కొత్తింట్లోకి అడుగుపెట్టిన 'మహాతల్లి'.. ఎమోషనల్‌ పోస్ట్‌ | Mahathalli Jahnavi Dasetty New House Warming Ceremony | Sakshi
Sakshi News home page

Jahnavi Dasetty: గృహప్రవేశం.. భర్తతో పూజ చేసిన మహాతల్లి..

Apr 26 2024 12:29 PM | Updated on Apr 26 2024 12:29 PM

Mahathalli Jahnavi Dasetty New House Warming Ceremony

నాలుగు సంవత్సరాల క్రితం సుశాంత్‌, నేను కొత్తింటి కోసం వెతకడం ప్రారంభించాము. కొంతకాలానికే మాకు పర్ఫెక్ట్‌గా సరిపోతుందనుకునే ఇల్లు దొరికేసింది. నా కుక్క

'మహాతల్లి' జాహ్నవి నూతన ఇంట్లోకి గృహప్రవేశం చేసింది. తన భర్తతో కలిసి కొత్తింట్లో కుడికాలు పెట్టింది. డ్రీమ్‌ హౌస్‌లో పాలు పొంగించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ భావోద్వేగానికి లోనైంది. 'నాలుగు సంవత్సరాల క్రితం సుశాంత్‌, నేను కొత్తింటి కోసం వెతకడం ప్రారంభించాము. కొంతకాలానికే మాకు పర్ఫెక్ట్‌గా సరిపోతుందనుకునే ఇల్లు దొరికేసింది.

నా వల్ల అవుతుందా?
నా కుక్కపిల్లలు ఆడుకోవడానికి, అటూఇటూ పరిగెత్తడానికి అవసరమయ్యేంత పెద్ద స్థలం ఉంది. మేము ఇల్లు కొనాలని అనుకున్నప్పటి నుంచి ఎన్నోసార్లు ఇది మావల్ల అయ్యే పని కాదేమోనని మథనపడ్డాం. ఆ సమయంలో నా బ్యూటిఫుల్‌ ఫ్రెండ్స్‌ నాకు అండగా నిలబడ్డారు. ఇప్పుడు కొత్తిల్లు సొంతమవుతుంటే అంతా ఏదో కలలా అనిపిస్తోంది' అని క్యాప్షన్‌లో రాసుకొచ్చింది. ఏప్రిల్‌ 19న గృహప్రవేశం చేసినట్లు పేర్కొంది. 

ఎవరీ జాహ్నవి?
కర్నూలుకు చెందిన తెలుగమ్మాయి జాహ్నవి. నిఫ్ట్‌లో ఫ్యాషన్‌ టెక్నాలజీ చదివిన ఆమె మొదట్లో షార్ట్‌ ఫిలిం డైరెక్టర్‌ హరీశ్‌ నాగరాజుతో కలిసి కొన్ని లఘుచిత్రాలకు పని చేసింది. అలా మహాతల్లి- మహానుభావుడు అనే వెబ్‌సిరీస్‌లో నటించింది. ఇది ఎంతలా క్లిక్‌ అయిందంటే జాహ్నవి మహాతల్లి పేరిట సొంతంగా ఓ ఛానలే ప్రారంభించింది. వెబ్‌ సిరీస్‌లు చేస్తూ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ బాగా పాపులర్‌ అయింది.

అన్ని రకాల విషయాలపై తనదైన రీతిలో వీడియోలు చేస్తూ ఉంటుంది. లై, మెంటల్‌ మదిలో వంటి చిత్రాల్లోనూ నటించింది. కొన్నేళ్ల క్రితం సుశాంత్‌ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అందరిలాగే ఈ జంట కూడా సొంతిల్లు ఉండాలని కల గనేవారు. తాజాగా ఆ కలను వీరు సాకారం చేసుకోవడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 

 

చదవండి: వార్‌ 2 కోసం జూనియర్‌ ఎన్టీఆర్‌ కసరత్తులు.. అది లీక్‌ చేయొద్దనే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement