయాలు. ►29.09.23 శుక్రవారం, శు. పూర్ణిమ ఉత్తరాభాద్ర, మకరలగ్నం, మ.2.36 క్రయవిక్రయాలు. ►30.09.23 నుంచి మహాలయ పక్షం/పితృపక్షం ముహూర్తాలు ఉండవు. ►14.10.23 మహాలయ అమావాస్య ఆశ్వయుజ మాసం ►15.10.23 ఆదివారం, శు. పాడ్యమి చిత్త, వృశ్చికలగ్నం, ఉ.8.50 శరన్నవరాత్రులు, కలశస్థాపన, దేవీ పూజలు. ►16.10.23 సోమవారం, శు. విదియ స్వాతి, వృశ్చికలగ్నం ఉ.8.45 అన్నప్రాశన, శంకుస్థాపన, క్రయవిక్రయాలు. ►18.10.23 బుధవారం, శు. చవితి అనూరాధ, వృశ్చికలగ్నం, ఉ.8.36 అన్నప్రాశన, శంకుస్థాపన, క్రయవిక్రయాలు ►19.10.23 గురువారం, శు. పంచమి జ్యేష్ఠ, వృశ్చికలగ్నం, ఉ.8.31 సరస్వతీ పూజ. ►21.10.23 శనివారం, శు. అష్టమి ఉత్తరాషాఢ, మిథునలగ్నం, రా.10.54 వివాహం, గృహప్రవేశం. ►22.10.23 ఆదివారం, దుర్గాష్టమి ఉత్తరాషాఢ, ధనుర్లగ్నం, ఉ.11.33 అన్నప్రాశన, శంకుస్థాపన. ►23.10.23 సోమవారం, మహర్నవమి శ్రవణం, వృశ్చికలగ్నం, ఉ.8.18 అన్నప్రాశన, శంకుస్థాపన, క్రయవిక్రయాలు. ►24.10.23 మంగళవారం, విజయదశమి ధనిష్ఠ, శుభసమయం ఉ.11.20 నుంచి 11.45 లోపు విజయ ముహూర్త కాలము. ►25.10.23 బుధవారం, ఏకాదశి శతభిషం, ధనుర్లగ్నం, ఉ.10.09 ఉపనయనం, వివాహం, శంకుస్థాపన. ►26.10.23 గురువారం, త్రయోదశి ఉత్తరాభాద్ర, మకరలగ్నం, మ.12.45 సమస్త శుభాలు. ►26.10.23 గురువారం, త్రయోదశి ఉత్తరాభాద్ర, కర్కాటకలగ్నం, రా.11.32 వివాహం, గృహప్రవేశం, గర్భాధానం. ►26.10.23 గురువారం, త్రయోదశి ఉత్తరాభాద్ర, కన్యాలగ్నం, తె.4.21 వివాహం, గృహప్రవేశం. ►28.10.23 శనివారం, అశ్వయుజ పూర్ణిమ రా.1.05 నుంచి 2.22 వరకు చంద్రగ్రహణం ►01.11.23 బుధవారం, బ. చవితి మృగశిర, వృశ్చికలగ్నం, ఉ.8.45 వివాహం, శంకుస్థాపన, గృహప్రవేశం. ►01.11.23 బుధవారం, బ, చవితి మృగశిర, మిథునలగ్నం, రా.10.12 వివాహం, శంకుస్థాపన, గృహప్రవేశం, గర్భాధానం. ►09.11.23 గురువారం, బ. ఏకాదశి ఉత్తర, వృశ్చికలగ్నం, ఉ.07.18 వివాహం, శంకుస్థాపన, గృహప్రవేశం. కార్తిక మాసం ►16.11.23 గురువారం, శు. తదియ మూలా, ధనుర్లగ్నం, ఉ.9.05 వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన. ►17.11.23 శుక్రవారం, శు. పంచమి ఉత్తరాషాఢ, తులాలగ్నం, తె.5.41 వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన. ►18.11.23 శనివారం, శు. పంచమి ఉత్తరాషాఢ, ధనుర్లగ్నం, ఉ.8.45 వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన. ►18.11.23 శని/ఆదివారం, శు. పంచమి/షష్ఠి శ్రవణం, తులాలగ్నం, తె.5.05 వివాహం, గృహప్రవేశం, శంఖుస్థాపన, అన్నప్రాశన, క్రయవిక్రయాలు. ►19.11.23 ఆదివారం, శు. సప్తమి శ్రవణం, ధనుర్లగ్నం, ఉ.9.41 వివాహం, గృహప్రవేశం. ►22.11.23 బుధవారం, శు. దశమి ఉత్తరాభాద్ర, మిథునలగ్నం, రా.8.55 వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన, గర్భాధానం. ►23.11.23 గురువారం, శు. ఏకాదశి ఉత్తరాభాద్ర, ధనుర్లగ్నం, ఉ.9.33 వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన. ►23.11.23 గురువారం, శు. ద్వాదశి రేవతి, తులాలగ్నం, తె.5.18 వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన. ►24.11.23 శుక్రవారం, శు. ద్వాదశి రేవతి, ధనుర్లగ్నం, ఉ.8.25 వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన, అన్నప్రాశన. ►24.11.23 శుక్రవారం, శు. త్రయోదశి అశ్వని, మిథునలగ్నం, రా.8.41 వివాహం, గృహప్రవేశం. ►25.11.23 శనివారం, శు. త్రయోదశి అశ్వని, ధనుర్లగ్నం, ఉ.9.25 సమస్త శుభాలు. ►29.11.23 బుధవారం, బ. విదియ మృగశిర, ధనుర్లగ్నం, ఉ.9.15 వివాహం, శంకుస్థాపన. ►01.12.23 శుక్రవారం, బ. చవితి పునర్వసు, మకరలగ్నం, ఉ.10.25 గృహారంభం. ►02.12.23 శనివారం, బ. పంచమి పుష్యమి, మకరలగ్నం, ఉ.10.21 అన్నప్రాశన, క్రయవిక్రయాలు. ►03.12.23 ఆదివారం, బ. సప్తమి మఖ, కర్కాటకలగ్నం, రా.10.09 గర్భాధానం, ప్రయాణం. ►06.12.23 బుధవారం, బ. నవమి ఉత్తర, ధనుర్లగ్నం, ఉ.8.38 వివాహం, గృహారంభం, క్రయవిక్రయాలు. ►06.12.23 బుధవారం, బ. దశమి ఉత్తర, తులాలగ్నం, తె.4.30 వివాహం, గృహారంభం, క్రయవిక్రయాలు. ►07.12.23 గురువారం, బ. ఏకాదశి హస్త, మిథునలగ్నం, రా.7.45 వివాహం, గృహారంభం, గృహప్రవేశం, క్రయవిక్రయాలు. 08.12.23 శుక్రవారం, బ. ఏకాదశి చిత్త, మిథునలగ్నం, రా.7.41 వివాహం, గృహారంభం, గృహప్రవేశం, క్రయవిక్రయాలు. మార్గశిర మాసం ►15.12.23 శుక్రవారం, శు. చవితి ఉత్తరాషాఢ, తులాలగ్నం, తె.3.56 వివాహం, గృహారంభం, గృహప్రవేశం. ►20.12.23 బుధవారం, అష్టమి ఉత్తరాభాద్ర, మకరలగ్నం, ఉ.9.13 అన్నప్రాశన, వివాహం. ►20.12.23 బుధవారం, నవమి రేవతి, తులాలగ్నం, తె.3.38 వివాహం, ప్రయాణం. ►21.12.23 గురువారం, దశమి అశ్విని, తులాలగ్నం, తె.3.29 గృహారంభం ►28.12.23 గురువారం, బ. విదియ పునర్వసు, మకరలగ్నం, ఉ.8.42 గృహారంభం. ►03.01.24 బుధవారం, సప్తమి ఉత్తర, మకరలగ్నం, ఉ.8.06 అన్నప్రాశన, వివాహం, గృహారంభం. ►03.01.24 బుధవారం, సప్తమి హస్త, వృశ్చికలగ్నం తె.3.36 వివాహం, గృహారంభం. ►04.01.24 గురువారం, అష్టమి హస్త, మకరలగ్నం, ఉ.8.12 అన్నప్రాశన, వివాహం, గృహారంభం. ►05.01.24 శుక్రవారం, దశమి స్వాతి, తులాలగ్నం, రా.2.29 ప్రయాణాలు. పుష్యమాసం ►13.01.24 శనివారం, శు. విదియ శ్రవణం ఉ.11.45 డోలారోహణం, బారసాల. ►15.01.24 సోమవారం, పంచమి శతభిషం ఉ.10.09 మకర సంక్రమణం ►18.01.24 గురువారం, అష్టమి అశ్విని ఉ.10.15 బారసాల, డోలారోహణం, అన్నప్రాశన. ►21.01.24 ఆదివారం, ఏకాదశి మృగశిర, ఉ.9.45 బారసాల, డోలారోహణం, అన్నప్రాశన. ►25.01.24 గురువారం, పూర్ణిమ పునర్వసు ఉ.8.35 బారసాల, డోలారోహణం, అన్నప్రాశన. ►02.02.24 శుక్రవారం, బ.సప్తమి స్వాతి ఉ.9.15 బారసాల, డోలారోహణం, అన్నప్రాçశన. ►05.02.24 సోమవారం, దశమి అనూరాధ ఉ.7.35 బారసాల, డోలారోహణం, అన్నప్రాశన. మాఘ మాసం ►14.02.24 బుధవారం, శు. షష్ఠి అశ్విని, ధనుర్లగ్నం తె.3.54 వివాహం, గృహారంభం. ►17.02.24 శనివారం, నవమి రోహిణి, తులాలగ్నం, రా.11.40 వివాహం, గర్భాధానం. ►18.02.24 ఆదివారం, నవమి రోహిణి, మేషలగ్నం, ఉ.10.43 వివాహం, గృహారంభం. ►19.02.24 సోమవారం, దశమి మృగశిర, మేషలగ్నం, ఉ.10.39 ఉపనయనం, అక్షరాభ్యాసం, గృహారంభం. ►21.02.24 బుధవారం, త్రయోదశి పుష్యమి, తులాలగ్నం, రా.11.21 గర్భాధానం. ►24.02.24 శనివారం, పూర్ణిమ మఖ, వృషభలగ్నం ఉ.11.45 వివాహం. ►25.02.24 ఆదివారం, బ. పాడ్యమి ఉత్తర, ధనుర్లగ్నం తె.3.14 గృహారంభం, గృహప్రవేశం, ప్రయాణాలు. ►28.02.24 బుధవారం, చవితి చిత్త, వృశ్చికలగ్నం రా.11.51 వివాహం, గృహప్రవేశం. ►02.03.24 శనివారం, సప్తమి అనూరాధ, ధనుర్లగ్నం, రా.2.49 వివాహం, గృహప్రవేశం. ఫాల్గుణ మాసం ►15.03.24 శుక్రవారం, శు.షష్ఠి రోహిణి, ధనుర్లగ్నం, రా.1.55 వివాహం, గృహప్రవేశం, ప్రయాణాలు. ►17.03.24 ఆదివారం, అష్టమి మృగశిర, వృషభలగ్నం ఉ.10.20 వివాహం, గృహారంభం, గృహప్రవేశం. ►20.03.24 బుధవారం, ఏకాదశి పుష్యమి, వృషభలగ్నం ఉ.10.06 ఉపనయనం, ప్రతిష్ఠ, అక్షరాభ్యాసం. ►20.03.24 బుధవారం, ఏకాదశి పుష్యమి, తులాలగ్నం, రా.9.45 గర్భాధానం, ప్రయాణాలు. ►22.03.24 శుక్రవారం, త్రయోదశి మఖ, తులాలగ్నం, రా.9.23 వివాహం. ►22.03.24 శుక్రవారం, త్రయోదశి మఖ, ధనురలగ్నం, రా.1.31 వివాహం, గృహప్రవేశం. ►24.03.24 ఆదివారం, పూర్ణిమ ఉత్తర, వృషభలగ్నం, ఉ.9.51 వివాహం, గృహప్రవేశం, సకల శుభాలు. ►25.03.24 సోమవారం, పూర్ణిమ ఉత్తర, మేషలగ్నం, ఉ.8.19 వివాహం, గృహప్రవేశం, సకల శుభాలు. ►27.03.24 బుధవారం, బ. విదియ చిత్త, మేషలగ్నం, ఉ.8.15 ఉపనయనం, ప్రతిష్ఠ, గృహారంభం. ►27.03.24 బుధవారం, తదియ స్వాతి, ధనుర్లగ్నం, రా.1.17 వివాహం, ప్రయాణాలు. ►30.03.24 శనివారం, పంచమి అనూరాధ, వృషభలగ్నం, ఉ.9.27 ఉపనయనం, ప్రతిష్ఠ. ►01.04.24 సోమవారం, సప్తమి మూలా, మేషలగ్నం, ఉ.7.51 అక్షరాభ్యాసం. ►03.04.24 బుధవారం, నవమి ఉత్తరాషాఢ, వృషభలగ్నం ఉ.9.11 అన్నప్రాశన, ఉపనయనం, వివాహం. ►03.04.24 బుధవారం, దశమి శ్రవణం, తులాలగ్నం రా.8.35 వివాహం, గర్భాధానం. ►04.03.24 గురువారం, ఏకాదశి ధనిష్ఠ, ధనుర్లగ్నం, రా.12.41 వివాహం, గృహప్రవేశం. -
చెన్నైలో లగ్జరీ ఇల్లు కట్టిన ధనుష్.. ఎన్ని కోట్లో తెలుసా?
సార్ సినిమాతో మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నాడు స్టార్ హీరో ధనుష్. ఇకపోతే ధనుష్ కొత్తింటి కోసం కలలు కంటున్నట్లు గతేడాది వార్తలు వచ్చాయి. చెన్నైలో ఓ విలాసవంతమైన ఇంటిని నిర్మిస్తున్నాడని, ఇందుకోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నాడని ఊహాగానాలు వెలువడ్డాయి. తాజాగా ఇదే నిజమైంది. చెన్నైలోని పోయిస్ గార్డెన్లో లగ్జరీ ఇంటిని నిర్మించాడు ధనుష్. దీని విలువ దాదాపు రూ.150 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఇటీవలే ధనుష్ తన పేరెంట్స్‌తో కలిసి గృహప్రవేశం కూడా పూర్తి చేశాడు. ఇక ఈ ఇంటిని తన తల్లిదండ్రులకు గిఫ్ట్ ఇచ్చినట్లు భోగట్టా. ప్రస్తుతం ఈ గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఫోటోల్లో ధనుష్, తల్లిదండ్రులతో పాటు అతడి స్నేహితులు కూడా ఉన్నారు. దర్శకుడు సుబ్రహ్మణ్యం శివ ఈ కొత్తింటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 'ధనుష్ ఇల్లు దేవాలయంలా ఉంది. తల్లిదండ్రులను బతికి ఉన్నప్పుడే స్వర్గంలో నివసించేలా చేసి వారిని దేవుళ్లలా కొలుస్తున్నాడు. గ్రేట్' అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. மனிதன் என்பவன் தெய்வம் ஆகலாம்.. நன்றி சார்..😊🙏🏻 2023's Best Moment ❤️ Thank you @dhanushkraja #SIR !! #Mahashivratri special time with #Dhanush sir❤️💙 🙏 #vaathi pic.twitter.com/Um51eFa3iw — B.RAJA (@B_RajaAIDFC) February 20, 2023 -
మాట తప్పని కౌశల్.. తండ్రికి ఊహించని సర్ప్రైజ్!
బిగ్‌బాస్ విన్నర్, నటుడు కౌశల్ మండా తన తండ్రికి మర్చిపోలేని బహుమతి ఇచ్చాడు. ఓ కొత్త ఫ్లాట్‌ను ఆయనకు గిఫ్ట్‌గా ఇచ్చాడు. తండ్రికి ఒక్కమాట కూడా చెప్పకుండా ఆ కొత్తింటికి ఆయన్ను తీసుకువచ్చి ఇదే నీ ఇల్లు డాడీ అంటూ సర్ప్రైజ్ చేశాడు. ఊహించని సర్ప్రైజ్తో కౌశల్ తండ్రి ఆనందాశ్చర్యంలో తేలిపోయాడు. కాగా 2021లో ఫాదర్స్ డే రోజు కౌశల్ తండ్రి నాకంటూ ఓ చిన్ని ఇల్లు కావాలి అని అడిగాడు. అప్పటినుంచి అదే మనసులో పెట్టుకున్న నటుడు ఎట్టకేలకు ఈ ఏడాది హైదరాబాద్‌లో ఆయనకు ఓ ఇల్లు కొనిచ్చాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఫైనల్‌గా నా బాధ్యత తీరిపోయింది. నాన్న వైజాగ్‌లో ఇల్లు కావాలని అడిగాడు. కానీ నాన్న హైదరాబాద్‌లోనే ఉంటున్నారు కాబట్టి ఇక్కడే సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నాను. 2023 ప్రారంభంలోనే ఇల్లు కొనేశాను. ఆయనకు ఇది గిఫ్ట్‌గా ఇచ్చాను' అని చెప్పుకొచ్చాడు. ఈ గుడ్‌న్యూస్‌ను అభిమానులతో పంచుకుంటూ గృహప్రవేశం వీడియోను షేర్ చేశాడు. ఇది చూసిన అభిమానులు 'తండ్రి కల నెరవేర్చావు, గ్రేట్', 'మాట మీద నిలబడ్డావన్నా' అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
ఘనంగా సింగర్ లిప్సిక గృహప్రవేశం వేడుక.. ఫొటోలు వైరల్
-
సింగర్ లిప్సిక గృహప్రవేశం, ఫోటోలు వైరల్
కుమారి 21 ఎఫ్ చిత్రంతో తన గొంతుతో ప్రేక్షకులకు దగ్గరైన సింగర్ లిప్సిక. గాయనిగానే కాదు డబ్బింగ్ ఆర్టిస్టుగానూ రాణిస్తోంది. తాజాగా లిప్సిక సొంతింటి కలను సాకారం చేసుకుంది. నూతన గృహంలో పాలు పొంగించింది. గృహప్రవేశాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు ఈ వేడుకకు బంధుమిత్రులను ఆహ్వానించింది. తన గృహప్రవేశం ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి. భర్తతో కలిసి ఇంట్లో కుడికాలు పెట్టిన ఫోటోలను, పూజ చేసిన పిక్స్‌ను సైతం షేర్ చేసింది. ఇవి చూసిన అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇక లిప్సిక పాటల విషయానికి వస్తే ఎంబీఏ పూర్తి చేసిన ఆమె గాయనిగా సినీ కెరీర్ ప్రారంభించింది. మేం వయసుకు వచ్చాం సినిమాతో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ మారింది. హెబ్బా పటేల్, మెహరీన్, మేఘా ఆకాశ్ వంటి హీరోయిన్స్‌కు డబ్బింగ్ చెప్తూ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ దూసుకుపోతోంది. View this post on Instagram A post shared by Sah Events (@sahevents) చదవండి: అఫీషియల్.. అప్పటినుంచే ఓటీటీలో అందుబాటులోకి వారసుడు -
వివాహం, గృహప్రవేశం.. ఇంకా ఈ ఏడాది ముహూర్తాలు ఇవే!
క్యాలెండర్- 2023: ముహూర్తాలు ఇవే మాఘమాసం 14.01.23 శనివారం.. సప్తమి, హస్త, మీనలగ్నం ఉ. 10.46 ని.లకు క్రయవిక్రయ, వ్యాపారాదుల, అక్షరాభ్యాసం, అన్నప్రాసన, విద్యారంభం. 26.01.23 గురువారం.. పంచమి, ఉత్తరాభాద్ర, మీనలగ్నం ఉ. 9.32 ని.లకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం, వ్యాపారం, క్రయవిక్రయాలు, ఉపనయనం, వివాహం, గృహారంభం, గృహప్రవేశం. మిథునలగ్నం సా. 4.18 ని.లకు వ్యాపారం, క్రయవిక్రయాలు. 28.01.23 శనివారం.. సప్తమి, అశ్విని, మీనలగ్నం, ఉ. 5.16 ని.లకు ఉపనయనం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, వివాహం, శంఖుస్థాపన. 05.02.23 ఆదివారం.. పౌర్ణమి, పుష్యమి, మీనలగ్నం ఉ. 9.26 ని.లకు వ్యాపారాదులు, క్రయవిక్రయాదులు, ఉపనయనం, దేవతాప్రతిష్ఠ, మంత్రోపదేశం. ఫాల్గుణ మాసం 24.02.23 శుక్రవారం.. పంచమి, అశ్విని, మీనలగ్నం ఉ. 7.26 ని.కు వ్యాపారాదులు, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, ఉపనయనం, దేవతాప్రతిష్ఠ, వివాహం, శంఖుస్థాపన, గృహప్రవేశం. కన్యాలగ్నం రా. 8.32 ని.లకు గృహప్రవేశం, వివాహం, గర్భాదానం. ధనుర్లగ్నం తె. 3.22 ని.లకు వివాహం, గృహప్రవేశం. 11.03.23 శనివారం.. బ. పంచమి, స్వాతి, ధనుర్లగ్నం రా. 2.25 ని.లకు వివాహం, గృహప్రవేశం. మకరలగ్నం తె.3.23 ని.లకు గృహప్రవేశం, గృహారంభం, వివాహం. 18.03.23 శనివారం.. ఏకాదశి, శ్రవణం, మకర లగ్నం, తె.3.22 వివాహం, గృహప్రవేశం, గృహారంభం, బోరింగ్. చైత్ర మాసం 22.03.23 బుధవారం.. శు. పాడ్యమి, ఉత్తరాభాద్ర, వృషభలగ్నం, ఉ.10.02 వసంత నవరాత్రుల ప్రారంభం, కలశ స్థాపన, పంచాంగ శ్రవణం 29.03.23 నుండి చైత్ర శుద్ధ అష్టమి నుండి 25.04.23 వైశాఖ శుద్ధ షష్ఠి మంగళవారం వరకు గురుమౌఢ్యమి. 05.04.23 బుధవారం.. శు. చతుర్ధశి, ఉత్తరా, మేషలగ్నంష ఉ.7.39 ని.లకు అన్నప్రాసన, క్రయవిక్రయాలు, దస్త్రము, కేశఖండన. 07.04.23 శుక్రవారం.. బ. పాడ్యమి, చిత్తా, మేషలగ్నం, ఉ.7.31 ని.లకు అన్నప్రాసన, క్రయవిక్రయాలు, దస్త్రము, కేశఖండన. 08.04.23 శనివారం.. విదియ, స్వాతి, వృషభలగ్నం ఉ.8.55 ని.లకు అన్నప్రాసన, క్రయవిక్రయాలు, దస్త్రము, కేశఖండన. 12.04.23 బుధవారం.. సప్తమి, మూలా, మేషలగ్నం ఉ.7.12 ని.లకు డోలారోహణం, అన్నప్రాసన, క్రయవిక్రయాలు, దస్త్రము, కేశఖండన. 15.04.23 శనివారం.. దశమి, ధనిష్ఠ, వృషభలగ్నం ఉ.8.22 ని.లకు డోలారోహణం, అన్నప్రాసన, క్రయవిక్రయాలు, దస్త్రము, కేశఖండన. వైశాఖ మాసం 23.04.23 ఆదివారం.. చవితి, రోహిణి, కర్కాటక లగ్నం, ఉ.11.45 ని.లకు వ్యాపారం, క్రయవిక్రయాలు, అన్నప్రాసన, కేశఖండన, బారసాల. 25.04.23 గురుమోఢ్యమి త్యాగం 03.05.23 బుధవారం.. త్రయోదశి, హస్త, వృషభలగ్నం, ఉ.7.18 ని.లకు వివాహం, గృహారంభం, ఉపనయనం, శంఖుస్థాపన. 07.05.23 ఆదివారం.. బ. విదియ, అనూరాధ, వృషభలగ్నం, ఉ.7.02 వివాహం, గృహారంభం, ఉపనయనం, అన్నప్రాసన, క్రయవిక్రయాలు. 10.05.23 నుండి 28.05.23 వరకు నిజకర్తరి గృహప్రవేశం, శంఖుస్థాపనలు, బోరింగ్లు ఉండవు. 11.05.23 గురువారం.. షష్ఠి, ఉత్తరాషాఢ, వృషభలగ్నం ఉ.6.47 ని.లకు అన్నప్రాసన, దేవతా ప్రతిష్ఠ, వివాహం, సమస్త శుభాలు. జ్యేష్ఠ మాసం 25.05.23 గురువారం.. షష్ఠి, పుష్యమి, మిథున లగ్నం, ఉ.8.40 ని.లకు అన్నప్రాసన, ఉపనయనం, అక్షరాభ్యాసం, వివాహం, క్రయవిక్రయాలు. 31.05.23 బుధవారం.. ఏకాదశి, చిత్తా, మిథున లగ్నం, ఉ.8.16 ని.లకు అన్నప్రాసన, ఉపనయనం, అక్షరాభ్యాసం, శంఖుస్థాపన, ప్రతిష్ఠ, గృహప్రవేశం. 07.06.23 బుధవారం.. చవితి, ఉత్తరాషాఢ, మిథున లగ్నం ఉ.7.49 ని.లకు అన్నప్రాసన, వివాహం. శ్రవణం, మీనలగ్నం, రా.1.04 ని.లకు వివాహం, గర్భాదానం, ప్రయాణం. 09.06.23 శుక్రవారం.. సప్తమి, శతభిషం, మీనలగ్నం, రా.12.56 ని.లకు వివాహం, గృహప్రవేశం. అధిక శ్రావణ మాసం 23.07.23 ఆదివారం.. శు. షష్ఠి, ఉత్తరా, కన్యాలగ్నం ఉ.10.34 ని.లకు డోలారోహణం, క్రయవిక్రయాలు, బారసాల, కేశఖండనం, ప్రయాణాలు. 30.07.23 ఆదివారం.. శు. త్రయోదశి, మూలా, కన్యాలగ్నం ఉ.10.07 ని.లకు డోలారోహణం, క్రయవిక్రయాలు,బారసాల, కేశఖండనం, ప్రయాణాలు. 06.08.23 ఆదివారం.. బ. పంచమి, రేవతి, కన్యాలగ్నం, ఉ.9.35 ని.లకు నామకరణం, డోలారోహణం, క్రయవిక్రయాలు, ప్రయాణం. 08.08.23 మంగళవారం.. శోభకృత్ నామ సంవత్సర అధిక శ్రావణ బహుళ సప్తమి నుండి శోభకృత్ నామ సం.ర నిజ శ్రావణ శుద్ధ తదియ వరకు 19.08.2023 వరకు శుక్ర మౌఢ్యమి. నిజ శ్రావణ మాసం 20.08.23 శుక్లపక్షము ఆదివారం.. చవితి, హస్త, వృషభలగ్నం, రా.12.08 ని.లకు గృహారంభం, గృహప్రవేశం, వివాహం. 24.08.23 గురువారం.. నవమి, అనూరాధ, వృషభలగ్నం, రా.3.11 ని.లకు వివాహం, గృహప్రవేశం, గర్భాదానం. మిథునలగ్నం, రా.12.40 ని.లకు వివాహం, గృహప్రవేశం, గర్భాదానం. 30.08.23 బుధవారం.. పూర్ణిమ, శతభిషం, వృషభలగ్నం, రా.11.30 ని.లకు వివాహం, గృహప్రవేశం, గర్భాదానం. 01.09.23 శుక్రవారం.. బ. విదియ, ఉత్తరాభాద్ర, వృషభ లగ్నం, రా.11.21 ని.లకు వివాహం, గర్భాదానం, గృహప్రవేశం, ప్రయాణాలు. 06.09.23 బుధవారం.. బ. అష్టమి, రోహిణి, వృషభలగ్నం, రా.11.02 ని.లకు వివాహం, గృహారంభం, గృహప్రవేశం, గర్భాదానం, 10.09.23 ఆదివారం.. బ. ఏకాదశి, పునర్వసు, వృశ్చికలగ్నం, రా.11.09 ని.లకు శంఖుస్థాపన, క్రయవిక్రయాలు, భాద్రపద మాసం 17.09.23 ఆదివారం.. శు. తదియ, చిత్త, ధనుర్లగ్నం మ.1.53 ని.లకు డోలారోహణం, బారసాల, కేశఖండన, క్రయవిక్రయాలు. 24.09.23 ఆదివారం.. శు. దశమి పూర్వాషాఢ వృశ్చికలగ్నం, ఉ.10.30 ని.లకు డోలారోహణం, అన్నప్రాసన, నామకరణం, కేశఖండన, క్రయవిక్రయాలు. 25.09.23 సోమవారం.. శు. ఏకాదశి, శ్రవణం, వృశ్చికలగ్నం, ఉ.11.55 ని.లకు డోలారోహణం, అన్నప్రాసన, నామకరణం, కేశఖండన, క్రయవిక్రయాలు. 30.09.23 నుండి 14.10.23 వరకు మహాలయ పక్షములు పితృపక్షాలు ముహూర్తాలు ఉండవు. (14.10.23 మహాలయ అమావాస్య) ఆశ్వయుజ మాసం 15.10.23 ఆదివారం.. శు. పాడ్యమి, చిత్త, వృశ్చిక లగ్నం, ఉ.8.50 ని.లకు శరన్నవరాత్రులు, కలశస్థాపన, దేవి పూజలు. 19.10.23 గురువారం.. శు. పంచమి, జ్యేష్ఠ, వృశ్చికలగ్నం, ఉ.8.31 ని.లకు సరస్వతీ పూజ. 21.10.23 శనివారం.. శు. అష్టమి, ఉత్తరాషాఢ, మిథునలగ్నం, రా.10.54 ని.లకు వివాహం, గృహప్రవేశం 24.10.23 మంగళవారం.. విజయదశమి, ధనిష్ఠ, శుభసమయం ఉ.11.20 నుండి 11.45 ని.ల లోపు విజయ ముహూర్త కాలము. 26.10.23 గురువారం.. త్రయోదశి, ఉత్తరాభాద్ర, మకరలగ్నం, మ.12.45 ని.లకు సమస్త శుభాలు 26.10.23 గురువారం.. త్రయోదశి, ఉత్తరాభాద్ర, కర్కాటకలగ్నం, రా.11.32 ని.లకు వివాహం, గృహప్రవేశం, గర్భాదానం, 01.11.23 బుధవారం.. బ. చవితి, మృగశిర, వృశ్చికలగ్నం, ఉ.8.45 ని.లకు వివాహం, శంఖుస్థాపన, గృహప్రవేశం. 09.11.23 గురువారం.. బ. ఏకాదశి, ఉత్తరా, వృశ్చికలగ్నం, ఉ.07.18 ని.లకు వివాహం, శంఖుస్థాపన, గృహప్రవేశం, గర్భాదానం. కార్తీక మాసం 18.11.23 శనివారం.. శు. పంచమి, ఉత్తరాషాఢ, ధనుర్లగ్నం, ఉ.8.45 ని.లకు వాహం, గృహప్రవేశం, శంఖుస్థాపన 19.11.23 ఆదివారం.. శు. సప్తమి, శ్రవణం, ధనుర్లగ్నం, ఉ.9.41 ని.లకు వివాహం, గృహప్రవేశం, గర్భాదానం. 23.11.23 గురువారం.. శు. ఏకాదశి, ఉత్తరాభాద్ర, ధనుర్లగ్నం, ఉ.9.41 ని.లకు వివాహం, గృహప్రవేశం, శంఖుస్థాపన, గర్భాదానం. 24.11.23 శుక్రవారం.. శు. త్రయోదశి, అశ్విని, మిథునలగ్నం, రా.8.41 ని.లకు వివాహం, గృహప్రవేశం. 29.11.23 బుధవారం.. బ. విదియ,మృగశిర, ధనుర్లగ్నం, ఉ.9.15 ని.లకు వివాహం, శంఖుస్థాపన. 01.12.23 శుక్రవారం.. బ. చవితి, పునర్వసు, మకరలగ్నం, ఉ.10.25 ని.లకు గృహారంభం. 02.12.23 శనివారం.. బ. పంచమి, పుష్యమి, మకరలగ్నం, ఉ.10.21 ని.లకు అన్నప్రాసన, క్రయవిక్రయాలు 03.12.23 ఆదివారం.. బ. సప్తమి, మఖ, కర్కాటకలగ్నం, రా.10.09 ని.లకు గర్భాదానం, ప్రయాణం. 06.12.23 బుధవారం.. బ. నవమి, ఉత్తర, ధనుర్లగ్నం, ఉ.8.38 ని.లకు వివాహం, గృహారంభం, క్రయవిక్రయాలు. 07.12.23 గురువారం.. బ. దశమి, హస్త, మిథునలగ్నం, రా.7.45 ని.లకు వివాహం, గృహారంభం, గృహప్రవేశం, క్రయవిక్రయాలు 08.12.23 శుక్రవారం.. బ. ఏకాదశి, చిత్త, మిథునలగ్నం, రా.7.41 ని.లకు వివాహం, గృహారంభం, గృహప్రవేశం, క్రయవిక్రయాలు. -సంగ్రహణ: సాక్షి క్యాలెండర్ 2023 -
యాంకర్ శ్రీముఖి కొత్త ఇంటి గృహప్రవేశం.. ఫోటోలు వైరల్
యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. బుల్లితెరపై టాప్ యాంకర్లలో శ్రీముఖి ఒకరు. అందంతో పాటు చలాకీతనంతో స్టార్ యాంకర్‌గా దూసుకుపోతుంది. ఈ మధ్యకాలంలో ఏ షో చూసినా హోస్ట్‌గా ఎక్కువగా శ్రీముఖినే కనిపిస్తుంది. పలు టీవీ ఛానెళ్లలో తనదైన యాంకరింగ్‌తో ఆకటుకుంటున్న శ్రీముఖికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. బిగ్‌బాస్ సీజన్-3లో పాల్గొని మరింత పాపులారిటీ దక్కించుకున్న శ్రీముఖి తాజాగా కొత్త ఇల్లు కొనుగోలు చేసింది. కుటుంబసభ్యులతో కలిసి గృహప్రవేశం చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకోవడంతో ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక ఓవైపు యాంకరింగ్‌గా కొనసాగుతూనే మరోవైపు వెండితెరపై కూడా సందడి చేస్తున్న శ్రీముఖి ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో నటిస్తుంది. View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) -
కొత్త ఇల్లు కొన్న దీప్తి సునయన.. ఫోటోలు వైరల్
యూట్యూబ్ స్టార్ దీప్తి సునయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. డ్యాన్స్ వీడియోలతో పాపులర్ అయిన దీప్తి సునయన కవర్ సాంగ్స్, ప్రైవేట్ ఆల్భమ్స్‌తో మరింత గుర్తింపు సంపాదించుకుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న దీప్తి సునయన బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక షన్నూతో బ్రేకప్ చెప్పేసిన సంగతి తెలిసిందే. దీంతో మళ్లీ వీరిద్దరూ కలిస్తే బాగుండు అని ఫ్యాన్స్ తెగ కోరుకుంటున్నారు. కానీ దీప్తి-షన్నూలు ఆ విషయంలో వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఇదిలా ఉండగా దీప్తి సునయన తాజాగా కొత్త ఇల్లు కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో పలువురు నెటిజన్లు ఆమెకు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన షణ్ముక్.. ఆమెతో కలిసి గృహప్రవేశం
Shanmukh Jaswanth New House Warming Celebrations: యూట్యూబ్ స్టార్ షణ్ముక్ జస్వంత్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ ఫాలోయింగ్తోనే బిగ్‌బాస్ సీజన్-5లో ఎంట్రీ ఇచ్చాడు. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగినా రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా షణ్ముక్ హైదరాబాద్‌లో ఓ కొత్త ఇల్లు కొనుకున్నాడు.దీనికి సంబంధించి గృహప్రవేశాన్ని సైతం పూర్తి చేశాడు. నటి, చాయ్ బిస్కెట్ ఫేం శ్రీ విద్యతో కలిసి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టాడు. చదవండి: నటి, ఎమ్మెల్యే రోజా హోంటూర్.. అచ్చంగా ఇంద్రభవనమే దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. దీంతో షణ్నూకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త ఇంటితో పాటు కొత్త లక్ష్యాలతో జీవితంలో ముందుకు పయనించాలంటూ షణ్నూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇటీవలె దీప్తి సునయనతో బ్రేకప్ అనంతరం కెరీర్‌పై ఫుల్ ఫోకస్‌తో ముందుకు వెళుతున్న షణ్నూ త్వరలోనే ఓ వెబ్‌సిరీస్‌తో ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సిరీస్ త్వరలోనే రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by @software_devlovepers_official