అందుకే ఇంత లావయ్యాను.. చిన్నప్పుడు ఆ భయం ఉండేది: వైవా హర్ష | Viva Harsha Comments On His Body Shaming | Sakshi
Sakshi News home page

Viva Harsha: డబ్బులు కోసమే ఆ పాత్రలు చేశా!

Published Sun, Feb 18 2024 1:57 PM | Last Updated on Sun, Feb 18 2024 3:41 PM

Viva Harsha Comments On His Body Shaming Latest Interview - Sakshi

బాడీ షేమింగ్ అనేది సినిమాల్లో ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు షోల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మాట పడిన కమెడియన్స్.. బయటకు నవ్వుతూ కనిపించినా సరే లోలోపల చాలా కుమిలిపోతుంటారు. అయితే ఇలాంటి అనుభవాల్ని ఎప్పుడో ఓసారి బయటపెడితే తప్పితే ఈ విషయాలు బయటకురావు. అలా కమెడియన్ వైవా హర్ష.. తన రంగు, శరీరాకృతిపై ఇండస్ట్రీలో పడ్డ మాటల్ని, ఎదుర్కొన్న అనుభవాల్ని బయటపెట్టాడు. తాజాగా 'సుందరం మాస్టర్' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇవన్నీ రివీల్ చేశాడు.

(ఇదీ చదవండి: మెగా హీరో మూవీకి చిక్కులు.. షూటింగ్‌కి ముందే నోటీసులు)

'ఆస్తమా తగ్గడం కోసం చిన్నప్పుడు స్టెరాయిడ్ ఉపయోగించాల్లి వచ్చింది. ఫలితంగా నేను బొద్దుగా అయిపోయాను.  స్కూల్ చదువుతున్న టైంలోనే లావుగా ఉన్నానని ఏడిపించేవారు. ట్రైన్‌లో పేరెంట్స్‌తో వెళ్లాలన్నా సరే చాలా భయంగా ఉండేది. ఎందుకంటే.. 'వాడు చూడు ఎంత నల్లగా ఉన్నాడోనని' అని నన్ను చూపించి.. ఎదురుగా ఉన్నవాళ్లు మాట్లాడుకుంటారని భయంగా ఉండేది'

''కలర్ ఫోటో' సినిమా చేసేంతవరకు కూడా.. అరె మనం ఇండస్ట్రీకి వచ్చిన ఏం చేస్తున్నాం అని అనుకునేవాడిని. కానీ బిల్స్ కట్టడం కోసం ఇష్టం లేకపోయినా సరే పిచ్చి పిచ్చి పాత్రలన్నీ చేశా. ఈ క్రమంలోనే అస్సలు ఇక్కడ ఉండాలనిపించేది కాదు, ఎక్కడికైనా పారిపోవాలనిపించేది.. ఏంటి ఇక్కడికి వచ్చింది ఇది చేయడానికి కాదు కదా అనిపించేది. అ‍ప్పట్లో సెట్స్ మీద నా కలర్, బాడీ గురించి జోకులు వేసేవారు. అయినా సరే డబ్బులు కోసం అవన్నీ భరించాను. ప్రస్తుతం వ్యక్తిగతంగా ఎవరేం కామెంట్ చేయనప్పటికీ.. డిజిటల్ మాధ్యమాల్లో మాత్రం నాపై ఇప్పటికీ జోకులు వేస్తుంటారు' అని వైవా హర్ష చెప్పుకొచ్చాడు. 

(ఇదీ చదవండి: పార్టీ పేరు మార్చిన స్టార్ హీరో విజయ్.. ఎందుకంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement