#Mentoo Movie OTT Release Date and Platform - Sakshi
Sakshi News home page

Mentoo Movie: విడుదలైన రెండు వారాలకే ఓటీటీకి.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Published Sat, Jun 3 2023 8:33 AM | Last Updated on Sat, Jun 3 2023 1:42 PM

Tollywood Movie Mentoo Ott Release On AHA On June 9th - Sakshi

నరేష్ అగస్త్య, కౌశిక్, మౌర్య సిద్ధవరం, వైవా హర్ష, ప్రియాంక శర్మ, బ్రహ్మాజి, సుదర్శన్, రియా సుమన్‌, ప్రియాంక శర్మ  ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం మెన్‌టూ (#MenToo). బీయింగ్‌ ఏ మ్యాన్‌ ఈజ్‌ నాట్‌ ఈజీ. అనేది ఉపశీర్షిక. శ్రీకాంత్ జి.రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించారు.  హీరోగా నటించిన మౌర్య సిద్ధవరం నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం మే 26న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే కేవలం రెండు వారాల్లోనే ఈ చిత్రం ఓటీటీకి రానుంది. 

(ఇది చదవండి: Mentoo Movie: #మెన్‌టూ మూవీ రివ‍్యూ)

ఈ మూవీ జూన్‌ 9 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్‌ కానుందని మేకర్స్ వెల్లడించారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. సినిమా స్టిల్‌ని షేర్‌ చేస్తూ.. ప్రపంచ పురుషోత్తములారా.. ఈ బిగ్‌ అనౌన్స్‌మెంట్‌ మీ కోసమే అంటూ క్యాప్షన్‌ పెట్టింది. పురుషుల కష్టాలు ఎలా ఉంటాయో చూపించే కథతో ఈ సినిమా తెరకెక్కించారు. ఈ చిత్రం కామెడీతో మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించేందుకు వచ్చేస్తోంది. థియేటర్లలో చూడలేనివారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. 

(ఇది చదవండి: టీవీ షోలో నాపై చవకబారు కామెంట్లు.. యాంకర్‌ విరగబడి నవ్వింది)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement