
సార్ సినిమాతో మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నాడు స్టార్ హీరో ధనుష్. ఇకపోతే ధనుష్ కొత్తింటి కోసం కలలు కంటున్నట్లు గతేడాది వార్తలు వచ్చాయి. చెన్నైలో ఓ విలాసవంతమైన ఇంటిని నిర్మిస్తున్నాడని, ఇందుకోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నాడని ఊహాగానాలు వెలువడ్డాయి. తాజాగా ఇదే నిజమైంది. చెన్నైలోని పోయిస్ గార్డెన్‌లో లగ్జరీ ఇంటిని నిర్మించాడు ధనుష్. దీని విలువ దాదాపు రూ.150 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఇటీవలే ధనుష్ తన పేరెంట్స్‌తో కలిసి గృహప్రవేశం కూడా పూర్తి చేశాడు.
ఇక ఈ ఇంటిని తన తల్లిదండ్రులకు గిఫ్ట్ ఇచ్చినట్లు భోగట్టా. ప్రస్తుతం ఈ గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఫోటోల్లో ధనుష్, తల్లిదండ్రులతో పాటు అతడి స్నేహితులు కూడా ఉన్నారు. దర్శకుడు సుబ్రహ్మణ్యం శివ ఈ కొత్తింటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 'ధనుష్ ఇల్లు దేవాలయంలా ఉంది. తల్లిదండ్రులను బతికి ఉన్నప్పుడే స్వర్గంలో నివసించేలా చేసి వారిని దేవుళ్లలా కొలుస్తున్నాడు. గ్రేట్' అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు.
மனிதன் என்பவன்
— B.RAJA (@B_RajaAIDFC) February 20, 2023
தெய்வம் ஆகலாம்..
நன்றி சார்..😊🙏🏻
2023's Best Moment ❤️ Thank you @dhanushkraja #SIR !! #Mahashivratri special time with #Dhanush sir❤️💙 🙏 #vaathi pic.twitter.com/Um51eFa3iw
Comments
Please login to add a commentAdd a comment