ప్రముఖ యూట్యూబర్, నటుడు ప్రసాద్ బెహరాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యువ నటి ఫిర్యాదు ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతనితో కలిసి ఓ వెబ్ సిరీస్‌లో నటించిన సదరు నటిని లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో ప్రసాద్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
కాగా.. ప్రసాద్ బెహరా యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌ల ద్వారా టాలీవుడ్‌లో ఫేమస్ అయ్యారు. అంతేకాకుండా మావిడాకులు, పెళ్లివారమండి లాంటి సిరీస్‌లతో ప్రేక్షకులను అలరించారు. ఈ ఏడాది రిలీజైన కమిటీ కుర్రోళ్లు చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించారు.
అసభ్యంగా తాకుతూ..
ఓ వెబ్ సిరీస్ షూటింగ్‌లో తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ యువనటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో చాలాసార్లు అలానే ప్రవర్తించాడని యువతి ఆరోపించింది. అందరిముందే సెట్‌లో తన బ్యాక్ టచ్ చేశాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. అందరిముందు తనను అసభ్యంగా తాకుతూ పరువు పోయేలా ప్రవర్తించాడని యువతి వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment