# Smriti Irani Performs Griha Pravesh కేంద్ర మంత్రి ,అమేథీ ఎంపీ స్మృతి ఇరానీ కొత్త ఇంట్లోకి ప్రవేశించారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో 'గృహ ప్రవేశ' వేడుకలు సాంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. స్మృతి, జుబిన్ ఇరానీతో కలిసి గురువారం అమేథీలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఉజ్జయని పూజారి ఆశిశ్ మహరాజ్ ఆధ్వర్యంలో గృహ ప్రవేశ వేడుకను నిర్వహించారు.
విజయవంతమైన నటిగా , పార్లమెంటేరియన్‌గా మాత్రమేకాకుండా సోషల్ మీడియా యాక్టివ్‌గా ఉంటారు. ఈ నేపథ్యంలోనూ ఆమె తన భర్త జుబిన్ ఇరానీతో కలిసి నిర్వహించిన వేడుక ఫోటోలను షేర్ చేశారు.
అందమైన మెరూన్ , పసుపు రంగు చీరలో, క్రీమ్-హ్యూడ్ కుర్తాలో జుబిన్ హుందాగా కనిపించారు. ‘‘దుర్గామాత కృప, మహదేవుడి ఆశీర్వాదంతోపాటు, పెద్దోళ్ల ఆదరణ, చిన్నోళ్ల ప్రేమ, స్నేహంతో అమేథీలో కట్టుకున్న కొత్త ఇంట్లోకి ప్రవేశించా’’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో రానున్న ఎన్నికల్లో రాహుల్ గాంధీ, స్మృతి మధ్య పోటీ పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
#WATCH | Union Minister Smriti Irani and her husband Zubin Irani perform rituals at the 'Griha Pravesh' ceremony at their residence in Amethi, Uttar Pradesh. pic.twitter.com/dN4EoBXZkX
— ANI (@ANI) February 22, 2024
సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అమేథీలో ఆమె గృహ ప్రవేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల్లో తాను గెలిస్తే అమేథీని శాశ్వత ఇంటి అడ్రస్‌గా మార్చుకుంటానని స్మృతి ఇరానీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ కంచుకోట అమేథీలో తొలిసారి రాహుల్ గాంధీని ఓడించారు. అంతేకాదు ఈ వారం ప్రారంభంలో, రాబోయే ఎన్నికల్లో అమేథీ నుండి తనపై పోటీ చేయాలని స్మృతి, రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు.
బీజేపీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన స్మృతి 2014లో రాహుల్ గాంధీతో పోటీపడి ఓటమి పాలయ్యారు. కానీ 2004 నుంచి వరుసగా మూడు సార్లు గెలుపొందిన రాహుల్‌ని ఓడించి 2019లో సంచలన విజయం సాధించారు. 2019 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా 2021లో అమేథీ గౌరీగంజ్ తహసీల్‌లోని మావాయి గ్రామంలో 15వేల చదరపు అడుగుల స్థలం కొనుగోలు చేశారామె. 2023లో ‘కిచ్డీ భోజ్’ కార్యక్రమం నిర్వహించి స్మృతి తాజాగా గృహ ప్రవేశం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment