వైవా హర్ష గృహప్రవేశం.. అటెండ్‌ అయిన మెగా హీరో ! | Viva Harsha New House Warming Function - Sakshi
Sakshi News home page

Viva Harsha: కొత్తింట్లో అడుగుపెట్టిన యూట్యూబ్‌ సెన్సేషన్‌ వైవా హర్ష, గృహప్రవేశం ఫోటోలు వైరల్‌

Aug 31 2023 9:09 AM | Updated on Sep 4 2023 11:33 AM

Viva Harsha New House Warming - Sakshi

ఇంట్లో పాలు పొంగించి, పూజ చేసుకున్న ఫోటోలను అతడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఈ గృహప్రవేశానికి మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ వచ్చి హర్షకు శుభాకాంక్షలు తెలిపాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కొత్తింట్లో అడుగుపెట్టిన హర్షకు సెలబ్రిటీలు, అభిమానులు కంగ్రాట్స్‌ చెప్తున్నారు.

ప్రముఖ కమెడియన్‌, యూట్యూబర్‌ వైవా హర్ష కొత్తింటి కల సాకారం చేసుకున్నాడు. తాజాగా అతడు తన భార్యతో కలిసి గృహప్రవేశం చేశాడు. ఇంట్లో పాలు పొంగించి, పూజ చేసుకున్న ఫోటోలను అతడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఈ గృహప్రవేశానికి మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ వచ్చి హర్షకు శుభాకాంక్షలు తెలిపాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కొత్తింట్లో అడుగుపెట్టిన హర్షకు సెలబ్రిటీలు, అభిమానులు కంగ్రాట్స్‌ చెప్తున్నారు.

యూట్యూబర్‌గా కెరీర్‌ ఆరంభించిన హర్ష.. వైవా కాన్సెప్ట్‌తో వీడియో తీసి బాగా పాపులర్‌ అయ్యాడు. అప్పటి నుంచి అతడి పేరు వైవా హర్షగా స్థిరపడిపోయింది. అతడి ప్రతిభకు యూట్యూబ్‌ నుంచే కాకుండా వెండితెర నుంచి కూడా అవకాశాలు వచ్చాయి. 2014లో మై నే ప్యార్‌ కియాతో సినిమాలో నటించిన హర్ష కలర్‌ ఫోటోలో కీలక పాత్రలో నటించాడు.

ఇప్పటివరకు కమెడియన్‌గా, హీరో స్నేహితుడిగా నటించిన హర్ష సుందరం మాస్టర్‌ సినిమాతో హీరోగా మారుతున్నాడు. ఈ చిత్రంతో కళ్యాణ్‌ సంతోష్‌ దర్శకుడిగా పరిచయం అవుతుండగా ఆర్‌టీ టీమ్‌ వర్క్స్‌, గోల్డెన్‌ మీడియా బ్యానర్లపై రవితేజ, సుధీర్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించింది.

చదవండి: 99% పక్కా అన్నారు, ఏమైందో మరి.. చివరికి నన్ను తీసేశారు.. మై విలేజ్‌ షో అనిల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement